breaking news
Satya Prasad
-
కొత్త సీసాలో పాత కుట్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు సర్కారు అక్రమ కేసుల కుట్రలకు సంబంధించి విభ్రాంతికర వాస్తవాలు బట్టబయలయ్యాయి. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో అల్లిన ఈ కుట్ర కేసులో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా ఈ అక్రమ కేసు దర్యాప్తును ‘సిట్’ కొనసాగిస్తోందన్న వాస్తవం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఇదేం దర్యాప్తు..? అలాంటి వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్టులు చేయడం ఏమిటి?.. ఈ అక్రమ కేసులకు ఏం విలువ ఉంటుంది..? అని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలం బాగోతం బహిర్గతమైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ వాంగ్మూలం కథ కూడా కంచికి చేరినట్లేనన్నది తేటతెల్లమవుతోంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ అల్లిన కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చిత్రీకరించేందుకే కూటమి సర్కారు ఇంతగా బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు మద్యం దోపిడీ మాఫియా టీడీపీ కూటమి పెద్దల నిర్వాకమేనన్నది ఆధారాలతో సహా నిరూపితమవుతోంది. చంద్రబాబు సర్కారు భేతాళ కుట్రలు న్యాయస్థానాల సాక్షిగా పటాపంచలు కావడం.. వైఎస్సార్ సీపీపై బురద చల్లాలని యత్నించి భంగపడటం.. నకిలీ మద్యం కేసులో కూటమి సర్కారు అడ్డంగా దొరికిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెదిరించి.. దారికి తెచ్చుకుని..బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవ రెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను గతంలోనే టీడీపీ వీరవిధేయ సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలంగా మలచుకున్నారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లను సిట్ అధికారులు బెదిరించారు. అందుకు వారిద్దరూ మొదట్లో సమ్మతించ లేదు. అంతేకాదు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని తమని పోలీసులు బెదిరిస్తున్నారని వాసుదేవరెడ్డి న్యాయస్థానంలో మూడు సార్లు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయినా సరే సిట్ అధికారులు వారిని వెంటాడి వేధించారు. డెప్యుటేషన్ ముగిసినా సరే వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా వేధించారు. అంతేకాదు ఆయన్ని మూడు రోజులపాటు అక్రమంగా నిర్బంధించి బెంబేలెత్తించారు. దీంతో సిట్ అధికారుల కుట్రలకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం గమనార్హం. కేవలం వారిద్దరి అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసులో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను అక్రమంగా అరెస్టు చేశారు. ఆ కుట్రలన్నీ న్యాయస్థానం విచారణలో ఒక్కొక్కటిగా బెడిసికొట్టాయి. దాంతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై కూటమి ప్రభుత్వం నమోదు చేసింది అక్రమ కేసేనన్నది స్పష్టమవుతోంది. ముందస్తు బెయిల్ పన్నాగం తాము బెదిరించి లొంగదీసుకున్న వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లను సిట్ అధికారులు ఇప్పటివరకు అరెస్టు చేయ లేదన్నది తెలిసిందే. ఈ ఏడాది జూలైలో వారిద్దరితో ఈ కేసులో అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని పిటిషన్ వేయించాలని భావించారు. అందుకోసం వారిద్దరినీ కొందరు సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. కాగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ పిటిషన్లను న్యాయస్థాన వర్గాలు పరిశీలించాయి. అప్రూవర్లుగా మారాలంటే ముందు అరెస్టు కావాలి... న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాలని వారిద్దరికి స్పష్టం చేశాయి. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంటూనో... తరువాత ఎప్పుడో బెయిల్‌పై విడుదల అయిన తరువాత మాతమ్రే అప్రూవర్ పిటిషన్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయాలన్నది నిబంధన అని స్పష్టం చేశాయి. అంతేగానీ కేసులో నిందితులుగా ఉన్నవారు కనీసం అరెస్టు కాకుండా... జైలుకు వెళ్లకుండా అప్రూవర్లుగా మారేందుకు పిటిషన్ దాఖలు చేయడం కుదరదని చెప్పడతో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ కంగుతిన్నారు. అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెనకడుగు వేశారు. దాంతో సిట్ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచకపోవడంతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది. అబద్ధపు వాంగ్మూలాల కుట్రేఈ తాజా పరిణామాలు ఓ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలు చేశారని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్టైంది. రెడ్‌బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూరిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధారపడ్డామని బయటపెట్టుకుంది. సిట్ నమోదు చేసిన 161, 164 వాంగ్మూలాలన్నీ కట్టుకథలేనన్నది స్పష్టమైంది. మిథున్ రెడ్డిపై కుట్ర విఫలం ఈ అక్రమ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వ కుట్రలు చివరికి విఫలమయ్యాయి. డికార్ట్ లాజిస్టిక్ కంపెనీ నుంచి ఆయన కుటుంబ సంస్థకు రూ.5 కోట్లు వచ్చాయనే నెపంతో ఆయన్ను అరెస్టు చేశారు. కాగా తమ నిర్మాణ సంస్థ లో సబ్ కాంట్రాక్టు చేసేందుకు డిపాజిట్‌గా రూ.5 కోట్లు చెల్లించారని... కోవిడ్ పరిస్థితుల్లో ఆ సబ్ కాంట్రాక్టు చేయలేకపోవడంతో తాము ఆ మొత్తాన్ని ఆ కంపెనీకి తిరిగి చెల్లించామని మిథున్‌రెడ్డి తమ బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. ఇక ఆయనపై నమోదు చేసిన అభియోగాల్లో సిట్ కనీస ఆధారాలు కూడా చూపలేకపోయిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మిథున్‌రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇక ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో కనీసం ఆ శాఖ మంత్రిగా కూడా లేరు. అలాంటప్పుడు ఇక మద్యం వ్యవహారాలతో వారికి ఏం సంబంధం ఉంటుంది? ‘‘ఈ కేసులో మిథున్‌రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు మినహా ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు..’’ అని ఈ కేసులో మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా ఏసీబీ కోర్టు స్పష్టం చేయడం గమనార్హం. న్యాయస్థానం ప్రశ్నలకు సిట్ తెల్లమొహం ఇక ఈ కేసులో సిట్ కుట్రపూరితంగానే నిరాధార ఆరోపణలతో చార్జ్షీట్లు దాఖలు చేసిందన్నది వెల్లడైంది. మొదటి చార్జ్‌షీట్, అనుబంధ చార్జ్షీట్లను పరిశీలించి న్యాయస్థానం లేవనెత్తిన 21 అభ్యంతరాలపై సిట్ సమాధానం చెప్పలేకపోయింది. అందుకే సీఆర్సీపీ సెక్షన్ 167(2) ప్రకారం ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ ఎండీ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది. మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిపై సిట్ అక్రమ కేసు నమోదు చేసిందని తేటతెల్లమైంది. సిట్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోదాల ముసుగులో.. ఇక ఈ అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ బరితెగించి వేధింపులకు పాల్పడింది. ప్రధానంగా సోదాల పేరుతో కుట్రపూరితంగా వ్యవహరించింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి తదితరుల నివాసాల్లో సోదాల పేరుతో హైడ్రామాకు తెరతీసింది. సోదాల పేరుతో తామే అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ అధికారులు పన్నాగం పన్నారు. ఒకరి నివాసంలో సోదాలతో ఏదో సమాచారం లభించిందని చెప్పి మరొకరి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. లేని ఆధారాలు సృష్టించేందుకు పడరాని పాట్లు పడ్డారు. జడ్జిపై లూథ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు ఇక ఈ అక్రమ కేసులో అడ్డగోలుగా వాదించేందుకు యత్నించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై ఏసీబీ న్యాయస్థానం మండిపడింది. అక్రమంగా అరెస్టు చేసిన నిందితులకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదన్న కోర్టు ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలను చదువుతూ పక్కదారి పట్టించేందుకు యత్నించడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సిద్ధార్థ్ లూథ్రా ఏకంగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విభ్రాంతి కలిగించాయి. ఆ జడ్జిని బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తానని హైకోర్టులో వ్యాఖ్యానించడం విభ్రాంతి కలిగించింది. న్యాయస్థానాలనే బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడటంపై న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత బరితెగించి మద్యం దోపిడీ2024లో అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత బరితెగించి మద్యం దోపిడీకి తెగిస్తోంది. అందుకోసమే ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి 3,336 ప్రైవేటు మద్య దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. వాటికి అనుబంధంగా 3,336 పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చింది. 540 బార్లను టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. త్వరలో మరో 300 బార్లు కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇక ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే రూ.20 అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. ఏకంగా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు బరితెగించింది. టీడీపీ నేతలే సూత్రధారులు, పాత్రధారులుగా నకిలీ మద్యం తయారీ యూనిట్లను కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేశారు. మూడోవంతు నకిలీ మద్యం అమ్మకాలతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదేళ్లలో రూ.45వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా నకిలీ మద్యం మాఫియా చెలరేగిపోతోంది. మద్యం కుట్రదారు చంద్రబాబే.. ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్న బాబు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో ఏకంగా రూ.25వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం. గత ఏడాది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతానికి మించిన స్థాయిలో మద్యం దోపిడీకి తెగబడుతున్నారు. మద్యం విధానం ద్వారా తమ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి సిట్ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వీగిన కుట్రలు...రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుట్ర.... ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామేరెడ్బుక్ కుట్ర కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం దాగుంది. ఇక అసలు విషయం ఏమింటే... రాజ్ కేసిరెడ్డి ఎవరో కాదు... ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) వ్యాపార భాగస్వామి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@ws hanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ వాంగ్మూలం నమోదు చేసింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేయలేదని సిట్ అధికారులే ఆ రిమాండ్ నివేదికలో వెల్లడించారు కూడా. లేకపోతే రాజ్ కేసిరెడ్డి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని న్యాయస్థానానికి చెబితే తాము ఇబ్బందిపడాల్సి వస్తుందనే భయంతోనే సిట్ ఆ విషయాన్ని నివేదికలో పేర్కొంది.మానసిక రోగి సత్య ప్రసాద్..!కాగా ఈ అక్రమ కేసులో వెల్లడైన ఓ కొత్త విషయం ఆసక్తికరంగా మారింది. సత్య ప్రసాద్ దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురానికి చెందిన మానసిక వైద్య నిపుణులు డా.ఎండ్లూరి ప్రభాకర్, పి.విజయ పద్మ ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడైంది. సత్య ప్రసాద్ మానసిక అనారోగ్య సమస్యలకు వారిద్దరూ ప్రిస్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ కాపీలు బయటపడ్డాయి. అంటే ఎంతో కాలంగా ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నది స్పష్టమైంది. మానసికంగా ఆరోగ్యంగా లేని సత్య ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను సత్య ప్రసాద్‌తో చెప్పించిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగానే అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే వాస్తవాన్ని గోప్యంగా ఉంచేందుకు సిట్ అధికారులు యత్నిస్తున్నారు. కానీ సత్య ప్రసాద్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని తాజాగా బయటపడటం సిట్ బండారాన్ని బట్టబయలు చేసింది. బెడిసికొట్టిన రూ.11కోట్ల జప్తు కుట్ర ఇక లేని ఆధారాలు సృష్టించేందుకే సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డి ఫాం హౌస్‌లో రూ.11కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు డ్రామాకు తెరతీశారు. కాగా ఆ నగదు తనది కాదని...దీనిపై విచారించాలని రాజ్ కేసిరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది. దాంతో సిట్ అధికారులు ఆ రూ.11 కోట్ల నగదును అర్ధరాత్రి బ్యాంకులో జమ చేసి కప్పిపుచ్చేందుకు యత్నించారు. ఇక ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో వెంకటేష్ నాయుడు పాత వీడియోను తెరపైకి తీసుకొచ్చి అది మద్యం డబ్బులేనంటూ ప్రచారం చేశారు.గన్మెన్పైనే థర్డ్ డిగ్రీ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రస్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దాంతో ఆయనకు వెంటనే జీతం పెంచి మరీ ప్రమోషన్ కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశనాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు. ఆయన పాత్రను నిరూపించే ఆధారాల్లేవు‘‘కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుడి పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు..’’ ‘‘ఈ కేసులో మిథున్‌రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు మినహా ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు..’’ ‘‘నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. అందువల్ల బెయిల్‌ను తిరస్కరించలేం..’’ – మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు సమయంలో ఏసీబీ కోర్టుడీఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు రాజ్యాంగ విరుద్ధం‘‘ఇటీవల సుప్రీంకోర్టు రీతూ చాబ్రియా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేయకుండానే దాఖలు చేసిన అసంపూర్ణ చార్జిషీట్... సీఆర్పీసీ సెక్షన్ 167(2) ప్రకారం నిందితుడికి లభించే డిఫాల్ట్ బెయిల్ హక్కును దూరం చేయలేదని తేల్చి చెప్పింది. డిఫాల్ట్ బెయిల్ చట్టబద్ధ హక్కు మాత్రమే కాక రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీం పేర్కొంది...’’ ‘‘ప్రతి నిందితుడికి వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసి డిఫాల్ట్ బెయిల్ హక్కును అడ్డుకోవాలనుకునే తీరు చట్ట, రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది. ఇలాంటి చర్యలు నిందితుడి ప్రాథమిక హక్కు అయిన స్వేచ్ఛను హరిస్తాయని చెప్పింది. అసంపూర్ణ లేదా పలు భాగాలుగా చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును కాలరాయలేరని సుప్రీం చెప్పింది’’ ‘‘ప్రస్తుత కేసులో ప్రాథమిక చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్ విషయానికి వస్తే 48 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రాథమిక చార్జిషీట్‌ను 16 మందిపై మాత్రమే దాఖలు చేశారు. మరో ముగ్గురిపై అనుబంధ చార్జిషీట్ వేశారు. ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు రాలేదు. ఆ నివేదికల్లో ఏమున్నదో తెలియకుండా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ లేదా 19 ప్రకారం అనుమతులు, ఆమోదం పొందకుండా ప్రభుత్వ ఉద్యోగులపై కేసును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు...’’ ‘‘చట్ట ప్రకారం నేరాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందే గానీ నిందితులను కాదు. సీఆర్పీసీ సెక్షన్ 309(2) ప్రకారం నేరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు. కేసు ఇంకా ప్రి కాగ్నిజెన్స్ దశలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 167(2) ప్రకారం 90 రోజులు దాటిన తరువాత నిందితుల కస్టడీ పొడిగించడానికి అనుమతి లేదు. అందువల్ల నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయడం తప్ప మరో మార్గం లేదు..’’ – ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు -
చెప్పినట్లు చేసి తీరాల్సిందే!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కక్ష సాధింపు కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఏకంగా సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించే కుట్రను వేగవంతం చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సంస్థ ఉద్యోగి సత్యప్రసాద్‌లతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే లక్ష్యంగా వేధింపులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగం పన్నింది. ఉన్నతాధికారులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం!చంద్రబాబు ప్రభుత్వం గతేడాది జూన్ 12న అధికారంలోకి రాగానే రెడ్‌బుక్ కక్ష సాధింపులకు తెరతీస్తూ వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అదే నెల 24న అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు. దాంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ మరో అక్రమ కేసు నమోదు చేసింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ కుట్రను ప్రస్తుతం పోలీసు శాఖను శాసిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లను ఉద్దేశపూర్వకంగా పేర్కొనకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా చేయాలన్నది అసలు పన్నాగం. కేసు దర్యాప్తు పేరిట వాసుదేవరెడ్డిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించాలని ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌కు విస్పష్టంగా ఆదేశించారు. అప్పటి నుంచి విచారణ పేరిట సీఐడీ బృందాలు వాసుదేవరెడ్డిని వేధిస్తూనే ఉన్నాయి. ఆయన్ను కొద్ది రోజుల పాటు అనధికారికంగా నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి చెప్పినట్లుగా నడుచుకున్నామని, మద్యం వ్యవహారాలను వారిద్దరే పూర్తిగా పర్యవేక్షించారంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వక పోవడంతో ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసులో మరింతగా బరి తెగించేందుకు సీఐడీ సన్నద్ధమైంది. రప్పించి.. రహస్యంగా రికార్డింగ్!రెడ్ బుక్ కుట్రలో భాగంగా సీఐడీ పెద్దలు.. బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులను రప్పించి మాట్లాడుతున్నారు. వారు వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతామని నమ్మబలుకుతున్నారు. సాధారణ సంభాషణలు, పిచ్చాపాటి తరహాలో మాట్లాడుతున్నప్పటికీ కార్యాలయంలో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మొత్తం వ్యవహారాన్ని రికార్డింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం వారిని మరోసారి పిలిపించి వీడియో రికార్డింగులను చూపించి బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సీఐడీ అదుపులో సత్యప్రసాద్...అబద్ధపు వాంగ్మూలం నమోదు కుట్రలో భాగంగా బెవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఉద్యోగి సత్య ప్రసాద్‌ను సీఐడీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ను విజయవాడకు తరలించి కొద్ది రోజులుగా తమదైన శైలిలో విచారించి బెంబేలెత్తిస్తున్నారు. సత్య ప్రసాద్ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సీఐడీ అధికారుల బెదిరింపులు, వేధింపులు కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వారు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేందుకు సత్య ప్రసాద్ సమ్మతించినట్టు సమాచారం! దీంతో ఆయనతో న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించేందుకు సీఐడీ అధికారులు రెండు రోజులుగా సన్నాహాలు వేగవంతం చేశారు. వాంగ్మూలం నమోదు చేయించగానే కుట్రలో తరువాత అంకానికి తెరతీయనున్నారు.ఇక టార్గెట్ రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి..!సత్య ప్రసాద్‌ను బెదిరించి దారికి తెచ్చుకున్న సీఐడీ అధికారులు గతంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆచూకీ కోసం కొద్ది రోజులుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది స్పష్టమైన సమాచారం అందగానే అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సీఐడీ అధికారుల బృందాలను ఇప్పటికే హైదరాబాద్ పంపారు. వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నది సీఐడీ అధికారుల లక్ష్యం.అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకుంటే అంతు చూస్తాం..!వాసుదేవరెడ్డితోపాటు బెవరేజస్ కార్పొరేషన్లో గతంలో పని చేసిన సత్య ప్రసాద్‌తో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించే కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. వారిద్దరినీ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్న సీఐడీ అధికారులు.. ఈ వారంలో సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక నిరీక్షించే ఓపిక లేదని.. అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా వాంగ్మూల నమోదు ప్రక్రియ పనులు మొదలు పెట్టడం గమనార్హం.తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు!రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తోపాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించాలనే కుతంత్రాన్ని రచిస్తోంది. సీఐడీ అధికారులు తాము కోరుకుంటున్న సమాచారాన్ని ముందుగానే పెన్ డ్రైవ్‌లు, సీడీలు, హార్డ్ డిస్క్‌లలో స్టోర్ చేస్తారు. అనంతరం వాటిని వెంటబెట్టుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, డిస్టిలరీల కార్యాలయాల్లో తనిఖీలకు బయలుదేరుతారు. అవన్నీ ఆ నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో లభించినట్లు ప్రకటిస్తారు. తద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ కేసులతో వేధించాలని సీఐడీ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది! -
లోకేష్, అనగాని సత్యప్రసాద్ పై భూమన సంచలన వ్యాఖ్యలు
-
కూటమి సర్కార్ హంగామా.. సచివాలయంలో కొత్త గేటు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో సోకులు ఎక్కువయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై లేని శ్రద్ధ.. హంగు ఆర్భాటాలపై ఎక్కువైంది. తాజాగా సచివాలయంలో చంద్రబాబు రాకపోకల సమయంలో ప్రజలను నియంత్రించేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.ఏపీలో సచివాలయంలో జనాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ గోడ నుంచి పార్క్ వరకు ఇనుప గేట్ల ఏర్పటుకు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త గేటు ఏర్పాట్లు చూసి సచివాలయ ఉద్యోగులు విస్తుపోతున్నారు. సీఎం సెక్యూరిటీ కోసం అంటూ ఇబ్బడిముబ్బడిగా నిధులు ఖర్చు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే వాస్తు పేరుతో మంత్రుల పేషీల్లో వాస్తు పేరుతో అధికారులు హంగామా చేశారు. కాగా, మంత్రుల బాటలోనే ఓఎస్డీలు కూడా నడుస్తున్నారు. రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ఓఎస్డీ కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. మంత్రి పేషీలో కాకుండా అదనంగా పేషీ కేటాయించారు. హంగు ఆర్భాటాలతో మంత్రి ఓఎస్డీకి కొత్త ఛాంబర్‌ను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. -
బాధ్యత మరచిన మంత్రి అనగాని.. ఫారిన్లో ఎంజాయ్!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విజయవాడ ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. విజయవాడ జల దిగ్బంధం కావడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ వారం రోజుల పాటు వరద నీటిలోనే కాలం వెళ్లదీశారు. ఇక, వరద బాధితులను పట్టించుకోవడంతో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది.మరోవైపు.. ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి నేతలు, మంత్రులు మాత్రం ఫారిన్ టూర్, హైదరాబాద్ టూర్లలో బిజీ ఉన్నారు. అయితే, విజయవాడలో వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావని అనుకుంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ వెళ్లారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈమేరకు వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావనీ అనుకుంటూ సింగపూర్ చెక్కేసిన టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. విజయవాడ వరదల్లో 60 మందికిపైగా చనిపోయినా పట్టించుకోకుండా సింగపూర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ఎంజాయ్. బాధ్యత మరిచి.. షికార్లతో కాలయాపన చేస్తున్నారని కామెంట్స్ చేసింది. వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావనీ అనుకుంటూ సింగపూర్ చెక్కేసిన @JaiTDP మంత్రి అనగాని సత్యప్రసాద్ విజయవాడ వరదల్లో 60 మందికిపైగా చనిపోయినా పట్టించుకోకుండా సింగపూర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ఎంజాయ్ బాధ్యత మరిచి.. షికార్లతో కాలయాపన#BabuMadeDisaster#VijayawadaFloods… pic.twitter.com/FgIDbkmKwA— YSR Congress Party (@YSRCParty) September 14, 2024 ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
AP: మంత్రి కాన్వాయ్ కోసం.. అంబులెన్స్‌ను ఆపేశారు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను పోలీసులు ఆపేశారు. మంత్రి కాన్వాయ్ వెళ్లే వరకు అంబులెన్స్‌ను వదలలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి సత్య ప్రసాద్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. వారి వాహన శ్రేణి వెళ్లే క్రమంలో పందిమెట్ట జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాలు వెళ్లే వరకు చేయి అడ్డుపెట్టి అంబులెన్సును ట్రాఫిక్ పోలీసులు నిలిపివేయించారు.టీడీపీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్.. కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులుమరోవైపు, నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తీరుతో ఆరుగురు విద్యార్థులు సొమ్ముసిల్లి పడిపోయారు. తాను ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే తీసుకురాగా, ఎండ తీవ్రతకు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. విద్యార్థులను కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లోపలికి ఎవరిని రానివ్వకుండా ఎమర్జెన్సీ వార్డు తలుపులను టీడీపీ నేతలు మూసేశారు. -
మంత్రి అనగాని అరాచకం.. సామాన్యుడి ఇల్లు కూల్చివేత
-
ఉసూరుమనిపించారు.. రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ
సాక్షి, అమరావతి: విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పక్కదారి పట్టింది. కీలకమైన విభజన అంశాలపై కాకుండా ఇతర అంశాలపై అత్యధిక సమయం వెచ్చించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాలు సాగిన భేటీలో ఏ విషయంపై కూడా ఓ అంగీకారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇరు రాష్ట్రాల మంత్రులతో రెండు కమిటీలు వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సమయం అంతా డ్రగ్స్, సైబర్ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై కేటాయించడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ రెండు వారాల్లోగా సమావేశమై చర్చలు జరపనుంది. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చిస్తుందని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీ నిర్ణయాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించనున్నారు. వీరి స్థాయిలో కూడా ఫలితం తేలకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ భేటీ అయ్యి చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు.సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు ప్రశ్నలపై దాటవేతపోలవరం ముంపు మండలాలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై చర్చించారా అని ఇరు రాష్ట్రాల మంత్రులను విలేకరులు ప్రశ్నించగా.. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. నేరుగా సమాధానం ఇవ్వకుండా అన్ని విషయాలు చర్చించామన్నారు. విలేకరులు మరో ప్రశ్న వేస్తుండగానే సమావేశం ముగించి వెళ్లిపోయారు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహూకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వెంకటేశ్వరస్వామి ఫొటో బహూకరించి, రేవంత్, భట్టిలకు చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్, ఇతర అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపానని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందన్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేయడానికి కలిసి పనిచేస్తాంపదేళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. వీటి పరిష్కార మార్గం కోసం కలిసి పని చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడం కోసం సీఎస్ స్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఇంకో కమిటీ వేశాం. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రెండు వారాల్లోగా సమావేశం అవుతుంది. ముందుగా అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలను చర్చిస్తాం. అక్కడ ఫలితం రాకపోతే ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు ఉంటాయి. మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే తిరిగి ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్‌ను అరికట్టడం వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకొని అందుకోసం ఏడీజీ స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏడీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్న కోరికను అంగీకరించింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలను అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నాం.– తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపిల్లల స్కూల్ బ్యాగుల్లో గంజాయివిభజన చట్ట సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్చలతో సత్వరం పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తాం. ఇరు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెందేలా తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. తెలంగాణ కోరిన విధంగా రాష్ట్రంలో గంజాయి సరఫరా నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశాం. ఏపీలో 8వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతోంది. ఏపీలో అత్యధికంగా సాగవుతున్న గంజాయి తమ రాష్ట్రానికి వస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు హర్షించేలా విభజన సమస్యలను పరిష్కరిస్తాం.– ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
అనగాని ఇలాకాలో ఆగని విధ్వంసం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి చేరింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా చితక బాదుతున్నారు. ఊళ్లు వదలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అధికారం అండతో కూటమి నేతలు, ప్రధానంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతుండటంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు తున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి. విలేకరి ఇల్లు కూల్చివేత చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో బుధవారం ఉదయం టీడీపీ నేతలు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి యెనుముల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చివేశారు. వెంకటేశ్వరరావు నాలుగేళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ నేతలు జేసీబీతో వచ్చి ఆయన ఇంటిని కూల్చివేశారు.టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్సార్సీపీకి రావడానికి విలేకరి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయనను బెదిరించిన టీడీపీ నేతలు బుధవారం అతడి ఇంటిని కూల్చివేశారు. గ్రామకంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారనేది టీడీపీ ఆరోపణ. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలామంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరావు మూడేళ్ల క్రితం వేరొకరి వద్ద 4 సెంట్ల స్థలం కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి భార్య శ్యామల పేరున విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆక్రమణలు అనుకుంటే అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా గృహాలు నిర్మించారనుకుంటే అందరికీ నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కానీ.. టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. తన ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు విలేకరి Ððవెంకటేశ్వరరావు ప్రయతి్నంచినా పోలీసులు స్పందించలేదు. వెంకటేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు కూల్చడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ల ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. అలాగే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కె.కన్నప్పరాజు, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఎన్నికను రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మలసాని మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అఫిడవిట్లో తన ఆదాయం, వృత్తి వివరాలను తెలపాల్సి ఉండగా వీరు పొందుపర్చలేదన్నారు. అనగాని సత్యప్రసాద్ కూడా ఆదాయ వివరాలు పేర్కొనలేదని తెలిపారు. వాస్తవాలను దాచి వీరు అఫిడవిట్ దాఖలు చేశారని, ఎన్నికల నిబంధనలకు ఇది విరుద్ధమని మనోహర్‌రెడ్డి వివరించారు. -
టీడీపీలో కలకలం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి తేరుకోక ముందే వరుసగా తగులుతున్న షాక్‌లు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనం కాగా తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీకి చెందిన గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతతో సమావేశమై చర్చించడం, ఇటీవలే పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావును కలవడంతో కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితమే బీజేపీలో చేరిన గరికపాటి మోహనరావు ఆయన్ను దగ్గరుండి బీజేపీ అగ్రనేత వద్దకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. సత్యప్రసాద్‌తోపాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సత్యప్రసాద్ దీన్ని ఖండించారు. పది రోజుల్లోపే మరికొందరు కూడా! ఇటీవలే బీజేపీలో చేరిన చంద్రబాబు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని బీజేపీలో చేర్చేందుకు సుజనా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కమలం గూటికి చేరుకోనున్నట్లు నాలుగు రోజులుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది. తాను బీజేపీలో చేరడం లేదని గంటా పైకి చెబుతున్నా మరికొందరు ఎమ్మెల్యేలను కూడగట్టి పార్టీని వీడేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీమోహన్, గద్దె రామ్మోహన్, మద్దాల గిరి తదితరులు కూడా టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారం పది రోజుల్లోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఏలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ, పామర్రు ప్రాంతానికి చెందిన టీడీపీ నేత కృష్ణబాబు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. బాబు వ్యూహాత్మక