breaking news
sensations
-
కోకో గాఫ్‌కు 'షాక్'
వింబుల్డన్‌లో సంచలనాల మోత! ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకొచ్చిన కోకో గాఫ్, గత వారం జర్మనీలో ఇగా స్వియాటెక్‌ను ఓడించి టైటిల్‌తో ఈ గ్రాస్కోర్టులోకి దిగిన పెగూలా, రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ క్విటొవా, ఈ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ లోరెంజో ముసెట్టి, మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మెద్వెదెవ్, రూనె, ఐదోసీడ్ జెంగ్ క్విన్వెన్, 15వ సీడ్ కరోలినా ముకొవా... ఇలా టాప్ స్టార్లకు ఈ వింబుల్డన్ చేదు ఫలితాలనిచ్చింది. పెద్ద సంఖ్యలో సీడెడ్ ప్లేయర్లు మోయలేని భారంతో తొలి రౌండ్లోనే నిష్క్రమించేలా చేసింది. లండన్: గ్రాస్‌కోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ ఈ సారి మూడు రోజులకే వెలవెలబోతోంది. పలువురు మేటి స్టార్లంతా ఈ కోర్టులో తొలి రౌండ్లోనే ఆఖరి మ్యాచ్ ఆడేసి వెళ్లిపోయారు. మిగిలిన కొద్దిమందిలో ఇంకెంత మంది కనీసం ప్రిక్వార్టర్స్ వరకైనా చేరతారో తెలియని పరిస్థితి. సంచలన ఫలితాలతో పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఒకరో ఇద్దరో కాదు... ఏకంగా 23 మంది సీడెడ్ స్టార్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్‌లో 10 మంది, పురుషుల సింగిల్స్‌లో 13 మంది స్టార్లు... 2001 నుంచి టాప్–32 సీడింగ్స్‌ను గుర్తించాక ఇంత మంది సీడెడ్లు తొలి రౌండ్లోనే కంగుతినడం మొత్తం గ్రాండ్‌స్లామ్‌ల చరిత్రలోనే మొదటిసారి! ఫ్రెంచ్ ఓపెన్ తాజా చాంపియన్, అమెరికన్ స్టార్ కోకో గాఫ్ కథ తొలిరౌండ్లోనే అది కూడా క్వాలిఫయర్ చేతిలో ముగిసింది. రెండు వింబుల్డన్ టైటిళ్ల విజేత పెట్రా క్విటోవా మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం విక్రమార్క పోరాటం చేస్తున్న సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌తో పాటు ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ శుభారంభం చేశారు. మూడో రౌండ్లో సబలెంక, అల్కరాజ్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక 7–6 (7/4), 6–4తో మేరి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ సీజన్లో రెండు గ్రాండ్‌స్లామ్ (ఆ్రస్టేలియా, ఫ్రెంచ్) టోర్నీల్లోనూ రన్నరప్‌గా నిలిచిన సబలెంకకు తొలిసెట్లో అన్‌సీడెడ్ ప్లేయర్ గట్టి పోటీ ఇచ్చినా టైబ్రేకర్‌తో గెలుపుబాట పట్టింది. మరో పోరులో ఆరో సీడ్ మాడిసన్ కీస్ 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై వరుస సెట్లలో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో వింబుల్డన్ (2023, 2024) ‘హ్యాట్రిక్’పై కన్నేసిన కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) సునాయాస విజయంతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో సీడ్ స్పెయిన్ స్టార్ 6–1, 6–4, 6–4తో బ్రిటన్ ప్లేయర్ టార్వెట్ను ఓడించాడు. రెండోరౌండ్లో 12వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫె (అమెరికా)కు చుక్కెదురైంది. గత యూఎస్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ టియాఫె 6–4, 4–6, 3–6, 5–7తో కామెరూన్ నోరి (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. 14వ సీడ్ రుబ్లెవ్ 6–7 (1/7), 6–4, 7–6 (7/5), 6–3తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. డయానా సంచలనం ఉక్రెయిన్ ప్లేయర్ డయానా యస్త్రెంస్కా లండన్‌లో టైటిల్ గెలవకుండానే పతాక శీర్షికల్లో నిలిచింది. 2018 నుంచి గ్రాండ్‌స్లామ్ బరిలో దిగుతున్నప్పటికీ ఏనాడూ సాధ్యమవని విజయాన్ని ఈ వింబుల్డన్ తొలి రౌండ్లోనే సాకారం చేసుకుంది. పారిస్ మట్టికోర్టులో (ఫ్రెంచ్ ఓపెన్)లో మహారాణిగా నిలిచిన అమెరికన్ స్టార్, రెండో సీడ్ కోకో గాఫ్‌కు కనీవినీ ఎరుగని షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ అనామక ప్లేయర్‌ను సులువుగానే ఓడిస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ గాఫ్ 6–7 (3/7), 1–6తో 42వ ర్యాంకర్ డయానా య్రస్తెంస్కా చేతిలో ఘోర పరాభవానికి గురైంది.ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ తొలి రౌండ్‌ను వరుస సెట్లలోనే గెలిచింది. రష్యన్ ప్రత్యర్థి నుంచి తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల చాంపియన్ అయిన స్వియాటెక్ 7–5, 6–1తో పొలినా కుడెర్మటోవాపై గెలుపొందింది. 17వ సీడ్ బార్బర క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 3–6, 6–2, 6–1తో అలెగ్జాండ్రా ఎలా (ఫిలిప్పీన్స్)పై నెగ్గింది. ఇంతేనా... మిగిలింది! చెప్పుకోదగ్గ స్టార్లు, కనీసం సెమీఫైనల్ గ్యారంటీ అనుకున్న ప్లేయర్లు సైతం ఆదిలోనే కంగు తినడంతో ఇక మిగిలింది కొందరే! నంబర్‌వన్ సబలెంక, మూడో టైటిల్‌పై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్, 2023 వింబుల్డన్ చాంపియన్ మార్కెటా వొండ్రుసొవా, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను, పదో సీడ్ ఎమ్మా నవారో, యానిక్ సినెర్, రజతోత్సవ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్ తదితర స్టార్లే మిగిలారు. అయితే ఇంతటి సంచలనాల పర్వంలో ఇక వీరిలో ఎవరెవరు క్వార్టర్స్ దాటుతారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. రెండో రౌండ్లోకి యూకీ జోడీ పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో 16వ సీడ్ యూకీ–రాబర్ట్ గాలొవే ద్వయం 7–6 (10/8), 6–4తో అర్నియోడో (మొనాకో)–గినార్డ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. రిత్విక్ బొల్లిపల్లి–బారియెంటోస్ (కొలంబియా) జోడీ 4–6, 6–4, 7–6 (13/11)తో గాఫిన్ (బెల్జియం)–ముల్లర్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. వెటరన్ స్టార్ రోహన్ బోపన్న ద్వయంకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. బోపన్న–సాండర్ గిల్లీ (బెల్జియం) జోడీ 3–6, 4–6తో మూడో సీడ్ క్రావిట్జ్ (జర్మనీ)–ప్యూట్జ్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. జొకోవిచ్ కష్టపడి... బిగ్–3లో కెరీర్‌ను కొనసాగిస్తున్న సెర్బియన్ దిగ్గజం జొకోవిచ్ రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి సవాళ్లు ఎదురైనా అనుభవంతో అధిగమించాడు. ఆరో సీడ్ జొకో 6–1, 6–7 (7/9), 6–2, 6–2తో ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. తొలిరౌండ్లో మూడు గంటలకు పైగానే కోర్టులో శ్రమించి టోర్నీలో శుభారంభం చేశాడు. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మాత్రం అలవోక విజయంతో ముందంజ వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఫ్రెంచ్ రన్నరప్ సినెర్ 6–4, 6–3, 6–0తో తన దేశ సహచరుడు ల్యూకా నార్డిని ఓడించగా... నాలుగో సీడ్ డ్రాపర్ (బ్రిటన్) 6–2, 6–2, 2–1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి బేజ్ (అర్జెంటీనా) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–7 (6/8), 6–7 (8/10), 6–4, 7–6 (8/6), 6–4తో పెరికార్డ్ (ఫ్రాన్స్)పై ఐదు సెట్ల పోరాటం చేసి గట్టెక్కాడు. -
2024: బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూనే అదరగొట్టిన యంగ్ సెన్సేషన్స్ (ఫోటోలు)
-
బరిలోకి మరో ఇద్దరు భోజ్‌పురి సెన్సేషన్లు! బీజేపీ కసరత్తు
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ ప్రకటించిన అభ్యర్థి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆ స్థానంలో గట్టి అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రస్థాయి నేతలతోపాటు ఢిల్లీ స్థాయిలోనూ అభ్యర్థి ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అసన్సోల్ లోక్‌సభ స్థానానికి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాష్ట్ర యూనిట్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని పార్టీ వర్గాలు ఇద్దరు భోజ్‌పురి సంచలనాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వారిలో ఒకరు బెంగాలీ అయినప్పటికీ భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందారు. బెంగాల్ బీజేపీ సూచించింది వీరినే.. బెంగాల్ బీజేపీ సూచించిన పేర్లు అగ్నిమిత్ర పాల్, జితేంద్ర తివారీ, డాక్టర్ అజయ్ పొద్దార్. వీరిలో అగ్నిమిత్ర పాల్ వైద్యురాలు, విద్యావేత్తల కుటుంబంలో జన్మించారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. శ్రీదేవి, మిథున్ చక్రవర్తి, కేకే మీనన్ వంటి బాలీవుడ్ తారలకు ఆమె కాస్టూమ్స్ రూపొందించారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ 2020లో బీజేపీలో చేరారు. హిందీలో అనర్గళంగా మాట్లాడగల ఆయన గణనీయమైన సంఖ్యలో హిందీ మాట్లాడే ఓటర్లను ప్రభావితం చేయగలడని పార్టీ భావిస్తోంది. ఆయన గతంలో అసన్సోల్ మేయర్‌గానూ పనిచేయడం మరింత కలిసొచ్చే అంశం. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కుల్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ అజయ్ పొద్దర్ను కూడా స్థానిక పార్టీ పరిశీలిస్తోంది. మరో ఇద్దరు భోజ్‌పురి సంచలనాలు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ స్థానానికి ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం ఇద్దరు భోజ్‌పురి సంచలనాలను అన్వేషిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భోజ్‌పురి చిత్రాల బెంగాలీ స్టార్ 'మోనాలిసా'పై కాషాయ పార్టీ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఆమె అసలు పేరు అంటారా బిస్వాస్. హిందీ టెలివిజన్‌లో పేరు సంపాదించడంతో పాటు భోజ్‌పురి సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారారు. ఆమెకు బెంగాలీ, హిందీ, భోజ్‌పురి భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అందుకే ఆమెను అసన్సోల్ నుంచి పోటీ చేయించే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోనాలిసా బిగ్ బాస్-10లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. దక్షిణ కోల్‌కతాలోని జూలియన్ డే స్కూల్లో చదువుకున్న ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. భోజ్‌పురి పరిశ్రమలో సెన్సేషన్ అయిన మోనాలిసా భోజ్‌పురి స్టార్‌నే వివాహం చేసుకున్నారు. ఇక పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరైన మరో భోజ్‌పురి సంచలనం అక్షరా సింగ్‌ను రంగంలోకి దించే అవకాశాలను కూడా బీజేపీ పరిశీలిస్తోందన్న ఊహాగానాలు ఉన్నాయి. 'మోనాలిసా' కంటే పెద్ద స్టార్ అయినప్పటికీ అక్షరా సింగ్ విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈమెకు బెంగాలీ నేపథ్యం లేకపోవడం, పవన్ సింగ్‌తో గత అనుబంధం. బీజేపీ అధిష్టానం ఈ ఐదుగురిలో ఒకరిని ఎంపిక చేస్తుందా లేక ఇంకెవరైనా కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. -
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇప్పుడు అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు, ఎమ్మెల్యేల ఎరపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో ప్రతీరోజూ పతాకశీర్షికన కథనాలు వస్తుండగా.. ఈ వ్యవహారాలన్నీ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ.. వీరు విచారిస్తున్న ప్రతీ కేసులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ► ఉద్యమకాలం నుంచి రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర అవతరణ అనంతరం కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్య రాజకీయవైరం పతాకస్థాయికి చేరడం, కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు పెంచడం, రాష్ట్ర దర్యాప్తు బృందాలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ వ్యవహారంలోనూ కరీంనగర్ వ్యక్తులే కీలకంగా మారుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ► ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ సంస్థలపై ఈడీ, ఐటీ ఆకస్మిక దాడులు నిర్వహించడం.. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అదే సమయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పార్టీలు మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ రమణకు ఈడీ సంస్థ నోటీసులు ఇవ్వడం.. శుక్రవారం ఆయన విచారణకు హాజరవడం జరిగాయి. తొలుత ఎన్ఐఏ.. నిజామాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉ గ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థలో క్రియాశీలక సభ్యుడు జగిత్యాల వాసిగా గుర్తించా రు. ఈ క్రమంలో సెప్టెంబరు 19వ తేదీన దేశవ్యాప్తంగా సదరు సంస్థపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో సదరు జగిత్యాల వాసిని కరీంనగర్‌లోని నాఖా చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి నుంచి అరె స్టు చేసి తీసుకెళ్లారు. ఆ రోజు తెల్లవారుజామున కరీంనగర్ పట్టణంలో పలువురి అనుమానితుల ఇళ్లపైనా ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి, అనుమానాస్పద ఫైళ్లను తీసుకెళ్లారని సమాచారం. జగిత్యాల, కరీంనగర్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు బయటపడటం అప్పట్లో కలకలం రేపింది. ఈడీ, ఐటీ.. ఆకస్మిక సోదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి తరువాత అతిపెద్దది గ్రానైట్ పరిశ్రమ. ఈ క్రమంలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై పలు కంపెనీలపై ఈ నెల 9వ తేదీన తరలించారన్న ఫిర్యాదులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. రెండురోజులపాటు జరిగిన ఈ సోదాల్లో దాదాపు 10కిపైగా కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ► చీకోటి ప్రవీణ్ కేసినో కేసులోనూ రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. తొలుత ఈ కేసుకు కరీంనగర్‌తో సంబంధాలు లేవనుకున్నప్పటికీ.. తాజాగా ఎమ్మెల్సీ రమణకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ► మరోవైపు ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కాంలోనూ పలువురు సిరిసిల్ల, కరీంనగర్ పట్టణవాసుల ప్రమేయం ఉందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. కరీంనగర్లో ఇటీవల జరిగిన ఈడీ దాడుల సమయంలోనూ తొలుత లిక్కర్ స్కాంలో సోదాలుగానే ప్రచారం జరిగాయి. ► మరోవైపు అధికార పార్టీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’ కూడా జాతీయస్థాయిలో చర్చ లేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ పార్టీపై స్వయంగా సీఎం చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు కరీంనగర్‌తో ఉన్న లింకులు బయటపెట్టారు. కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్ చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేయడంతో మరోసారి కరీంనగర్ వార్తల్లోకెక్కింది. రాజకీయ సమరానికీ ఇక్కడే ఆజ్యం..! కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బహిరంగంగానే పరస్పర ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకు ఇరు పార్టీ నాయకులు తమకు ఏమాత్రం చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థి వర్గాన్ని ఆరోపణలతో చీల్చిచెండాడుతున్నారు. ఈ సమరానికి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే వేదికగా నిలవడం విశేషం. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసే క్రమంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి చేసే ఎవరినీ వదలమంటూ హెచ్చరికలు జారీచేశారు. ► మరోవైపు సోషల్‌మీడియాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల విషయంలో పూటకో ప్రచారం వెలుగుచూస్తోంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై, హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి వెళ్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్‌వాపసీ’ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. ► శుక్రవారం ఉదయం నుంచి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ పుట్ట మధు పార్టీ మారుతున్నారన్న సందేశం వైరల్‌గా మారింది. టీవీలు, వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పుట్ట మధు హడావిడిగా అక్కడే విలేకరుల సమావేశం పెట్టి ప్రచారాన్ని ఖండించారు. అంతకుముందు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన ఆయన తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. తాను సొంత పనుల మీద నియోజకవర్గం వీడిన ప్రతీసారి ప్రతిపక్షాలు రాస్తున్న ప్రేమలేఖలు చదివి నవ్వుకుంటున్నానని చమత్కరించారు. (క్లిక్: ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?) -
కుటుంబం ఆత్మహత్య.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్
-
కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు?
