breaking news
Publishing companies
-
ఫేస్బుక్ మరో ఆవిష్కారం
న్యూయార్క్ : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోకొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఫేస్బుక్ యాప్‌లో ప్రత్యేక వార్తా విభాగాన్ని ప్రవేశపెట్టింది. 'న్యూస్ ట్యాబ్' పేరుతో సరికొత్త ఫీచరును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా తన ప్లాట్‌ఫాంలో ఫేక్‌న్యూస్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది. కొంతకాలంగా ప్రయోగదశలో పరిశీలించిన ఈ ఫీచర్‌ను శుక్రవారం అమెరికాలో మాత్రమే అందుబాటుకి తెచ్చింది. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. న్యూయార్క్‌లో పాలే సెంటర్ ఫర్ మీడియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మాట్టాడుతూ, తొలిసారిగా తమ యాప్‌లో ప్రదర్శించే వార్తలకుగాను పబ్లిషింగ్ కంపెనీలకు కొంత సొమ్మును చెల్లించనున్నామని తెలిపారు. అయిత ఫేస్బుక్లో తమ వార్తలకోసం ఆయా పబ్లిషర్లు యాప్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందని పేర్కొన్నారు. ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ, జనరల్ న్యూస్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన వార్తలు ఫేస్బుక్ యూజర్లకు అందుబాటులో వుంటాయి. ప్రధానంగా వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఎన్బీసీ న్యూస్ , ఏబీసీ న్యూస్ తోపాటు, చికాగో ట్రిబ్యూన్ డల్లాస్ మార్నింగ్ న్యూస్ స్థానిక అవుట్లెట్లతో సహా సుమారు 200 మంది ప్రచురణకర్తల వార్తలు, విశేషాలు ఫేస్బుక్లో చదువు కోవచ్చు. ఈ ఫీచర్‌ను తీసుకురావడానికి, అసలైన రిపోర్టింగ్ ప్రాముఖ్యతను గుర్తించడానికి చాలా కష్టపడ్డామని ఫేస్బుక్ వార్తా భాగస్వామ్యాన్ని పర్యవేక్షించే కాంప్‌బెల్ బ్రౌన్ చెప్పారు. ఫేస్బుక్ వినియోగదారుడు ఎవరైనా సరే సంబంధిత వార్తను చదవాలంటే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫేస్బుక్ నుంచి లింక్ నేరుగా పబ్లికేషన్ కు రీ-డైరెక్ట్ అవుతుంది. పాత్రికేయ వృత్తికి మార్క్ జుకర్‌బర్గ్ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు జుకర్‌బర్గ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. -
పాత్రికేయ మార్గదర్శకుడు డీఏ
కళ, సాహిత్య రంగాల్లో ప్రసిద్ధి చెందిన తెనాలిలో కొంతకాలం పత్రికల శకం నడిచింది. విజయవాడకు ముందే ఇక్కడ ప్రచురణ సంస్థలు ఆవిర్భవించి రకరకాల దిన, పక్ష, మాసపత్రికలు వెలువరించాయి. స్థానిక పత్రికల్లో పనిచేయకున్నా, ఇక్కడి సాహిత్య వాతావరణంతో రచనా వ్యాసంగంపై ఆసక్తి ఏర్పరచుకున్న డి.ఆంజనేయులు పాత్రికేయ వృత్తిలో స్థిరపడి విమర్శకుడిగా, రచయితగా వెల కట్టలేని కృషిచేశారు. జాతీయస్థాయిలో గుర్తింపును సాధించారు. డీఏగా పాత్రికేయ రంగానికి సుపరిచి తుడయిన ధూళిపూడి ఆంజనేయులు తెనాలి సమీ పంలోని యలవర్రులో 1924, జనవరి 10న జన్మించారు. తురుమెళ్లలోని జార్జి కారొనేషన్ హైస్కూ లులో పాఠశాల విద్య, గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తిచేసి చెన్నైలో బీఎల్ చేశారు. న్యాయవిద్యను అభ్యసించినా, చిత్రంగా పత్రికారంగంలోకి ప్రవేశించారు. సుప్రసిద్ధ పత్రికా సంపాద కుడు కోటంరాజు రామారావు దగ్గర అసిస్టెంటుగా చేరి, పత్రికా రచనలో శిక్షణ పొందారు.1948లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన ఆంజనేయులు ఖాసా సుబ్బా రావు పత్రిక ‘స్వతంత్ర’కు తరచుగా వ్యాసాలు పంపుతూ వచ్చారు. 