breaking news
ramakantha reddy
-
రెండు పంచాయతీలకు 18న ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఖాళీగా ఉన్న రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. రిజర్వేషన్ల వర్తింపులో అక్రమాలు జరిగాయని ఎన్నికలు బహిష్కరించిన నవాబ్‌పేట మండలం మమ్మదాన్‌పల్లి సహా సర్పంచ్ మరణంతో ఖాళీ అయిన పరిగి మండలం రూప్ఖాన్పేట పంచాయతీలకు ఈ నెల 18న ఎన్నికలు జరుగుతాయని ఎస్ఈసీ కమిషనర్ రమాకాంతరెడ్డి తెలిపారు. వీటితో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న 31 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల మూడో తేదీ నుంచి 6వ తేదీ వరకు కొనసాగుతుందని, ఏడో తేదీన నామినేషన్ల పరిశీలన, 8న ఆర్డీవో స్థాయిలో అభ్యంతరాలపై అప్పీళ్లు, 9న వాటి పరిష్కారంపై విచారణ, 10న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ అని రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. 18న ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్, ఆ తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. -
‘రచ్చ’బండ
పెద్దకడబూరు, న్యూస్‌లైన్ : పెద్దకడబూరులో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ..రచ్చగా మారింది. గ్రామాల నుంచి వచ్చిన వారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా సభాప్రాంగణంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడం.. కార్యక్రమ రూపకర్త అయిన ైవె ఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహించారు. ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. రచ్చబండ ద్వారా 1265 రేషన్‌కార్డులు, 1349 పక్కాగృహాలు, 246 పింఛన్లు, 89 బంగారుతల్లి, 696 విద్యుత్ మీటర్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆయా గ్రామాల నుంచి 3645 మంది లబ్ధిదారులతో పాటు కొత్తగా దర ఖాస్తులు ఇచ్చేందుకు మరో వెయ్యి మంది రచ్చబండకు హాజరయ్యారు. అయితే అధికారులు 200 మందికి మాత్రమే ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వచ్చిన ప్రజలు వేదిక ఎదుట గుమిగూడడంతో గందోరగోళ పరిస్థితి నెలకొంది. రచ్చబండ పోస్టర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం లేకపోవడం కూడా ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి తన అనుచరులతో ఆందోళనకు దిగారు. దానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి అడ్డు చెప్పడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల ప్రత్యేక అధికారి లక్ష్మా విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో వైఎస్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం కొనసాగించారు. అధికారపక్ష నేతలు రవిచంద్రారెడ్డి, తిక్కన్న, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి వ్యక్తిగత ప్రసంగాలతో ఒకరినొకరు దూసించుకున్నారు. ఒక్కసారిగా ఇరువర్గాల అనుచరులు వేదికపైకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుర్చీలను విరగొట్టారు. ఎస్ఐ తిమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాల వారినీ చెదరగొట్టారు. అయితే వందలాది రూపాయలు ఖర్చు చేసుకుని వస్తే కాంగ్రెస్ నేతల నిర్వాహకంతో నోట్లో మట్టిపడిందని వృద్దులు, వికలాంగులు, వితంతువులు శాపనార్ధలు పెట్టారు.