breaking news
Rheumatic fever
-
పిల్లల్లో జలుబు, గొంతునొప్పి, తీవ్రజ్వరం.. లైట్ తీసుకోకండి!
చిన్నపిల్లలకు జలుబు చేశాక వచ్చే గొంతునొప్పితో పాటు చాలా ఎక్కువ తీవ్రతతో వచ్చే జ్వరం (హైఫీవర్) తో బాధపడుతున్నారనుకోండి.. ‘ఆ... జలుబే కదా... చిన్న గొంతునొప్పే కదా..’ అని నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ వాస్తవం. పిల్లలకు జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా చూడకూడదు. ఇందుకు ఓ కారణం ఉంది. జలుబు, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఇది కొందరిలో గ్రూప్–ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే దీనికి సరైన యాంటీబయాటిక్స్‌తో పూర్తి కోర్సు వాడుతూ చికిత్స అందించాలి. అలా జరగకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు తొలుత జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటిమీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్‌గా అనుమానించాలి. అలాగే ఈ పిల్లల్లో శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపిస్తాయి గానీ... ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్‌ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలు. అయితే చిన్న పిల్లల్లో ముందుగా వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. అది రుమాటిక్ ఫీవర్‌కు దారి తీసే ప్రమాదమూ ఉందని కూడా వారికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చదవండి: పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త! నిజానికి రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దాదాపు పదేళ్లు కొనసాగితే మాత్రం... గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. చికిత్స / నివారణ వాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా చికిత్స చేస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా ముగిసిపోతుంది. కానీ ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది (చాలా కొద్దిమంది పిల్లల్లోనే). మరికొందరిలో బ్లడ్‌థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు సైతం అదీ ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జలుబు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకూడదు. పీడియాట్రీషియన్‌ను ఓసారి తప్పనిసరిగా సంప్రదించడమే మేలు. ఇంత పెద్ద సమస్య కేవలం ఒక పూర్తి (కంప్లీట్) కోర్సు యాంటీబయాటిక్తోనూ... అంతేగాక... శారీరక/వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)తోనూ నివారించవచ్చని గుర్తుంచుకోవాలి. -
గొంతునొప్పితో గుండెకూ చేటు!
కౌన్సెలింగ్ మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఇటీవల వాడు గొంతు నొప్పి అంటుంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేసి అది రుమాటిక్ ఫీవర్ అని, ఇదొక రకం గుండె సమస్య అని చెప్పారు. చూడటానికి జలుబు లా చిన్న సమస్యగా అనిపించే ఇది గుండె సమస్య లాంటి పెద్ద సమస్య ఎలా పరిణమించింది? దయచేసి వివరించండి. – గోపాల్‌రావు, హైదరాబాద్ గొంతునొప్పికీ....గుండె జబ్బుకూ సంబంధం ఉంటుందన్న మాట వినడానికే కాస్త నమ్మకం కలిగించేదిగా లేదు కదా. అయితే చిన్నారులకు బాగా జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా పరిగణించకూడదు. ఎందుకంటే అది కొందరిలో జలుబు, గొంతునొప్పితో వ్యక్తమయ్యే ఆ లక్షణాలు స్ట్రెప్టోకోకస్ పీయోజెన్స్ వల్ల టాన్సిలైటిస్కూ, ఆ తర్వాత రుమాటిక్ ఫీవర్కూ దారి తీసే అవకాశం ఉంది. ఈ రుమాటిక్ ఫీవర్ సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా 5 – 10 ఏళ్ల పాటు రుమాటిక్ ఫీవర్ కొనసాగితే, అది గుండె వాల్వ్స్పై దుష్ప్రభావం చూపి గుండెకు నష్టం చేస్తుంది. దీనికి తొలి దశలో యాంటీబయాటిక్స్‌తో చాలా చాలా చిన్నదైన తగిన చికిత్స అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించినప్పటికీ చాలా మంది చిన్నారులకు వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం కూడా పడవచ్చు. అలాగే రక్తం పలుచబార్చే మందులు జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి వారిలో ఆడ పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు ప్రెగ్నెన్నీ వస్తే అది కూడా ఒక సమస్యగా పరిణమించవచ్చు. అందుకే గొంతునొప్పితో జలుబును పోలి ఉండే ఒక మామూలు సమస్యనూ చిన్న సమస్యగా పరిగణించకూడదు. మీరు చెప్పిన అంశాలను బట్టి ఇది ఇంకా చాలా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మీరు వెంటనే దగ్గర్లోని గుండె నిపుణులను సంప్రదించండి. డాక్టర్ కృష్ణప్రసాద్, చీఫ్ కార్డియోవాస్క్యులర్ థొరాసిక్ సర్జన్ అండ్ డైరెక్టర్,మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మీసాల్లో దురద తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయికి వంటి మీద చిన్న చిన్న కురుపుల్లా వచ్చాయి. వేళ్ల మధ్యలో కూడా పొక్కుల్లా వున్నాయి. వీటిమూలంగా దురదతో చాలా బాధ పడుతున్నాడు. దీనికి హోమియోలో మంచి మందులు ఉంటే తెల్పగలరు. - నీలిమ, హైదరాబాద్ మీ అబ్బాయికి వచ్చినది దురదతో కూడిన ఒక అంటువ్యాధి. ఇది సార్కోప్టెస్ స్కాబీ అనే ఒక పరాన్నజీవి వలన ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది చర్మంలో రంధ్రా లు చేసి దురదను కలిగిస్తుంది. ఈ జీవి ఎగరలేదు కాని చాలా వేగంగా పాకుతుంది. దోమకాటు, నల్లికాటు, కుక్క లేదా పిల్లిని పెంచడం వల్ల వాటి ఒంటి మీద ఉండే రోమాల కారణంగా కూడా దురదతో కూడిన ఇన్ఫెక్షన్ ఉంటుంది. దురద రాత్రిపూట ఎక్కువగా ఉండటం, చర్మం కన్నాలు పడినట్లు ఉండటం గమనించవచ్చు. లక్షణాలు: చర్మంపై చిన్న చిన్న కురుపులలాగా, రక్తంతో కూడిన బొబ్బల మాదిరిగా వస్తాయి. ఇవి చేతివేళ్లమధ్యలో, మణికట్టు, కీళ్లవెనుక, నడుము, నాభి, పాదాల దగ్గర ఎక్కువగా వస్తాయి. దురద మొదట తక్కువగానే ఉంటుంది. కాని కాలం గడిచేకొద్దీ దురద ఎక్కువ అవుతుంది. నిద్రాభంగం కూడా అవుతుంది. గోక్కోవడం వలన చర్మం దెబ్బతిని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కారణాలు: వ్యాధిగ్రస్థులు వాడే వస్తువులు వాడటం వలన, ఇతరుల పక్కబట్టలు, వ్యాధి కలవారిని తాకినా వచ్చే అవకాశం ఉంది. ఇది సాధారణంగా మానసిక వికలాంగులలో, శరీరభద్రతావ్యవస్థ లోపించిన వారిలో, ఎయిడ్స్, లింఫోమా ఉన్న వారిలో రావచ్చు. మోకాళ్లు, అరచేతులు, నుదురు, అరికాళ్లలో ఎక్కువగా వస్తుంది. చర్మం మొదట పొడిబారిపోయి పొట్టులాగా ఏర్పడుతుంది. తర్వాత పులిపిర్లలాగా లేదా చీముగడ్డలలాగా మారుతుంది. గోళ్లు మందంగా అయ్యి, రంగు మారతాయి. దుర్వాసనతో కూడిన చెమటలు ఎక్కువగా పడతాయి. చలిని తట్టుకోలేరు. దురద ఉంటుంది కాని సాధారణ స్కాబిస్ ఇన్ఫెక్షన్లా ఇందులో దురద అంత తీవ్రంగా ఉండదు. పుండు ఉన్న చోట చుట్టూ చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. లింఫ్ గ్రంథుల వాపు, జ్వరం, చలి, వికారం వంటి లక్షణాలు కనపడతాయి. మానసిక ఆందోళన అధికమైన కొద్దీ దురద, చిరాకు, మంటలు ఎక్కువ అవుతాయి. నివారణ: వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, వ్యాధిగ్రస్థులు వాడిన దుస్తులు, దువ్వెనలు తదితర వస్తువులను ఉపయోగించకపోవటం, లక్షణాలు కనిపించినప్పుడే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించడం అవసరం. స్టార్ హోమియోపతి చికిత్స: మెర్క్‌సాల్, హెపార్ సల్ఫ్, పెట్రోలియా, సారస్పరిల్లా, ఎకినీషియా వంటి మందులను వ్యాధి లక్షణాలను బట్టి, రోగి వ్యక్తిత్వాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుని మందును నిర్ధారిస్తారు. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23 ఏళ్లు. గత ఐదేళ్లుగా రుమాటిక్ ఫీవర్‌తో బాధపడుతున్నానను. ప్రస్తుతం నేను పెన్సిలిన్ ఎల్ఏ 1200 తీసుకుంటున్నాను. ఇంకా రెండేళ్ల వరకు పెనిడ్యూర్ ఇంజెక్షన్ తీసుకోవాలని డాక్టర్ సూచించారు. ఇంజెక్షన్ తీసుకోకపోతే నాకు ఒక్కసారిగా కీళ్లనొప్పి, ఛాతీలో నొప్పి మొదలవుతాయి. నేను ఎంతకాలం ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి వివరంగా చెప్పండి. - మురళీకృష్ణ, కందుకూరు మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ గుండెలోని ఎడమవైపు గదుల్లో ఉండే మైట్రల్ వాల్వ్ వనే కవాటం పరిమాణం పెరిగి మందమైనట్లుగా తెలుస్తోంది. కాబట్టి గుండె సంకోచం జరిగేటప్పుడు రుమాటిక్ ఫీవర్ వస్తోంది. కాబట్టి మైట్రల్ వాల్వ్‌కు ఎలాంటి ఇన్షెక్షన్ సోకకుండా, నష్టం జరగకుండా మీరు పెన్సిలిన్ ప్రొఫిలాక్సిస్ (ముందుజాగ్రత్తగా) ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. మీ వాల్వ్ పరిస్థితిని పరిస్థితులను గమనించడానికి పన్నెండు నెలలకు ఒకసారి ఈసీజీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. మీరు పాల ఉత్పాదనలు (డయరీ ప్రాడక్ట్స్), పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యులను సంప్రదిస్తూ ఉంటే మీరు అందరిలాగే పూర్తికాలం జీవించవచ్చు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా నాన్నగారి వయసు 60 ఏళ్లు. బరువు 90 కిలోలు. గత మూడు నెలలుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌ను సంప్రదిస్తే కరొనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష నిర్వహించి, గుండెకు సంబంధించిన వ్యాధి ఏమీ లేదని చెప్పారు. ఇది కండరాలకు సంబంధించిన నొప్పి అని తేల్చారు. అయితే ఛాతీలో నొప్పికి కారణం ఏమిటో తెలియడం లేదు. దయచేసి మా నాన్నగారి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - జయకుమార్, నందిగామ సాధారణంగా ఛాతీలో నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ఛాతీ భాగంలో కండరాలు, ఆహారనాళం, ఊపిరితిత్తులు, దాని పొరలు... ఇలా అనేక అంతర్గత భాగాలు ఉంటాయి. కరొనరీ యాంజియోగ్రామ్ ద్వారా ఇది గుండెకు సంబంధించిన సమస్య కాదని నిర్ధారణ అయ్యింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బహుశా అది గ్యాస్ట్రయిటిస్ సమస్య కావచ్చు. అయితే నిర్దిష్టంగా సమస్యను నిర్ధారణ చేయడానికి ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. నాకు మీసాలలో విపరీతమైన దురద వస్తోంది. రోమం మూలల్లో ఇది ఎక్కువగా అనిపిస్తోంది. గత నెల రోజులుగా ఇలా జరుగుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కిశోర్, హైదరాబాద్ మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీరు సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీసాలలో దురద రావడం అనే సమస్య సెబమ్ అనే నూనె వంటి స్రావం ఎక్కువగా స్రవిస్తున్నందువల్ల కావచ్చు. మీ సమస్యను అధిగమించడానికి ఈ కింది సూచనలు పాటించండి. మోమటోజోన్తో పాటు టెర్బనాఫిన్ యాంటీ ఫంగల్ ఉండే కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమును ప్రతిరోజూ రాత్రిపూట మీ మీసాల వద్ద చర్మంపై రాసుకోండి. ఇలా పది రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. కొద్ది నెలల పాటు ఐసోట్రెటినాయిడ్ టాబ్లెట్లను నోటి ద్వారా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్య సత్వర పరిష్కారానికి డర్మటాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 31 ఏళ్లు. నేను రజస్వల అయినప్పటి నుంచి నా శరీరం దుర్వాసన ఎక్కువగా వస్తోంది. రోజుకు మూడు సార్లు స్నానం చేస్తున్నా ఈ దుర్వాసన తగ్గడం లేదు. నా సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వండి. - ఒక సోదరి, గుంటూరు కొంతమందిలో చర్మంపై ఉండే సెబేషియస్ గ్లాండ్స్ చాలా ఎక్కువగా పనిచేస్తుంటాయి. చర్మంపై ఉన్న ఈ గ్రంథుల నుంచి సీబమ్ అనే ఒక రకమైన నూనె స్రవిస్తుంటుంది. ఈ స్రావాలకు చెమట కూడా తోడైతే, దాని వల్ల చర్మంపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా చర్మం నుంచి దుర్వాసన వస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు చేయాల్సినవి... మీ చర్మంపైన ఎక్కువ చెమట పట్టే బాహుమూలాల వంటి ప్రదేశాల్లో కొద్దిపాటి సువాసన ఉండే యాంటీబ్యాక్టీరియల్ మెడికేటెడ్ సబ్బుతో రోజుకు మూడు సార్లు శుభ్రపరచుకోండి. ఆ ప్రాంతాలలో రోజూ టాల్కమ్ పౌడర్‌ను చల్లుకోండి. రోజూ ఉదయం పూట అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్ ఉండే లోషన్‌ను ఒంటిపై రాసుకోండి. ఇది మిమ్మల్ని మరింత సేపు ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. అప్పటికీ మీ ఒంటి దుర్వాసన తగ్గకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.