టెక్‌ మహీంద్రకు హైకోర్టు నోటీసులు | High Court notices to Tech Mahindra | Sakshi
Sakshi News home page

టెక్‌ మహీంద్రకు హైకోర్టు నోటీసులు

Jul 11 2017 2:10 AM | Updated on Sep 5 2017 3:42 PM

టెక్‌ మహీంద్రకు హైకోర్టు నోటీసులు

టెక్‌ మహీంద్రకు హైకోర్టు నోటీసులు

ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టెక్‌ మహీంద్రకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశం 
 
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టెక్‌ మహీంద్రకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌కు కూడా నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సం బంధించిన పూర్తి వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. టెక్‌ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్‌ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్‌ రామచంద్రరావు విచారణ జరిపారు. 
 
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు... 
పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయ వాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు విని పిస్తూ... టెక్‌ మహీంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవు పై వెళ్లాలని వేధిస్తోందని చెప్పారు. దీనిపై రంగా రెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందన్నారు. కార్మిక శాఖకు చేసిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగా ఉద్యోగులను తొల గించరాదని షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌ లోని సెక్షన్‌ 47(2) స్పష్టం చేస్తోందన్నారు. ఇటీవల పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొల గిస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమి షనర్‌ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్య ప్రసాద్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న జడ్జి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement