‘ఎమ్మెల్యే ఉద్యోగ మేళా’కు విశేష స్పందన
భివండీ: పట్టణంలోని పద్మనగర్‌లో శివసేన ఎమ్మెల్యే రుపేశ్ మాత్రే ఏర్పాటు చేసిన ‘ఎమ్మెల్యే ఉద్యోగ మేళా’కు విశేష స్పందన లభించింది. అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో తెలుగు ప్రజాసేవ సంస్థ, మహేంద్ర సమాజ్ కళ్యాణ్ కారీ సంస్థ నేతృత్వంలో నిర్వహించిన ఈ మేళాలో సుమారు 9500 మంది పాల్గొన్నారని, వీరిలో 3,500 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా కంపెనీ, సెరికో, ఫేస్ సెట్టర్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, బిగ్‌బజార్, ఫాంటలూస్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి.