breaking news
Shaped
-
ఒక స్త్రీ జీవితం ఆధారంగా కేరాఫ్ దెయ్యం...
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్ఎం వెంకట రవీందర్ నాథ్ దర్శకత్వంలో పెదారికట్ల చేనెబోయిన్న నరసమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించారు. ‘‘హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల జరిపిన రెండో షెడ్యూల్లో రవిబాబుపై సీన్స్ తీశాం. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. -
మేథకు అందనిది
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మగా చెప్పబడే అనంతమైన శక్తి నిరాకారమైనది. ఎందుకంటే, పరిమితంగా ఉంటేనే కదా ఆకృతి కనిపించేది. ఎక్కడా అణువంత ఖాళీ లేకుండా విశ్వమంతా నిండి ఉన్న ఆ అనంత శక్తికి పదార్థ లక్షణాలు కానీ, కాంతి, శబ్దం, ఉష్ణం, ఆకర్షణ లాంటి శక్తి రూపాలకుండే లక్షణాలు కానీ ఏవీ లేవు. ఏ పరిమాణాలకూ, కొలతలకూ చిక్కకుండా, నిశ్చలంగా ఉంది. ఆస్టన్రామికల్ యూనిట్, కాంతిసంవత్సరాలు, పార్సెక్ లు, మెగా పార్సెక్ లాంటి ఖగోళదూరాలు కొలిచే ఏ ప్రమాణాలూ ఆ అనంతశక్తిని ఇసుమంత కూడా కొలవలేవంటే అతిశయోక్తికాదు.అంతటి శక్తిలోనుండే ఈ దృశ్యమాన ప్రపంచం పుట్టుతూ, గిట్టుతూ ఉంది. ఒక ప్రాంత జనాభా ఏవిధంగాౖ నయితే స్థిరంగా ఉండదో, అదేవిధంగా ఈ దృశ్యమాన ప్రపంచంలో ఖగోళ పదార్థాల సంఖ్యా స్థిరంగా ఉండదు. ఒక గ్యాలక్సీ పుట్టి, ఎదిగి, మళ్లీ ఆ అనంతశక్తిలో కలిసిపోయే లోపల మరెన్నో గ్యాలక్సీలు ఎక్కడెక్కడో రూపుదిద్దుకుంటూనే ఉంటాయి. ఈ ప్రక్రియ నిరంతర స్రవంతి. తనలో తాను, తనంత తానుగా పరిణామం చెందుతూ స్థిరంగా ఉండటమే వైచిత్రి. అట్టి ఆత్మను సందర్శించడం ఒక యోగం. యోగం అంటే కలయిక. ఆత్మతో అభేదాన్ని సాధిస్తేనే సందర్శించినట్టు. అణువణువూ నిండి ఉన్న అనంత శక్తిని అనుభవించడం ఒక ఉత్కృష్ట మానసిక స్థితి. భగవద్గీతలో కేవలపదార్థ రూపాన్నే అర్జునుడు దర్శించాడు. అంతకుమించిన జ్ఞానమార్గంలో శోధిస్తేనే మనం భగవంతుని లేదా ఆత్మను లేదా అనంత శక్తిని సందర్శించగలము. ఈ సందర్శన ఇంద్రియాలైన కన్నుల ద్వారానో, చెవుల ద్వారానో, స్పర్శ ద్వారానో, వాసన ద్వారానో, రుచిద్వారానో కాదు. మనసు ద్వారా మాత్రమే సందర్శించడమౌతుంది. వేరే మార్గం లేదు. కేవలం మనసు మాత్రమే సరిపోతుందా అంటే అదీ సరిపోదు. ఆ మనసుకు జ్ఞానసహిత మేథస్సు పునాది అయి ఉండాలి. హేతువు ఆ మేథస్సుకు ఆలంబన కావాలి. బలమైన, స్థిరమైన, విస్తృతమైన మనసును సాధించిన సాధకుడు మాత్రమే ఆత్మ సందర్శనకు అర్హుడు ఔతాడు. ఆ ఆత్మ లేక అనంత శక్తిని దృఢమైన మనసు నిండా నింపుకోవాలి. అంతటి అనంతశక్తిని మనసులో ఎలా కుదించుకోగలమనేది ప్రశ్న.