breaking news
Rs 25
-
పీఎఫ్ సీలింగ్ పరిమితి పెంపు?
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పీఎఫ్ అర్హతకు ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసేందుకు అడుగులు వేస్తోంది. నెలకు రూ. 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది. వచ్చే నెలలో జరుగబోయే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయంపై చర్చించనుందని తెలుస్తోంది. ధరల పెరుగుదల, వేతన సమీక్షలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు సమాచారం. అంతేకాక సంఘటిత రంగంలో ఉన్న 60 లక్షలకు పైగా ఉద్యోగులను కూడా తమ సోషల్ సెక్యురిటీ పరిధిలోకి చేకూర్చుకోనుందట. ఇప్పటివరకు ఈ రంగంలో 4 కోట్ల మంది ఉద్యోగులు మాత్రమే ఈపీఎఫ్ఓ ఖాతాదారులుగా ఉన్నారు. మరోవైపు ఈపీఎఫ్ఓ బోర్డు ప్రతిపాదించిన రూ.25వేల కనీస వేతన పరిమితికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టి దాన్ని తగ్గించనుందని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ కవరేజ్ వ్యవహారంలో మధ్యే మార్గాన్ని అనుసరిస్తూ కనీస వేతనాన్ని 21వేల రూపాయలుగా నిర్ణయించనున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. కాగ, 2014 సెప్టెంబర్ 1న వేతన సీలింగ్ నెలకు 15వేల రూపాయలుగా ఉండేటట్టు ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. అప్పటివరకు ఈ పరిమితి రూ.6500గా ఉండేది. కాగా, ఈపీఎఫ్ఓ ప్రతిపాదన అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వంపై రూ.2,700 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది. దాదాపు 4 కోట్ల మంది ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రసుత్తం రూ.6,700 కోట్లు వెచ్చిస్తోంది. -
కావేరి జల గండంతో రూ.25 వేల కోట్ల నష్టం
-
17ఏళ్ల సర్వీసు...25 రూ.జీతం
శ్రీనగర్: భారత్ వెలిగిపోతోందని మురిసిపోయే వారికి షాకింగ్ న్యూస్. పేదలకు అచ్ఛేదిన్ అని ప్రగల్భాలు పలికే పాలకులకు ఇదొక చెంపపెట్టులాంటి వార్త. జమ్ముకశ్మీర్‌లోని ఒక ప్రభుత్వ స్కూలులో చౌకీదార్‌గా (స్వీపర్) పనిచేసి రిటైరైన మహ్మద్ సుభాన్ వాని (64)కథ వింటే ఎవరికైనా ఇలాగైనా అనిపిస్తుంది. స్కూలు నిర్మాణం కోసం భూమిని వదులుకోవడం, దానికి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన పరిహారం ఇప్పటివరకు రాకపోవడం ఒకటైతే, సుదీర్ఘకాలం ఆ స్కూలు కోసం సేవ చేసినా నెలకు పాతిక రూపాయల జీతంతోనే రిటైరవ్వడం మరో విషాదం. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ పాఠశాల కోసం తన సొంత స్థలాన్ని వదులుకున్న మహమ్మద్, అదే స్కూల్లో 1988లో నెలకు పాతిక రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు. పదిహేడేళ్ల పాటు కేవలం 25 రూపాయల జీతంతో పనిచేశాడు. జీతం పెంచమని ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితం శూన్యం. చివరికి ఆ జీతంతోనే 2005 లోఉద్యోగం విరమణ కూడా చేశాడు. పొలంలోని చెట్ల ద్వారా వచ్చే మంచి ఆదాయాన్ని వదులుకుని మరీ స్కూలు కోసం తన భూమి ఇచ్చినట్లు మహమ్మద్ తెలిపాడు. తనకు చదువు అంతగా రాదని, ప్రభుత్వం తనను మోసం చేస్తుందని అనుకోలేదని అతడు వాపోతున్నాడు. న్యాయం కోసం ఎక్కని ఆఫీసు గుమ్మం లేదు, కలవని ఆఫీసర్ లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ స్కూలు కోసం, బంగారంలాంటి తన భూమిని వదులుకున్నాడో.. ఆరోజే తన బిడ్డల భవిష్యత్తును బుగ్గిపాలు చేశానని మహమ్మద్ ఇప్పుడు కలత చెందుతున్నాడు. న్యాయ పోరాటం చేయడానికి అవసరమైన డబ్బు కూడా తమ దగ్గర లేదని వాపోతున్నాడు. పిల్లల చదువుల కోసం ఉపయోగపడే స్కూలుకు తన భూమిని ఇవ్వడం తన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుందని అపుడు అతను ఊహించలేదు. ప్రభుత్వం మొండి చేయి చూపించింది. తూతూ మంత్రంగా స్వీపర్ ఉద్యోగం ఇచ్చి సరిపెట్టుకుంది. అదీ అరకొర జీతంతో ఈ విషయాన్ని బీబీసీ రిపోర్టు చేసింది. ఆ గ్రామంలో పాఠశాల కోసం స్థలానికి వదులుకున్న వ్యక్తి మహమ్మద్ ఒక్కడేననీ పేర్కొంది. అతని కొడుకులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ, జీతాలు పెంచుతామన్న హామీ సహా నష్టపరిహారం అందలేదని వెల్లడించింది. ఇక్కడ ఇంకో విషాదం ఏమంటే మహమ్మద్ కొడుకు ముంతాజ్ అహ్మద్ కూడా అదే జీతంతో అదే స్వీపర్ ఉద్యోగంలో చేరాడు. ఎప్పటికైనా తమకు న్యాయం జరగకపోతుందా అనే ఆశతో. కానీ, రెండు మూడు నెలలుగా అతనికి ఆ జీతం కూడా ముట్టడం లేదు.