breaking news
Rs.20
-
ఉపాధి కూలీ రూ. 20
దొరవారిసత్రం: సాధారణంగా రూ. 130 నుంచి 160 వరకూ చెల్లించాల్సిన ఉపాధికూలీ కేవలం రూ. 20 మాత్రమే చెల్లిస్తుండటంతో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండల పరిషత్తు కార్యాలయం వద్ద దర్శనమిచ్చింది. మండలంలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది కార్మికులు పరిషత్తు కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పూర్తిగా కూలీ చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు. -
కేజీ ఉల్లి రూ.20 కే అందిస్తాం: టీ సర్కార్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నవేళ తెలంగాణ ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఒక కేజీ ఉల్లిగడ్డలను రూ. 20 కే అందించనున్నట్లు ప్రకటిచంది. ఉల్లి ధరల పెరుగుదలపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బహిరంగ మార్గెట్ లో ఉల్లిగడ్డ ధర ఒక కిలోకు రూ. 40 గా ఉంది. కొన్ని చోట్ల ఇంతకు మించి కూడా ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం మొత్తం 80 ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్ లో 40 కేద్రాలు, మిగతా జిల్లాల్లో మరో 40 ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఏపీలోని కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్ ల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.