breaking news
shabbir hussain
-
క్లీనర్ సహాయంతో ఫిక్సింగ్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ షబ్బీర్ హుస్సేన్ వెల్లడించారు. మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోనూ మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్‌లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్ కార్డులు జారీ చేశారు. ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుకీలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు అనుమానించారు. స్టేడియంలో ఒక మూలన అతడిని చూసి పోలీసులు ప్రశ్నించగా తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లు చెప్పాడు. అదే నంబర్‌కు మళ్లీ డయల్ చేయమని అడగ్గా, ఆ వ్యక్తి సరిగ్గా సమాధానమివ్వలేదు. అతడిని పట్టుకునే లోపే రెండు ఫోన్లను వదిలేసి పారిపోయాడు. మ్యాచ్ జరుగుతున్న అసలు సమయానికి, టీవీలో ప్రసారానికి మధ్య క్షణకాలపు విరామం ఉంటుంది. దీనిని వాడుకొని ప్రతీ బంతికి ఫిక్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరో కేసు విచారణ సందర్భంగా ఐపీఎల్ దొంగ అక్రిడేషన్లు పొందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులను ఒక చోటికి చేర్చి దీనిపై çపూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని షబ్బీర్ హుస్సేన్ చెప్పారు. -
భూ పంపిణీలో గందరగోళం
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. దహెగాం, కాగజ్‌నగర్, సిర్పూర్ (టి), కౌటాల మండలాల లబ్ధిదారులకు పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. తమకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని 19, 22, 23, 25, 26 వార్డులకు చెందిన మహిళలు సబ్‌కలెక్టర్ ప్రశాంత్పాటిల్తో వాగ్వాదానికి దిగా రు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షబ్బీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం ఇళ్ల స్థలాల పట్టాలిచ్చినా.. ఇప్పటివరకు స్థలం చూపించడం లేద ని అన్నారు. స్థలం ఇచ్చాకే భూపంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పందించిన సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్ మాట్లాడుతూ.. రెవెన్యూ, మున్సిపల్, మండల అభివృద్ధి శాఖల అధికారులను సర్వే నిర్వహించాలని ఆదేశించామని చెప్పారు. త్వరలోనే ప్రతి ఒక్కరికీ భూమి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్పష్టమైన తేదీని ప్రకటిస్తేనే కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చూస్తామని షబ్బీర్‌హుస్సేన్, మహిళలు తేల్చిచెప్పారు. రెండు నెలల్లో స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని సబ్‌కలెక్టర్ భరోసా ఇచ్చారు. మరో పక్షం రోజు ల్లోనే ఎన్నికల కోడ్ రానుందని, రెండు నెలల వ్యవధి కాకుం డా త్వరగా భూములు చూపించాలని మహిళలు సబ్‌కలెక్టర్‌ను కోరారు. ఈనెల 25లోగా భూములు అందించేలా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య స్పష్టం చేశారు. నిరుపేదలకు న్యాయం చేస్తాం.. భూ పంపిణీలో నిరుపేదలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అన్నారు. భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 20 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశామన్నారు. సబ్‌కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ.. భూపంపిణీలో అవకతవకలు జరగకుండా చూస్తామన్నారు. అనంతరం వివిధ గ్రామాల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్, సిర్పూర్ (టి), కౌటాల, దహెగాం తహశీల్దార్లు మల్లేశ్, రమేష్‌గౌడ్, రియాజ్అలీ, వీఆర్వోలు, సర్పంచులు పాల్గొన్నారు.