breaking news
Romantic Destination
-
జంటగా ప్రపంచ అందాల్ని చూసొద్దాం!
ప్రేమికులైనా.. నవ దంపతులైనా! ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి భావాలను, ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగితేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అందుకే కొత్తగా పెళ్లైన చాలా మంది జంటలు వారి భాగస్వామితో కలసి హనీమూన్‌కు వెళుతూ ఉంటాయి. మీరు కూడా మీ పార్టనర్‌తో కలసి ఎక్కడికైనా వెళ్లి ఏకాంతంగా గడపాలని ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీ కోసమే. ప్రపంచంలో ఉన్న అందమైన హనీమూన్ స్పాట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి. -
ప్రపంచంలో రెండో శృంగార ప్రాంతంగా కశ్మీర్
కశ్మీర్: జమ్ము కశ్మీర్ అంటే నిత్యం వేర్పాటు వాదుల ఆందోళనలు కాదు. నిరంతర సైనిక పద ఘట్టనల కవాతుల శబ్ధం కాదు. కశ్మీర్ అంటే ప్రకృతిసౌందర్యం. భారతదేశ మణికిరీటం. భూతల స్వర్గం. అలాంటి రాష్ట్రానికి లాన్లీ ప్లానెట్ ట్రావెల్ మ్యాగజైన్ ప్రపంచంలోనే రెండో రొమాంటిక్ ప్రాంతంగా గుర్తించింది. మొదటి స్థానం స్విట్జర్లాండ్ కు దక్కింది. కశ్మీర్ వాలీలోని గాలిని పీల్చినా రొమాంటిక్ భావనలు తిరిగొస్తాయని, అశాంతి పరిస్థితులు అక్కడి పర్యాటకులను ఏమాత్రం ఆపలేదని మ్యాగజైన్ ప్రచురించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రోజూ కశ్మీర్ వ్యాలీకి 4000 మంది పర్యటకులు వస్తున్నారని తెలింది. ఉగ్రవాదం పెరుగకముందు సినిమా షూటింగ్ లు అధికంగా జరిగేవి. అయినా ఆరాష్ట్రం మరోసారి 'అత్యంత శృంగార' అనే రొమాంటిక్ ట్యాగ్ ను తిరిగి పొందిందని మ్యాగజైన్ స్పష్టం చేసింది. Kashmir, Second,Romantic Destination,magazine Lonely Planet,కశ్మీర్,రెండో ర్యాంక్, లోన్లీ ప్లానెట్,