breaking news
quarry lands
-
ఈత రాకున్నా.. ప్రాణాలకు తెగించి..
సాక్షి, కుత్బుల్లాపూర్ : క్వారీ గుంతలో పడ్డ చిన్నారిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈత రాకున్నా బాలుడిని రక్షించాలన్న ఉద్దేశంతో సాహసం చేసి అందరి మన్నన్నలు పొందాడు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పేట్‌బషీరాబాద్ రంగారెడ్డిబండ సమీపంలో క్యారీ గుంత ఉంది. ఇందులో వర్షపునీరు చేరడంతో సరదాగా పిల్లలంతా నీటి పక్కన ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో మహేశ్, అంజమ్మల కుమారుడు వంశీ(4) ఒక్కసారిగా నీటిలో పడి మునిగిపోయాడు. అక్కడే మరో వ్యక్తి అంజి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గమనిస్తున్న సంజీవ్ క్వారీగుంతలోకి ఒక్క ఉదుటున దూకీ బాలుడిని పైకి తీసుకు వచ్చాడు. అప్పటికే పూర్తిగా నీళ్లు తాగిన ఆ బాలుడు అచేతన స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు బాలుడి కడుపు, ఛాతిపై ఒత్తడంతో నీళ్లు బయటకు కక్కాడు. చిన్నారి సాధారణ స్థితిని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
నూజివీడులో ఉద్రిక్తత ..144 సెక్షన్
కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక రఘునాథస్వామి ఆలయ క్వారీ భూములకు ఈ రోజు దేవాదయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఈ వేలాన్ని అడ్డుకోవడానికి యత్నించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేలాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పి నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. ప్రస్తుతం పట్టణంలో 144 సెక్షన్‌ను విధించి 30 మంది సీపీఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు.