breaking news
	
		
	
  Salt and pepper getup
- 
      
                   
                               
                   
            ధోని కొత్త లుక్ అదుర్స్.. ఫోటో వైరల్
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని కొత్త అవతారంలో అదుర్స్ అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ధోని బయట పెద్దగా కనబడడం లేదు. కేవలం ఐపీఎల్ ఉన్నప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఐపీఎల్ మొదలవనున్న నేపథ్యంలో ధోని తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ఇటీవలే ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా తన ప్రాక్టీస్ ముగించుకొని బయటకు వస్తున్న ధోని తెల్ల గడ్డం, నల్లజుట్టుతో సాల్ట్ అండ్ పెపర్ లుక్‌లో అభిమానుల కంటపడ్డాడు. ధోనీ ఇలా కొత్తగా కనిపించడం చాలా మందిని ఆకర్షించింది. నిజానికి ఒక రోజు ముందు కూడా ధోనీ ఫొటోలను కొందరు అభిమానులు తీశారు. కానీ దూరం నుంచి కావడంతో అతన్ని స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. గతేడాది కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే ఈసారి మాత్రం ధోనికి చివరి ఐపీఎల్ కానుందని చాలా మంది అభిమానులు జోస్యం చెబుతున్నారు. ధోని సారధ్యంలో సీఎస్కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక గతేడాది రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి అతను మధ్యలోనే వైదొలగడంతో తిరిగి ధోనినే జట్టును నడిపించాడు. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్‌లాడి నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. New look of MS Dhoni during the practice session ahead of IPL 2023 pic.twitter.com/5V7qARShxp — Johns. (@CricCrazyJohns) January 20, 2023 MS Dhoni practicing at nets ahead of IPL 2023 !! 😍💥#MSDhoni • #IPL2023 • #WhistlePodu pic.twitter.com/Ai1FGVosGP — Nithish MSDian 🦁 (@thebrainofmsd) January 19, 2023 చదవండి: రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం - 
      
                   
                               
                   
            తెల్లజుట్టు బాండ్
మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 57 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ప్రస్తుతం బాండ్ 25వ సినిమా రూపొందుతోంది. ‘నో టైమ్ టు డై’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదోసారి బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 8 విభిన్న లుక్స్‌లో బాండ్ కనిపిస్తారట. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ (సగం నెరిసిన జుట్టు)లోనూ కనిపిస్తారట. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. - 
      
                   
                               
                   
            మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా అజిత్?

 సూపర్‌స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన బాషా చిత్రం విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని రజనీకాంత్ ఆ తరహా గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న చిత్రం కబాలి.దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చును. కాగా ఆ తరువాత స్థాయిలో ఉన్న నటుడు అజిత్ సూపర్‌స్టార్ బాణీలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ నటించిన బిల్లా చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అది రజనీకాంత్ నటించిన బిల్లా చిత్రానికి రీమేక్ అన్నది తెలిసిన విషయమే.
 
 తాజాగా అజిత్ కూడా మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా తనదైన స్టైల్లో రెచ్చిపోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. అజిత్‌ను వీరం చిత్రం ద్వారా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో చూపించి ప్రేక్షకుల ఆమోదాన్ని, ఆయన అభిమానుల ఆదరణను పొందేలా చేసిన దర్శకుడు శివ. ఈయన ఆ తరువాత కూడా వేదాళం చిత్రంలో అలాంటి విభిన్న గెటప్‌లోనే అజిత్‌ను చూపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అజిత్‌ను డెరైక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు దర్శకుడు శివ.
 
 అయితే ఈ సారి అజిత్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సత్యజ్యోతి ఫిలింస్ అధినేత టి.త్యాగరాజన్ సన్నాహాలు చేస్తున్నారు. జూన్ నెలలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు.దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు.
 
 


