breaking news
sai ramakrishna
-
వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురి అరెస్ట్
కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని సాయి రామకృష్ణ లాడ్జి పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు విటులు, ఇద్దరు యువతులతో పాటు లాడ్జి మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతులకు కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. వ్యభిచారం పై పూర్తి నిఘా ఉందని, ఎప్పటికైనా దీనిని నిర్వహించే వారు మానుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస రావు హెచ్చరించారు. -
సాయిరామకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం
సామర్లకోట : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన తోటకూర సాయిరామకృష్ణ సోమవారం దిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈయన జాతీయ అవార్డు పొందడంపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ మన్యం పద్మావతి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, ఉబా జాన్ మోజెస్, పితాని సూర్యనారాయణ, జుత్తుక సుబ్బలక్ష్మి, నేతల వెంకటలక్ష్మి, పీబీ దేవం సొసైటీ అధ్యక్షుడు తోటకూర శ్రీనివాసు, మండల విద్యాశాఖాధికారి పి.జాన్ తదితరులు అభినందనలు తెలిపారు.