breaking news
putalapattu mla
-
ఎమ్మెల్యేనైన నా ఓటే తొలగిస్తారా!
సాక్షి, యాదమరి(చిత్తూరు జిల్లా): ఎమ్మెల్యే ఓటే తొల గించాలని దరఖాస్తు వస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ బుధవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఐటీ కంపెనీల ద్వారా సామాన్య ఓటర్లవే కాక, నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటు కూడా తీసేయాలని దరఖాస్తు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నియోజక వర్గంలోని ఐరాల మండలం పైపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ సునీల్‌కుమార్ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో వేల కొద్దీ ఫారం–7 దరఖాస్తులు రావడంతో ఎమ్మెల్యే ధర్నాలు చేశారు, కానీ చివరకు ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు రావడంతో ఆయన అవాక్కయ్యారు. అధికారులు పరిశీలించి ఫారం–7ను తిరస్కరించారు. ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు చేసిన వ్యక్తిని బుధవారం ఎన్నికల అధికారులు, పోలీసులు విచారించారు. చివరకు అతను ‘‘నేను వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్‌ను. నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దరఖాస్తు చేయలేదు’’ అని చెప్పారు. దీనిపై అధికారులు పోలీసులు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టిన వారి ఐపీ అడ్రస్ ఆధారంగా పరిశీలిస్తున్నారు. -
పూతలపట్టు ఎమ్మెల్యేకు వైఎస్. జగన్ ఫోన్
పూతలపట్టు: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌తో శుక్రవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఫోన్లో మాట్లాడారు. సునీల్‌కుమార్‌పై నమోదైన పోలీసు కేసుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. పోలీసు కేసు నమోదు కావడానికి యాదమరి మండలం మోర్థానిపల్లె సబ్‌స్టేషన్‌లో ఏం జరిగిందని సునీల్‌ను అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నాయకులు అనవసరంగా పెడుతున్న కేసులకు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకుల సహకారం తీసుకుని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిం చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేసు నమోదు చేసిన ట్రాన్స్‌కో అధికారులపై తగు చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.