మగాడి చూపులు అంతే!
మహిళలు అసభ్యంగా దుస్తులు వేసుకుంటేనే వాళ్లను మగాళ్లు ఏడిపిస్తుంటారని, తేరిపార చూస్తారని ఇన్నాళ్లూ అందరూ చెబుతూ వచ్చారు. కానీ, అదంతా తప్పని ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తేల్చిపారేసింది. ఆడవాళ్లు వేసుకునే దుస్తులతో ఏమాత్రం సంబంధం లేదని, మగాడి చూపులు ఎప్పుడూ అలాగే ఉంటాయని స్పష్టం చేసింది. ఇందుకోసం ఆమె ఒక ఫొటోను కూడా ట్వీట్ చేసింది.
బురఖాలు వేసుకుని వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను.. ఆ పక్కనే బైకు మీద ఉన్న ఇద్దరు అబ్బాయిలు కళ్లు పెద్దవి చేసుకుని చూడటం ఆ ఫొటోలో స్పష్టంగా ఉంది. దాన్ని బట్టి చూస్తే.. అమ్మాయిల వస్త్రధారణకు, అబ్బాయిల ప్రవర్తనకు ఏమాత్రం సంబధం లేదని, వాళ్లు తమ బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంటారని అన్నట్లుగా రేణు దేశాయ్ చెప్పింది.
It's never about her clothes!It's always the eyes of the man! Always! pic.twitter.com/GPPhVmThzp
— renu (@renuudesai) December 26, 2015