మనసుకు గొప్ప లక్షణాలు ఉన్నాయి. అది ఎక్కడికైనా పోగలదు, ఎంతైనా విస్తరించగలదు, దేన్నైనా సొంతం చేసుకోగలదు. ఈ గొప్ప లక్షణాలతోనే ఆ సర్వాంతర్యామిని సందర్శించాలి. మనసుతోనే తపించాలి. ఆ తపనయే నవవిధ భక్తులలో చివరిది, ఉతృష్టమైన ఆత్మనివేదనం. ఈ ఆత్మ నివేదనం బలమైన మనసులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ స్థితిలో సాధకునికి, అనంత శక్తి భేదం ఉండదు. అట్టి ఆత్మకు, సాధకుని రూపంలో ఉన్న చైతన్య పదార్థానికి అభేదం నెలకొల్పబడుతుంది. అప్పుడే సాధకుని లోపల భగవంతుడు పొసగగలుగుతాడు. ఇక సాధకునికి భగవంతుని వినా అన్యమైనది ఏదీ ఉండదు. ఈ విధంగా అంతటి ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుని, నిలుపుకోవడం ఎంతో కష్టం. సాధకుని మనస్సు ఎంతో దృఢమైనదై, నిశ్చలమైనదై ఉండాలి. ఎందుకంటే, మనసులో ఏకాగ్రత, బలీయమైన తపన లేనప్పుడు ఆ ఆత్మ మనసుకు చిక్కదు. అంతే కాకుండా ఆత్మ స్వరూపాన్ని హృదయాంతరాలలో నింపుకోవడం అత్యంత ఆనందదాయకం. ఆ ఆనందాన్ని భరించాలంటే సాధారణ మనసుకు సాధ్యం కాదు. ఆ ఆనందస్థితి చూసేవారికి విచిత్రం. అనుభవించే వారికి అనుపమాన అనుభూతి. – గిరిధర్ రావుల -
గన్ ఆకారం హీల్స్ వేసుకున్నందుకు...
వాషింగ్టన్ః తుపాకీ హీల్స్ ధరించి, బుల్లెట్ బ్రాస్లెట్లను బ్యాగ్ లో తీసుకెడుతున్న అమ్మాయికి అమెరికా ఎయిర్ పోర్టు అధికారులు అభ్యంతరాలు తెలిపారు. చూసేందుకు అచ్చం బులెట్లలా ఉన్నరెండు బ్రాస్టెట్లను బ్యాగ్ లో పెట్టుకొని, నిజం తుపాకీల్లా ఉన్నహై హీల్స్ ధరించడమే ఆమె ప్రయాణానికి అడ్డంకిగా మారింది. ప్రమాదకర వస్తువులతో ప్రయాణమైనట్లు అనుమానించిన ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అక్కడే నిలిపేశారు. అభ్యంతర కర వస్తువులతో ఆమె ట్రావెల్ చేయడంతో ఎంతో సమయం వృధా అయ్యిందని బాల్టిమోర్ వాషిగ్టన్ ఎయిర్ పోర్టు ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సభ్యురాలు లిసా ఫార్బెస్టన్ తెలిపారు. ఏజెంట్లు ఆమెవద్ద ప్రమాదకర వస్తువులున్నాయని గుర్గించారని, అందుకే ప్రత్యేక తనిఖీలు చేపట్టాల్సివచ్చిందని ఆమె అన్నారు. షూస్, బ్రాస్లెట్లు ధరించడం అభ్యంతరం కాదని, అయితే ఆయుధాలు, మందుగుండు సామగ్రి వంటివి తీసుకొని ప్రయాణించేందుకు టీఎస్ఏ అనుమతి ఉండదని ఆమె ఓ ట్వీట్లో తెలిపారు. అయితే ఆమె ఆ వస్తువులు చెక్ పాయింట్ దగ్గర చెక్డ్ బ్యాగ్ లో పెట్టుకున్నారని అనంతరం నియమాలకు విరుద్ధంగా బోర్డింగ్ సమయంలో వాటిని తీసి ధరించారని ఫార్బెస్టన్ తెలిపారు. కాగా ఆమెపై ఎటువంటి కేసులు పెట్టలేదని బాల్టిమోర్ సీబీఎస్ నివేదించింది. ప్రస్తుతం టీఎస్ఏ ఏజెంట్లకు తన బూట్లను అప్పగించి వెళ్ళిన యజమాని అడ్రస్ కోసం షూ తయారీదారుడు ఎదురు చూస్తున్నాడు. తన బూట్లను ఎయిర్ పోర్టులో వదిలి వెళ్ళిన మహిళకోసం శోధిస్తున్నట్లు ప్లెజర్ యుఎస్ఏ షూ కంపెనీ యజమానులు తమ కంపెనీ ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. దయచేసి తమను సంప్రదించాలని, తమ కారణంగా విమానం తప్పిపోయిన మహిళకు మరో బాండ్ గర్ల్ బూట్ల జతను ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు.