breaking news
Prove
-
ప్రేమ ఎంత గరళం!
ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా.. పండెననుకో ఈ బతుకే మనసు తీరా.. అన్నాడొక కవి. ఆ కుర్రాడు కూడా ప్రేమించాడు. ప్రేమను పండించు కోవాలనుకున్నాడు. శాశ్వతంగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. అదే నేరమైంది. గరళమైంది. ఇరవయ్యేళ్లకే నూరేళ్లు నింపింది. గులాబీలు ఇచ్చిన చేతులతోనే గటగట గరళం తాగాడు. ప్రేమను నిరూపించుకోవాలనే పెద్దల శాసనం.. అతనికి మృత్యు శాసనమయ్యింది.ఇరవయ్యేళ్లకే నూరేళ్లుఇది సినిమా కథ కాదు.. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో జరిగిన ఒక హృదయాన్ని మెలిపెట్టే విషాదం. కృష్ణకుమార్ పాండో (20).. సోనారి గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వారిద్దరి గాఢమైన ప్రేమబంధం అమ్మాయి కుటుంబానికి తెలిసిపోయింది. ఆ రోజు సెప్టెంబర్ 25.. ఆ యువతి కుటుంబం కృష్ణను తమ ఇంటికి పిలిపించింది. తన ప్రేయసి కుటుంబం ముందు కృష్ణ ధైర్యంగా నిలబడ్డాడు. అతని ధైర్యమల్లా.. ