singles titles
-
ఓవర్‌నైట్ చాంపియన్లు కారు
వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్ టైటిల్స్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఆకుల శ్రీజ. ఆమె అర్జున అవార్డు సహా ఎన్నో పతకాలు గెలుచుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ‘పిల్లలకు చదువు ఒక్కటే కాదు, క్రీడారంగాన్నీ పరిచయం చేసినట్లయితే అన్ని వైపులా అభివృద్ధి చెందుతారు’ అంటారు శ్రీజ తల్లిదండ్రులు ఆకుల ప్రవీణ్‌కుమార్, సాయిసుధ. పిల్లల పెంపకంలో తమ పాత్ర గురించి ప్రవీణ్‌కుమార్ తెలిపిన సంగతులు...‘‘నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌ని. రోజూ ప్రాక్టీస్‌కి వెళ్లేవాడిని. పిల్లల చిన్నప్పుడు వారిని రెండు, మూడు స్పోర్ట్స్ మీట్స్‌కు తీసుకెళ్లాను. అక్కడ మ్యాచ్‌లో గెలుపొందినవారికి ప్రైజులు ఇవ్వడం, అందరూ చప్పట్లు కొట్టడం చూసి, మా పెద్దమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. ‘డాడీ నాకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారా’ అని అడిగింది. అంతేకాదు, స్కూల్ నుంచి వస్తూనే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్‌కు వెళదామని రెడీ అయిపోయేది. ‘నేను కూడా చాంపియన్ని అవుతాను’ అనేది. రోజూ నాతో పాటు ప్రాక్టీస్‌కు రావడం చూసి, అకాడమీకి తీసుకెళ్లాను. అక్కడ తను బాగా ఆడటం చూసినవాళ్లు మెచ్చుకోవడంతో మరింతగా ప్రాక్టీస్ చేసేది. అక్కను చూసి చెల్లెలు..రవళి మెడల్స్ తీసుకోవడం చూసి, చిన్నమ్మాయి శ్రీజ ‘నేను కూడా టేబుల్ టెన్నిస్ ఆడతాను’ అంది. శ్రీజను కూడా టేబుల్ టెన్నిస్‌లో చేర్పించాను. ఇద్దరూ స్పోర్ట్స్‌లో మంచి ప్రతిభ చూపించేవారు. దీంతో ప్రతి కాంపిటిషన్లో వాళ్లు పాల్గొనేలా చూసేవాడిని. గేమ్ పూర్తయ్యేంతవరకు ఉండి, తీసుకొచ్చేవాడిని. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ప్రైవేట్‌గా..!పిల్లల చిన్నప్పుడు నాకు ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో అసిస్టెంట్ ఉద్యోగం. నా భార్య ఎల్ఐసీలో జాబ్. ప్రభుత్వ ఉద్యోగాలే అయినా జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉండేవి. దీంతో, ఆ జాబ్ మానేసి, జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా చేరాను. అప్పుడు ‘మా అమ్మనాన్నలు, బంధువులు గవర్నమెంట్ జాబ్ వదులుకోవద్దు’ అని చెప్పారు. కానీ, వాళ్ల మాటలను పట్టించుకోలేదు. నా భార్య సపోర్ట్ చేసింది. నెల జీతం పెరగడం వల్ల ఇద్దరమ్మాయిలను అకాడమీలో చేర్పించడం, వారు కాంపిటిషన్స్‌లో పాల్గొనేలా చూడటం సులువైంది. రాత్రికి రాత్రి చాంపియన్లు అవరుమనమేవో త్యాగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లలు రాత్రికి రాత్రి చాంపియన్లు కావాలనుకోకూడదు. ‘గెలుపు ఓటములు పట్టించుకోకుండా, మీ కృషి మీరు చేయండి. ప్రతీసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి’ అని పిల్లలకు చెబుతుండేవాళ్లం. పిల్లలు ఓడిపోయినప్పుడు మా బంధువులు ‘అయ్యో, మీరు గవర్నమెంట్ జాబ్ వదలుకున్నారు, కానీ వాళ్లు ఓడిపోయారు’ అన్నట్టుగా మాట్లాడేవారు. ‘పిల్లలను బెస్ట్‌గా ప్రయత్నంచమని చెప్పండి. అంతేకాని, వారు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకూడదు’ అని మా పేరెంట్స్‌కి, బంధువులకు గట్టిగా చెప్పాం. బంగారు పతకాలుపెద్దమ్మాయి టెన్త్ పూర్తయ్యాక ఒక కాన్సెప్ట్ కాలేజీలో జాయిన్ చేశాం. వాళ్లు ముందుగా స్పోర్ట్స్‌కి సపోర్ట్ చేస్తాం అన్నారు. తర్వాత మూడు నెలలకు ‘మీ అమ్మాయి బాగా చదువుతోంది – గ్రేడ్స్ ముఖ్యం’ అన్నారు. దీంతో రవళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఆపేసింది. చిన్నమ్మాయి విషయంలో అలా జరగకూడదని తనని బద్రుకా కాలేజీలో చేర్పించాం. ముందుగానే కాలేజీ యాజమాన్యంతో ‘స్పోర్ట్స్‌కు ప్రాముఖ్యం ఇస్తేనే చేర్పిస్తాం’ అని చెప్పాం. కాలేజీ వాళ్లు సపోర్ట్ చేశారు. శ్రీజ ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్‌గా గోల్డ్ మెడల్ సాధించింది. దానికి కారణం మా ఆవిడ సాయిసుధ. శ్రీజతో పాటు తనూ టోర్నమెంట్స్‌కు వెళ్లేది. ట్రెయిన్లో, రూములో, మ్యాచ్ మధ్యలో వీలు దొరికనప్పుడల్లా చదివించేది. ఇద్దరి కృషి...పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులిద్దరి కృషి ఉండాలి. స్పోర్ట్స్‌లో నేను కేర్ తీసుకుంటే, చదువు విషయంలో సాయిసుధ శ్రద్ధ తీసుకుంది. పిల్లల కెరీర్ గురించి ఆలోచించి మా ఆవిడ జాబ్‌లో ప్రమోషన్లు కూడా తీసుకోలేదు. ప్రమోషన్ తీసుకుంటే ట్రాన్స్ఫర్లు అవుతాయని ఆలోచించి అధికారి హోదాను కూడా వద్దనుకుని, వీలైనంత టైమ్ పిల్లలకు కేటాయించేది. పిల్లలిద్దరూ స్పోర్ట్స్‌లో రాణిస్తూ, చదువులోనూ గోల్డ్ మెడల్స్ సాధించారు. స్పోర్ట్స్.. జాబ్..పెద్దమ్మాయి ఇంటర్మీడియట్లో ఆపేసిన స్పోర్ట్స్ సీబీఐటీలో చేరాక స్టార్ట్ చేసింది. ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లీడ్ చేసేది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసింది. ఇప్పుడు అమెరికాలో సెటిలైంది. చిన్నమ్మాయి శ్రీజకి పద్దెనిమిదేళ్లకు ఆర్బీఐలో జాబ్ వచ్చింది. ప్రాక్టీస్‌కు, టోర్నమెంట్స్‌లో పాల్గొనడానికి వీలుంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూనే ఫిజికల్ ఫిట్నెస్, ప్రాక్టీస్, టైమ్ ప్లానింగ్ గురించి చాలా క్రమశిక్షణగా ఉంటుంది. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం. వారికోసం ఏమైనా చేస్తాం. దానిని పిల్లలు అర్ధం చేసుకొని, వారి భవిష్యత్తును బాగా మలచుకుంటే పెద్దలుగా మనకూ ఆనందం. నేటి తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దాంతో పిల్లలకు ఒకవైపు మాత్రమే అవకాశాలు ఉంటున్నాయి. స్పోర్ట్స్‌లో అన్నివైపులా వృద్ధి ఉంటుంది. -
సెరెనా అదిరెన్...
తనకెంతో కలిసొచ్చిన వేదికపై అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (24) ఆల్‌టైమ్ రికార్డును సమం చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్న 38 ఏళ్ల సెరెనా ఈ క్రమంలో కొత్త రికార్డును సృష్టించింది. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ప్లేయర్‌గా సెరెనా ఘనత వహించింది. 101 విజయాలతో అమెరికాకే చెందిన మరో దిగ్గజం క్రిస్ ఎవర్ట్ పేరిట ఇన్నాళ్లూ ఉన్న రికార్డును 102వ విజయంతో సెరెనా బద్దలు కొట్టింది. 1998లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఆడిన సెరెనా ఈ మెగా టోర్నీలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈసారీ సెరెనా గెలిస్తే అత్యధికసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా క్రిస్ ఎవర్ట్ (6 సార్లు) పేరిటే ఉన్న రికార్డును సవరించి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. న్యూయార్క్: కరోనా వైరస్ భయంతో యూఎస్ ఓపెన్ టోర్నీకి టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు గైర్హాజరీ అయిన స్థితిలో... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... చరిత్రలో స్థానం సంపాదించేందుకు అమెరికా మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడుగు వేసింది. గత రెండేళ్లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్న సెరెనా ఈసారి మాత్రం ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సెరెనా 7–5, 6–3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్‌పై విజయం సాధించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లోసెరెనా 13 ఏస్‌లు సంధించింది. కెరీర్లో 20వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా తాజా గెలుపుతో ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా (పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలు కలిపి) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకుంది. 101 విజయాలతో క్రిస్ ఎవర్ట్ (అమెరికా) పేరిట ఉన్న ఈ రికార్డును సెరెనా అధిగమించింది. ఒకవేళ సెరెనా ఈసారి చాంపియన్‌గా నిలిస్తే అత్యధికంగా ఏడుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది. 1998లో ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014)... నాలుగుసార్లు రన్నరప్‌గా (2001, 2011, 2018, 2019) నిలిచింది. 2003, 2017లలో సెరెనా ఈ టోర్నీలో ఆడలేదు. యూఎస్ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా రెండు టోర్నీలు ఆడిన సెరెనా రెండింటిలోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆమె మూడు సెట్లపాటు పోరాడాల్సి వచ్చింది. ‘యూఎస్ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక రికార్డు బద్దలు కొట్టానని నాతో చెబుతుంటారు. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. వాటి గురించి ఆలోచించడంలేదు. టైటిల్ గెలవడమే నా ముందున్న లక్ష్యం’ అని సెరెనా వ్యాఖ్యానించింది. మాజీ చాంపియన్ క్లియ్‌స్టర్స్‌కు నిరాశ... ఎనిమిదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పునరాగమనం చేసిన మూడుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో 37 ఏళ్ల క్లియ్‌స్టర్స్ 6–3, 5–7, 1–6తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–2, 6–2తో విక్‌మాయెర్ (బెల్జియం)పై, తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్) 7–6 (9/7), 6–1తో హీథెర్ వాట్సన్ (బ్రిటన్)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/1), 6–4తో ఒషీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–1తో తిమియా బాబోస్ (హంగేరి)పై, ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–2తో బార్బరా హాస్ (ఆస్ట్రియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో కెర్బర్, క్విటోవా.... మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత కెర్బర్ (జర్మనీ), ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ పెట్రా మార్టిక్ (క్రొయేషియా), 14వ సీడ్ అనెట్ కొంటావె (ఎస్తోనియా) మూడో రౌండ్లోకి చేరారు. రెండో రౌండ్లో కెర్బర్ 6–3, 7–6 (8/6)తో ఫ్రీడ్సామ్ (జర్మనీ)పై, మార్టిక్ 6–3, 6–4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)పై, కొంటావె 6–4, 6–1తో కయా యువన్ (స్లొవేనియా)పై, క్విటోవా 7–6 (7/3), 6–2తో కొజ్లోవా (ఉక్రెయిన్)పై గెలిచారు. అయితే 12వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 1–6, 2–6తో సస్నోవిచ్ (బెలారస్) చేతిలో... 30వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 6–1, 6–7 (2/7), 0–6తో గ్రషెవా (రష్యా) చేతిలో ఓడిపోయారు. వీనస్ రికార్డు... అత్యధికసార్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన క్రీడాకారిణిగా వీనస్ విలియమ్స్ (అమెరికా) రికార్డు సృష్టించింది. సెరెనా అక్క అయిన 40 ఏళ్ల వీనస్ యూఎస్ ఓపెన్‌లో 22వసారి బరిలోకి దిగింది. అయితే ఆమెకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 7–5తో వీనస్‌ను ఓడించింది. ఇప్పటిదాకా మార్టినా నవ్రతిలోవా (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును వీనస్ సవరించింది. ముర్రే అద్భుతం... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) అద్భుత విజయం సాధించాడు. దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 6–4తో యోషిహిటో నిషియోక (జపాన్)పై గెలుపొందాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. వరుసగా రెండు సెట్లు చేజార్చుకున్నాక విజయాన్ని అందుకోవడం ముర్రే కెరీర్లో ఇది పదోసారి కావడం విశేషం. మూడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్), పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. దివిజ్ శరణ్ జంట ఓటమి పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)–నికోలా కాచిచ్ (సెర్బియా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. శరణ్–కాచిచ్ ద్వయం 4–6, 6–4, 3–6తో కూలాఫ్–మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. -
ఆలిండియా ఇన్‌కం ట్యాక్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్‌కం ట్యాక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను పియూష్ సమారియా(ఆంధ్రప్రదేశ్) కైవసం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను లీనా రఘునందన్(కర్ణాటక) గెల్చుకుంది. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో పియూష్ 21-15, 21-19తో కాశీ విశ్వనాథ్ రాజు(ఏపీ)పై నెగ్గాడు. మహిళల ఫైనల్లో లీనా (కర్ణాటక) 21-15, 21-17తో శ్రీవిద్యా (కర్ణాటక)పై గెలిచింది. విజేతలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి. శీలం ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. డబుల్స్ ఫైనల్ ఫలితాలు పురుషుల డబుల్స్: 1.తిజేందర్ సింగ్, పి.నాగేష్ జోడి (ముంబై), 2.కాశీ విశ్వనాథ్ రాజు, ఎం.ఎస్.ఎస్.ఎన్.శ్రీనివాస్ జోడి (ఏపీ). మహిళల డబుల్స్: 1.ప్రమోద నటరాజ్, శ్రీవిద్యా సతీష్ అయ్యర్ జోడి(కర్ణాటక), 2. లీనా రఘునందన్, ఎస్.గాయత్రి జోడి(కర్నాటక).


