breaking news
Secret Agency
-
ఎవరీ బ్లేజ్ మెట్రెవెలి? 115 ఏళ్ల చరిత్రలో..
యూకే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు అధికారిణిగా బ్లేజ్ మెట్రెవెలిని బ్రిటన్ నియమించింది. ఈ సీక్రెట్ ఏజెన్సీ 115 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. చెప్పాలంటే మహిళలు ఎలాంటి క్లిష్టతరమైన పదవులనైనా సునాయసంగా అలకరించగలరు అని ఈ మెట్రెవెలిని నియామకంతో నిరూపితమైంది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న సర్ రిచర్డ్ మూర్ నుంచి మెట్రెవెలి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె 'సీ' అనే కోడ్‌నేమ్‌తో ఈ సీక్రెట్ ఏజెన్సీ M16 చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న అధికారి. అయితే ఆమె ప్రస్తుతం ఇదే సీక్రెట్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్ 'Q'గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ అదనపు బాధ్యతలతో పూర్తి కార్యాచరణ బాధ్యతను కలిగి ఉంటారు. అంతేగాదు ఆమె నేరుగా విదేశాంగా కార్యదర్శికి తన విధులను నివేదిస్తారు. జేమ్స్ బాండ్ చిత్రాలలో చూసే గాడ్జెట్ నిపుణుడి మాదిరిగా మెట్రెవెలి MI6లో సాంకేతికత తోపాటు ఆవిష్కరణలను పర్యవేక్షిస్తారు. ఆమె గతంలో MI5లో సీనియర్ పదవిని నిర్వహించారు. నిజానికి దేశీయ నిఘా సంస్థ MI5లో స్టెల్లా రిమింగ్టన్, ఎలిజా మానింగ్‌హామ్-బుల్లర్ అనే ఇద్దరు మహిళా చీఫ్‌లు ఉండగా, మెట్రెవెలి MI6కు నాయకత్వం వహించనున్న తొలి మహిళ మెట్రెవెలి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్లేజ్ మెట్రెవెలి మాట్లాడుతూ.." నాసర్వీస్కు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నందుకు అత్యంత గర్వంగానూ, గౌరవంగానూ ఉంది. ఈ MI6 అనేది MI5, GCHQ లతో పాటు, బ్రిటిష్ ప్రజలను సురక్షితంగా ఉంచడం, విదేశాలలో UK ప్రయోజనాలను ప్రోత్సహించడం వంటి వాటిల్లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. అంతేగాదు మా MI6లో పనిచేసే ధైర్యవంతులైన అధికారులు, ఏజెంట్లు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి సమర్థవంతంగా పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం ". అని వెల్లడించింది మెట్రెవెలి. బ్లేజ్ మెట్రెవేలి నేపథ్యం..బ్లేజ్ మెట్రెవేలి కేంబ్రిడ్జ్‌లోని పెంబ్రోక్ కళాశాలలో ఆంత్రోపాలజీని అభ్యసించింది. ఆ తర్వాత 1999లో కేస్ ఆఫీసర్‌గా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (MI6)లో చేరారు. మెట్రెవేలి తన కెరీర్లో ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్, యూరప్ అంతటా ఆపరేషనల్ పాత్రలలో గడిపారు. ఆమె ఈ MI6లో వివిధ బాధత్యలను నిర్వర్తించారు.అంతేగాదు యునైటెడ్ కింగ్డమ్ దేశీయ నిఘా సేవ అయిన MI5లో డైరెక్టర్ స్థాయి పదవులను కూడా నిర్వర్తించారామె. ఆ తర్వాత MI6లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌కు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అలాగే బ్రిటిష్ విదేశాంగ విధానానికి ఆమె చేసిన సేవలకు గాను కింగ్స్ బర్త్‌డే ఆనర్స్‌లో సెయింట్ మైఖేల్, సెయింట్ జార్జ్ (CMG)ల కంపానియన్‌గా కూడా నియమితులయ్యారు.MI6 అంటే.. MI6, లేదా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనేది UK విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జాతీయ భద్రత తోపాటు విదేశాంగ విధానానికి మద్దుతు ఇచ్చే బాద్యతను కలిగి ఉంది. దీన్ని 1909లో స్థాపించారు. ఈ ఏజెన్సీ ఉగ్రవాదం, సైబర్ దాడులు, శత్రు దేశాల వంటి బెదిరింపులపై దృష్టిపెడుతుంది. ఈ ఎమ్ఐ6 చీఫ్‌ని 'సీ' అనే కోడ్ నేమ్‌తో పిలుస్తారు. ఇది దేశీయ ఇంటెలిజెన్స్ నిర్వహించే MI5 వలె కాకుండా MI6 ప్రత్యేకంగా విదేశాలలో పనిచేస్తుంది.(చదవండి: ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..) -
స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్..