మౌనం టీడీపీలో ఇంత జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన వ్యూహం ప్రకారమే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లు బీజేపీలో చేరినట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినా స్పందించకపోవడం, అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయకపోవటాన్ని బట్టి ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతోందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. వ్యక్తిగత పనుల మీదే ఢిల్లీకి: ఎమ్మెల్యే సత్యప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఖండించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వచ్చానని, ఈ విషయమై పార్టీ వర్గాలకు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి సన్నిహితుడైన గరికపాటి ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో పరామర్శించేందుకు వచ్చినట్టు తెలిపారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారడం సరికాదని, రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం వారి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు. బీజేపీలో లంకా చేరిక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆ పార్టీకి రాజీనామా చేసి తాజాగా బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అవమానాలపై కాపు నేతల్లో ఆగ్రహం టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు బుధవారం నిర్వహించిన సమావేశానికి తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ తదితరులు గైర్హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం ఈ వర్గం కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమై పార్టీలో తమ సామాజికవర్గానికి అవమానాలు జరుగుతున్నాయని, అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తమను పట్టించుకోలేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి? టీడీపీలోనే కొనసాగితే తమ పరిస్థితి ఏమిటనే అంశంపై సమాలోచనలు జరిపారు. చంద్రబాబు భజన ఆపాలని తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు
ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు కూడా నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సం బంధించిన పూర్తి వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు... పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయ వాది ఎ.సత్యప్రసాద్ వాదనలు విని పిస్తూ... టెక్ మహీంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవు పై వెళ్లాలని వేధిస్తోందని చెప్పారు. దీనిపై రంగా రెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందన్నారు. కార్మిక శాఖకు చేసిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగా ఉద్యోగులను తొల గించరాదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 47(2) స్పష్టం చేస్తోందన్నారు. ఇటీవల పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొల గిస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమి షనర్ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్య ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న జడ్జి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
విశాఖ ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద సిబ్బంది ఆందోళన సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలు మూత విశాఖపట్నం , న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లాలోనూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు. ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది విధులను బహిష్కరించారు. జెన్కో ఉద్యోగులంతా సీలేరు జలవిద్యుత్ కేంద్రం మెయిన్‌గేటు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. నాలుగింట 505 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ మహారాణిపేటలోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ఆ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ ఇ.గణపతి మాట్లాడుతూ పేరివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు విషయంలో ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. 2014 నూతన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరిమితి లేకుండా వైద్యఖర్చులు చెల్లించాలన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని కోరారు. అనంతరం ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సత్యనారాయణ, ఉప కన్వీనర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. మాచ్‌ఖండ్ సిబ్బంది ఆందోళన ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఆదోళన చేశారు. పీఆర్సీని అమలు చేయాలని జలవిద్యుత్ కేంద్రం కార్మిక, ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఈ కార్యలయం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్ సమస్యను ప్రభుత్వం అమలు చేయకుంటే అత్యవసర సేవలు స్తంభింప చేస్తామని హెచ్చరించారు.


