breaking news
Shesha sai
-
ఇన్ఫీ మూర్తివి తప్పుడు ఆరోపణలు
కంపెనీ మాజీ చైర్మన్ శేషసాయి న్యూఢిల్లీ: ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆరోపణలపై మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి ఎదురుదాడికి దిగారు. మూర్తి తనపై ‘వ్యక్తిగత దాడులకు’ దిగుతున్నారని, ‘తప్పుడు ఆరోపణలు చేస్తూ.. అభాండాలు వేస్తున్నారని‘ వ్యాఖ్యానించారు. అదే పనిగా కక్ష సాధింపు చర్యలను కొనసాగించడం వెనుక కారణాలేమిటో తనకు అర్థం కావడం లేదంటూ పేర్కొన్నారు. ‘నేను ఇన్ఫీ బోర్డు నుంచి వైదొలిగిన రోజు నుంచీ అనేక కవ్వింపు చర్యలు ఉంటున్నప్పటికీ.. బహిరంగంగా ఎలాంటి ప్రతికూల ప్రకటనలూ చేయలేదు. గత వివాదాలతో సతమతం కాకుండా కంపెనీ ముందుకెళ్లాలని నిజాయితీగా నేను ఆకాంక్షిస్తుండటమే ఇందుకు కారణం’ అని శేషసాయి చెప్పారు. ఇటీవలి ఇన్వెస్టర్ల సమావేశంలో మూర్తి తనపై వ్యక్తిగతంగా తప్పుడు అభియోగాలు మోపడం వల్లే తాను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. తాను మూర్తి ఆహ్వానం మేరకే ఇన్ఫీలో చేరానని, నైతికతకు నిలువెత్తు నిదర్శనం అంటూ కొద్ది నెలల క్రితమే కితాబిచ్చిన నారాయణ మూర్తి.. అంతలోనే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వెనుక కారణాలేంటో అర్థం కావడం లేదన్నారు. గవర్నెన్స్‌పై వాటాదారులతో చర్చలు: ఇన్ఫీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య విభేదాలతో వివాదాల్లో చిక్కుకున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. మళ్లీ కార్యకలాపాలను గాడిన పెట్టడంపై దృష్టి సారిస్తోంది. సంస్థలో పాలనాపరమైన ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో పాటించే దిశగా తీసుకోతగిన చర్యలపై షేర్హోల్డర్లతో సంప్రతింపులు జరుపుతున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఇన్ఫోసిస్ తెలిపింది. -
కవివంశం చరిత్ర
పుస్తక పరిచయం తాళ్లపాక కుటుంబంలో తాత నుండి మనుమడి తరందాకా అందరూ కవులే! అట్లాగే, కూచిమంచి తిమ్మకవి నుంచి ఆయన మునిమనుమడి దాకా అందరూ కవులే! అయితే, ఒక వంశం వంశమంతా ‘కవివంశం’ అయిన చరిత్ర ‘మరింగంటి’ వారిది! సుమారు ఐదువందల ఏళ్లుగా వీళ్ల కుటుంబాలు సాహిత్యానికి అంకితమైనాయి. వీరిలో తొలికవుల్లో ఒకరైన సింగరాచార్యులు ఇబ్రహీం కుతుబ్‌షాహీల నాటివాడు; పొన్నికంటి తెలగన సమకాలికుడు. ద్విపదలు, యక్షగానాలు, నాటకాలు, శతకాలు, హరికథలు, తిరునామాలు, మంగళహారతులు, చాటువులు... ఇట్లా ఎన్నో ప్రక్రియల్లో మరింగంటి వారు రచనలు చేశారు. అందులో, శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకళ్యాణం (ప్రబంధం-సింగరాచార్యులు), విష్వక్సేన ప్రభాకరము (ప్రబంధం-వేంకట నరసింహాచార్యులు- రెండవ), యాదగిరి నరసింహ శతకము (అప్పలాచార్యులు), కన్నీటిధార (లఘుకృతి- రామాచార్యులు), సుందరీ విలాసము (నాటకం-వేంకట నరసింహాచార్యులు- ఐదవ), శఠవైరి వైభవ దివాకరమ్ (అలంకారశాస్త్రం- నరసింహాచార్యులు) లాంటివి మచ్చుకు కొన్ని. ప్రధానంగా నల్లగొండకు చెందిన వారైనప్పటికీ వీరు కాలక్రమంలో కరీంనగర్, కృష్ణా, ఖమ్మం, తూర్పు గోదావరి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, విశాఖపట్టణం, శ్రీకాకుళం, హైదరాబాద్ జిల్లాలకు విస్తరించారు. మల్లంపల్లి మరింగంటి, బొబ్బిలి మరింగంటి, వేములవాడ మరింగంటి లాంటి భిన్న శాఖలుగా విడివడ్డారు. తిరిగి వీరందరినీ, ‘మరింగంటి కవుల సాహిత్య సేవ’ పేరిట ఒక దగ్గరకు చేర్చారు డాక్టర్ శ్రీరంగాచార్య. సాహిత్యకృషి చేసిన మరింగంటి వారి జీవనరేఖలు, వారి రచనలను పరిచయం చేశారు. వాళ్ల వివరాల సేకరణకు ఆయా ప్రాంతాలన్నింటా తిరగడం ఒక ఎత్తయితే, సుమారు 200 ముద్రిత, ఆముద్రిత రచనల్ని పరిచయం కోసం చదవడం మరొక ఎత్తు. 1989లో కాకతీయ విశ్వవిద్యాలయంలో సమర్పించిన ఈ సిద్ధాంత గ్రంథం, పాతికేళ్ల తర్వాత అదనపు సమాచారంతో తిరిగి వెలువడింది. - శేషసాయి