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్ తలిగింది. స్నూపింగ్ కేసులో ఆయనపై న్యాయపమరైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా.. ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం పంపారు. ఈ విజ్ఞప్తికి హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా.. ఇప్పుడు స్నూపింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చాక ఫీడ్‌బ్యాక్ యూనిట్(ఎఫ్‌బీయూ)ను ఏర్పాటు చేసింది. 2016లో రూ.కోటి కేటాయించడంతో ఎఫ్‌బీయూ సీక్రెట్ సర్వీస్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలపై రహస్య నిఘా పెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఏర్పాటు చేశారంటోంది. ఢిల్లీ విజిలెన్స్ శాఖకు నేతృత్వం వహిస్తున్న సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కావాలని కోరింది. 2015లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎఫ్‌బీయూ ఏర్పాటును సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారని, కానీ దాని ఎజెండాకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సీబీఐ ఆరోపిస్తోంది. ఎఫ్‌బీయూ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా లేదని పేర్కొంది. సీబీఐ అభ్యర్థను ఆమోదిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎటువంటి శాసన, న్యాయ, కార్యనిర్వాహక పర్యవేక్షణ లేకుండా అధికారాన్ని ఉపయోగించి రహస్య ఏజెన్సీని స్థాపించేందుకు ఆప్ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. చదవండి: దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత? -
ట్రంప్ పర్యటన : సీక్రెట్ ఏజెన్సీ పనేంటంటే..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేటి(సోమవారం) మధ్యాహ్నం అడుగిడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికాకు చెందినసీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన భద్రతా సిబ్బంది సీక్రెట్ ఏజెన్సీ. అమెరికా అధ్యక్షుడి రక్షణ విషయంలో సీక్రెట్ ఏజెన్సీ పాత్ర ఏంటో తెలుసుకుందాం.. ►అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ► ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. ► అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ►ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. ► అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. ►అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్‌కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. ►అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. ►చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. ►1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. ►సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుంటారు. ► ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. ► సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. ►వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! ట్రంప్ నేటి షెడ్యూల్.. ఉదయం.. 11:40.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్ మధ్యాహ్నం 12:15.. ట్రంప్, మోదీలు కలసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు 01:05.. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 03:30.. ఆగ్రాకు ప్రయాణం సాయంత్రం 04:45.. ఆగ్రాకు చేరుకుంటారు 05:15.. తాజ్‌మహల్ సందర్శన 06:45.. ఢిల్లీకి ప్రయాణం 07:30.. ఢిల్లీకి చేరుకుంటారు చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ మోదీ, నేను మంచి ఫ్రెండ్స్! ‘అగ్ర’జుడి ఆగమనం నేడే -
ఏసీబీ డీజీగా ఠాకూర్ బాధ్యతల స్వీకరణ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అవినీతి అడ్డుకాకూడదని, ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడాలంటేనే భయపడేలా పనిచేస్తానని ఏసీబీ డీజీ ఆర్పి ఠాకూర్ స్పష్టం చేశారు. విజయవాడలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్(ఏసీబీ డీజీ)గా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఆ అధికారికి చెందిన ఆస్తులను సీజ్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏసీబీ కేసు కోర్టులో రుజువైన తరువాతే సంబంధిత అధికారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఏసీబీని అనుసంధానం చేసేలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంతోపాటు సీక్రెట్ ఏజన్సీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. దేశ రక్షణలో సైన్యం మాదిరిగా అంకితభావంతో పనిచేయాలని ఠాకూర్ ఏసీబీ అధికారులకు సూచించారు.