breaking news
seva lal Maharaj
-
అందరికీ ఆరాధ్యుడు సేవాలాల్ మహారాజ్
గన్‌ఫౌండ్రీ: సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గిరిజన సంక్షేమ సంఘం, సేవా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమన్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు. బంజారా భవన్, కొమురం భీమ్ భవన్లను నిర్మిస్తున్నట్లు, త్వరలోనే వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ శంకర్ నాయక్, పార్లమెంటు సభ్యులు బీబీపాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ సీతారామ్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సేవాలాల్ మహరాజ్ అందరికీ ఆరాధ్యనీయుడు
గురు సేవాలాల్ మహరాజ్ తండా వాసులు, లంబాడా లకే కాకుండా ప్రజలందరికీ ఆరాధ్యనీయుడని గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. లంబాడలకు జాతిపిత అయిన సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఇంకా ప్రచారం, ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లాకు రూ.పదిలక్షల చొప్పున విడుదల చేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా త్వరలోనే నిధుల విడుదల ఉంటుందన్నారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకునిగురువారం మంత్రి చందూలాల్ నివాసంలో సంత్‌సేవాలాల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. కర్ణాటక, రాయలసీమ, తెలంగాణలలో విస్తృతంగా పర్యటించి,సుస్థిర సమాజం లేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా సంచారజీవనం గడుపుతున్న లంబాడ లను ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుడు సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు. గ్రామ సమీప ప్రాంతాల్లో తండాలుగా నివాసమేర్పరచుకుని సుస్థిర జీవనం గడపాలని సేవాలాల్ గురూజీ ఉద్భోదించారన్నారు. తన సొంత ఖర్చుతో సేవాలాల్ ఆలయాన్ని నిర్మించి ఏటా జయంతి వేడుకలను నిర్వహిస్తున్న ఇస్లావత్ నామానాయక్ను మంత్రి అభినందించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం ఉంటుందని చెప్పారు.