breaking news
rocked
-
భారత దేశం దూసుకుపోతోంది..
న్యూఢిల్లీ: భారత దేశంలో చాయ్ అమ్ముకుంటున్న మహిళకు నూటికి నూరు శాతం తనకు రావాల్సిన సొమ్ము నేరుగా ప్రభుత్వం నుండి డిజిటల్ చెల్లింపుల రూపంలోనే అందుతోంది. ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా 89.5 మిలియన్ల డిజిటల్ చెల్లింపులతో భారతదేశం పెనుసంచలనం సృష్టించిందన్నారు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి. ఇదీ నాయకత్వం అంటే.. గురువారం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లోనూ, ఆర్ధిక సాంకేతికతలోనూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన గురించి, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ గురించి ప్రస్తావించారు. మోదీ నాయకత్వంలో భారత దేశం సాంకేతికంగా దూసుకుపోతోందని, త్వరలో జరగబోయే అమెరికా పర్యటనతో మన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయన్నారు. అజిత్ ధోవల్ గురించి చెబుతూ ఆయన భారత దేశానికి దొరికిన గొప్ప సంపదని అన్నారు. ఒప్పందాలు.. పెనుమార్పులు.. ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని రాక కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే వారం వాషింగ్టన్ లో పర్యటించనున్న మోదీ రక్షణ విభాగంలోనూ, వాణిజ్య విభాగంలోనూ అమెరికాతో చేయనున్న ఒప్పందాలు రెండు దేశాల మధ్య అనేక అడ్డంకులను తొలగించి సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే.. -
పొడవాటి గౌన్లు.. హొయలొలికించిన భామలు
అమెరికాః ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. డిజైనర్లు విభిన్న రీతులను ప్రదర్శించడంలో తమ ప్రతిభను అత్యద్భుతంగా చాటుతున్నారు. ఇటీవల ప్రారంభమైన మెట్ గాలా ఫ్యాషన్ పెరేడ్ అందుకు తార్కాణంగా నిలిచింది. అందమైన పొడవాటి గౌన్లు ధరించి, ఎర్రతివాచీపై ఒయ్యారాలొలికించిన మోడల్స్ సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఫ్యాషన్ కు మరోపేరైన మెట్ గాలా 2016 సంబరాలు అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాలీవుడ్ నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్లు అనేకమంది హాజరయ్యారు. విలక్షణమైన డిజైన్లతో కూడిన విభిన్న దుస్తులు ధరించిన సెలబ్రిటీలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నారు. ప్రతియేటా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ సంస్థకు నిధులు సేకరించేందుకు ఈ మెట్ గాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఫ్యాషన్ ప్రముఖ మోడల్స్ తో పాటు, నటీనటులు కూడ స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారు. ఈసారి కార్యక్రమం ప్రారంభోత్సవంలో హాలీవుడ్ తారలు ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఫ్యాషన్ పెరేడ్ లో పాల్గొన్న మోడల్స్... తమ దుస్తుల డిజైన్లలో ఒక్కోరు ఒక్కో ప్రత్యేకతను ప్రదర్శించారు. మినీలూయిస్ విట్టన్, మెటాలిక్ రబ్బరు గివెన్సీ గౌన్లు, అద్దకాలతో కూడిన లేజర్ కట్ యాక్రిలిక్స్, షిఫాన్ బుర్బెర్రీ దుస్తులతోపాటు... గొలుసులతో అల్లినట్లుగా కనిపించే చెయిన్ మెయిల్ బాల్మెయిన్ వంటి అనేక రకాల అదరగొట్టే డిజైన్లను ధరించిన మోడల్స్ ర్యాంప్ పై హొయలొలికించారు. ఫ్యాషన్ షోలో తన ఫేరీ టేల్ దుస్తులతో విభిన్నతను చాటిన క్లారీ డేన్స్ ప్రత్యేకతగా నిలువగా, కెన్డాల్ జెన్నర్ ఫ్యాషన్ ప్రపంచాన్ని తన దుస్తులతో విభిన్నంగా చూపారు. జిగి, జాయిన్ లు రోబో కాప్ లుక్ తో మెట్ గాలా బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు.