నూజివీడులో ఉద్రిక్తత ..144 సెక్షన్ | Tension in Nuzvid | Sakshi
Sakshi News home page

నూజివీడులో ఉద్రిక్తత ..144 సెక్షన్

Sep 30 2016 2:22 PM | Updated on Sep 4 2017 3:39 PM

కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక రఘునాథస్వామి ఆలయ క్వారీ భూములకు ఈ రోజు దేవాదయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఈ వేలాన్ని అడ్డుకోవడానికి యత్నించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేలాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పి నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. ప్రస్తుతం పట్టణంలో 144 సెక్షన్‌ను విధించి 30 మంది సీపీఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement