breaking news
ridiculous contract
-
ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ నాయకుడు, వాయ్‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాహుల్ పర్యటన ముగింపు సందర్భంగా లండన్‌లోని చతం హౌస్ థింక్ ట్యాంక్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ భారతదేశంలో శాశ్వతంగా అధికారంలో ఉంటుందని భావిస్తోంది. కానీ అందులో నిజం లేదని, అలాని కాంగ్రెస్ పోతుందని అర్థం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిశీలిస్తే ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలోకి రాకమునుపే మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం." అని అన్నారు. అలాగే మరోసారి ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసెస్ గురించి మరోసారి ప్రస్తావించారు. అంతేగాదు భారత ప్రజస్వామ్యానికి మరమత్తులు చేపట్టడానికి ప్రతిపక్షాలన్ని కలిసి రావాలని పిలుపునిచ్చారు. భారత్‌లో జరుగుతున్న మార్పులను ఎత్తిచూపారు. తాము అధికారంలో ఉంటే గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టిసారిస్తాం అన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పోయిదనేది అవాస్తవం అని నొక్కి చెప్పారు. అలాగే కాంగ్రెస్ తోపాటు విదేశీ మీడియా సైతం భారత ప్రజాస్వామ్యంలో తీవ్ర సమస్య ఉందని హైలెట్ చేసి మరీ చెబుతోందన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ని ఫండమెంటలిస్ట్ ఫాసిస్ట్ సంస్థగా లక్ష్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదీ దేశంలోని సంస్థలను స్వాధీనం చేసుకుంటోందని, దీన్ని ఒక రహస్య సమాజం అని పిలవచ్చని అన్నారు. ముస్లీం బ్రదర్ హుడ్ తరహాలో నిర్మితమైందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకుని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్నే అణిచేస్తుందని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పత్రికా, న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల సంఘం తదితరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు రాహుల్. అలాగే భారత విదేశాంగ విధానంపై, భారత్ చైనా సంబంధాలపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. కాగా, విదేశీ గడ్డపై రాహుల్ భారత్‌ని దూషించారంటూ బీజేపీ ఆరోపించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ లండన్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత్‌కు ద్రోహం చేయకండి, భారత విదేశాంగ విధానంపై మీరు చేసిన వ్యాఖ్యలు మీ అవగాహనలేమికి నిదర్శనం అంటూ కొట్టిపారేశారు. విదేశీ గడ్డపై మీరు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ నమ్మరన్నారు. ఆయన ఎంతసేపు తనను తాను హైలెట్ చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు అనురాగ్ ఠాగూర్. (చదవండి: కూతుళ్ల కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటున్న జంట..ఓ తండ్రి గొప్ప నిర్ణయం..) -
‘మహా’ ఒప్పందం బూటకమే
రీడిజైన్ల పేరిట సర్కార్ దోపిడీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన సంగారెడ్డి మున్సిపాలిటీ: కాంగ్రెస్ హయాంలో ప్రవేశ పెట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ పేరిట సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని పీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి విమర్శించారు. మంగళవారం టీఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో జల పంపకాలపై ఒప్పందం చేసుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గత పాలకులు చేసుకున్న ఒప్పందాలనే తప్పు పడుతూ రీడిజైనింగ్ పేరిట తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్లకే పరిమితం చేసే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టుగా అన్ని అవకాశాలుండి కేంద్రం వద్ద ఉన్న ప్రతిపాదనలను కాదని కనీసం డీపీఆర్‌లు కూడా సిద్ధంగా లేని ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏ రకంగా చూసినా తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసే కుట్ర పూరిత ఒప్పందమని ఆయన తెలిపారు. ప్రాణహితను తమ్మిడి హట్టి వద్దే 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, నాయకులు కుసుమ్‌కుమార్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని భారీ ర్యాలీ అంతకుముందు పట్టణంలోని రాంమందిర్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించడంతో దాదాపు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.