breaking news
saligramapuram
-
స్మగ్లర్ల రూటే సెపరేటు
-
విశాఖలో గంజాయి ముఠా గుట్టు రట్టు
-
విశాఖలో గంజాయి ముఠా గుట్టు రట్టు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు చేధించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. టాస్క్‌ఫోర్స్, విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు సాలిగ్రామపురంలో సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని మానుకొండ సత్యనారాయణ, మజ్జి అజయ్ కుమార్, కంది రవికుమార్, మనోజ్ స్వరూప్లుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి 61 ఎల్ఎస్డీ, 2.5 గ్రాముల ఎండీఎంఏ, 60 గ్రాముల గంజాయి, 9,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మానుకొండ సత్యనారాయణ గతంలోనూ విశాఖ రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. నిందితులపై 21(బి), 27(ఎ), 20(బి) ఎన్డీపీఎస్(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. (వైరల్ : జడ్జీ కళ్ల ముందే గంజా సిగరెట్ తాగాడు) చదివింది డిగ్రీ.. డబ్బు కోసం అడ్డదారులు గుంటూరు: గుంటూరులో గంజాయి మాఫియా గుట్టురట్టైంది. లిక్విడ్ రూపంలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల దాడుల్లో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరందరూ డిగ్రీ పూర్తి చేసిన వారే కాగా సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారుల బాట పట్టారు. వీరి దగ్గర నుంచి 8 కేజీల గంజాయి, 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. (‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’) -
సిలిండర్ పేలుడుపై పలు అనుమానాలు: ఏసీపీ
విశాఖపట్నం జిల్లా సాలిగ్రామపురంలోని ఇంట్లో బుధవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. దాంతో ఇంట్లో నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిపమాక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సుల్తానా (40), సోఫియా (17), షఫీ (8)లుగా గుర్తించినట్లు చెప్పారు. ఇంటి యజమాని మొయినుద్దీన్ విశాఖపట్నం పోర్టులో కళాసిగా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు వివరించారు. అయితే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని... ఆ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ పేలిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ ప్రమాదానికి షార్ట్ సర్క్యూల్ కారణం కాదని విద్యుత్ సిబ్బంది వెల్లడించారు. అయితే ప్రమాద ఘటన పలు అనుమానాలకు తావిచ్చేదిగా ఉందని నగర ఏసీపీ మహేష్ విలేకర్లుకు వెల్లడించారు. దాంతో ఇంటి యజమాని మొయినుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని అతడు పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.