1953లో హిందూ దిన పత్రికకు మారి, చెన్నైలోనే ఆ పత్రిక సబ్ ఎడిటర్‌గా మరో అయిదేళ్లు పనిచేశాక, ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించారు. 1959-70 వరకు ఇంగ్లిష్ పక్షపత్రిక ‘వాణి’ ఎడిటర్ ఇన్చార్జి హోదాలో ఉన్నారు. 1971-72, 1974-75లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (హైదరాబాద్)లో సమాచార అధికారిగా ఉన్నారు. మధ్యలో ఢిల్లీలో ఇండియన్ అండ్ ఫారిన్ రివ్యూ పత్రిక ఎడిటర్ ఇన్చార్జి (1973)గా చేశారు. 1975-76లో ఆలిండియా రేడియోలో సీనియర్ కరస్పాండెంట్‌గా, చెన్నైలో భారత ప్రభుత్వం వారి డెరైక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీలో ప్రాంతీయ అధికా రిగా వ్యవహరించారు. 1979-81లో ‘మద్రాస్ టెలి విజన్ సెంటర్’లో న్యూస్ ఎడిటర్‌గా, 1981లో ఇం గ్లిష్ త్రైమాసిక పత్రిక ‘త్రివేణి’కి సహ సంపాదకు లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1991 వరకు అంటే పదేళ్లపాటు ‘ది హిందూ’లో కంట్రి బ్యూటింగ్ కాలమిస్టుగా ‘బిట్వీన్ యూ అండ్ మీ’ అనే శీర్షికతో ఆంజనేయులు మద్రాస్ నగ రైంపై జనరంజక వ్యాసాలు రాశారు. ఇం డియన్ రివ్యూ క్వెస్ట్, థాట్, ఇండియన్ లిటరేచర్, ఇండియన్ బుక్ క్రానికల్, ఇం డియన్ రివ్యూ ఆఫ్ బుక్స్, భవాన్స్ జర్న ల్, ఇండియన్ రైటింగ్ టుడే, యువభా రతి, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ హెరాల్డ్, న్యూ స్వతంత్ర టైమ్స్ వంటి పత్రికలకు వందలాది వ్యాసాలు రాశారు. ఆంజనేయులు ఇంగ్లి ష్లో రాసే వ్యాసాలు అద్భుతమని కళావిమర్శకుడు సంజీవదేవ్ మెచ్చుకున్నారు. ఆంజనేయులు పలు పుస్తకాలను రాశారు. ఇత రులు రచించిన తెలుగు గ్రంథాలను ఆయన ఇంగ్లి ష్లోకి అనువదించారు. సోవియట్ యూనియన్, యూరోప్ దేశాల పర్యటన తర్వాత ‘విండో టు ది వెస్ట్’ అన్న యాత్రాగ్రంథాన్ని ప్రచురించారు. ‘కందుకూరి వీరేశలింగం’, ‘బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ సిరీస్, ‘ది ఆర్ట్ ఆఫ్ బయోగ్రఫీ’, ‘గ్లిం ప్సెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్, ’గాంధీ చక్క అండ్ విష్ణుచక్ర’ వంటివి మరికొన్ని రచనలున్నాయి. ఆయనకు సొంత గ్రంథాలయం ఉండేది. ఇంగ్లిష్, తెలుగు సాహిత్యాలపై వెలువడిన గ్రంథాలు దాదా పు ఆయన గ్రంథాలయంలో ఉండేవి. ఆయన మద్రాస్ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు.. పాత్రికేయుడిగా, విమర్శకుడిగా, రచయితగా నాలుగున్నర దశాబ్దాల కృషికి గుర్తింపుగా ఆయన్ను అనేక గౌరవాలు వరించాయి. అమెరికాలోని విస్కా న్సిన్ యూనివర్సిటీ 1993లో గౌరవ డాక్టరేట్ ప్రదా నం చేసింది. మద్రాస్ యూనివర్సిటీ 1995లో డీలి ట్‌తో గౌరవించింది. 1990లో యునెటైడ్ రైటర్స్ అసోసియేషన్ ఉత్తమ జర్నలిస్టు అవార్డుతో సత్క రించింది. తన మేధస్సు, నిబద్ధతతో జాతీయ గుర్తింపు పొందిన ఆంజనేయులు 1998 డిసెంబర్ 27న చెన్నైలోనే కన్నుమూశారు. ఆయన భార్య ఆది లక్ష్మి లెనిన్గ్రాడ్ యూనివర్సిటీ (యూఎస్ఎస్ఆర్) లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. వీరి కుమార్తె శాంతిశ్రీ అధ్యాపకురాలు. డీఏ వ్యాసాలన్నింటినీ సేకరించి పుస్తక రూపంలోకి తీసుకొచ్చే ఆమె ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుందాం. (నేడు డి.ఆంజనేయులు 91వ జయంతి) బి.ఎల్.నారాయణ సీనియర్ జర్నలిస్టు, తెనాలి