సాక్షి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వనమా రాఘవేందర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పాల్వంచ ఎఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం వనమా రాఘవేందర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని తెలిపారు. సూసైడ్ లెటర్లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవీ పేర్లు కూడా ఉన్నాయనీ.. ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎఎస్పీ తెలిపారు. చదవండి: భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి.. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్ చేసుకుని కుటుంబం సాముహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు. వీరికి సాహితి, సాహిత్య అనే ఇద్దరు పిల్లలు. నాగ రామకృష్ణ మీ సేవాలోఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో దంపతులతో సహా చిన్న కూతురు సజీవ దహనమయ్యారు. మరో కూతురుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. -
సంచలనాలు సృష్టించనున్న షకీల!
షకీల.ఆ పేరులోనే వైబ్రేషన్లు ఉన్నాయి. ఒకప్పుడు మళయాల సినిమా రంగాన్ని ఏలిన తెలుగు హీరోయిన్ షకీల తన జీవితంలోని నిజాలను బయటపెట్టి సంచలనాలు సృష్టించబోతోంది. కుర్రకారుని ఉర్రూతలూగించే తన సినిమాలతో మాలీవుడ్ వెండితెరను మహారాణిలా పాలించిన ఈ శృంగార తార సినిమా విడుదల అవుతుందంటే చాలు పెద్ద పెద్ద హీరోలకే ముచ్చెమటలు పట్టేవి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన స్టార్ హీరోల సినిమాలను వాయిదా వేసుకునేవారు. ఇప్పుడు ఆ హీరోయిన్ తన జీవిత చరిత్ర ఆధారంగా తానే కధానాయికగా ఓ సంచలన చిత్రం నిర్మించబోతోంది. ఆ సినిమాలో అన్నీ వాస్తవాలే ఉంటాయని ఆమె చెబుతోంది. దాంతో కొందరు పెద్దలకు తమ బండారం ఎక్కడ వెలుగులోకి వస్తుందోనని వణుకుపుడుతోంది. వెండితెర నటీమణుల జీవితాలతో గతంలో ఎన్నో సినిమాలు తెరకి ఎక్కాయి. డర్టీ పిక్చర్ లాంటి సినిమాలైతే సూపర్ డూపర్ హిట్ సాధించాయి. కలెక్షన్లే కాకుండా, అవార్డుల వర్షం కూడా కురిపించాయి. తెర వెనుక చీకటి నిజాలు, హీరోయిన్లు కష్ణాలు, వారు ఎదుర్కొనే అవమానాలు, మానాభిమానాలను కాపాడుకోవడానికి వారు పడేపాట్లను ఇటీవల షకీల బయటపెట్టారు. దాంతో గుమ్మడికాల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కొందరు పెద్దలు ఉలిక్కిపడ్డారు. అందరూ పెద్దలు కాదని వాళ్ళలో కొందరు గద్దల కూడా ఉన్నారని ఆమె విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ నిజాలన్నీ కలిపి షకీల సినిమా కూడా తీస్తున్నారు. సినీ జీవితంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తాను పడ్డ అవమానాలు, ఎదుర్కొన్న చీత్కారాలు, వేధింపులతో ఏకంగా షకీల గతంలో ఓ పుస్తకమే రాశారు. ఈ పుస్తకం సంచలనాలకు కేంద్రబిందువైంది. ఇప్పుడు అదే పుస్తకం ఆధారంగా సినిమా నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఆ సినిమాలో తానే లీడ్ రోల్లో నటించబోతోంది. పుస్తకం అందరికీ చేరడానికి కొంత సమయం పడుతుంది. అదే సినిమా అయితే జనాల్లోకి చాలా తేలికగా చొచ్చుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన తరువాత కొందరు నొచ్చుకొవడం ఖాయం. అందుకే నిజాలు తెలిస్తే తనను చంపేసినా చంపేస్తారని షకీల అనుమానం కూడా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీల రూపొందించే ఈ సినిమా నిర్మాణం పూర్తి అయితే ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూద్దాం. - శిసూర్య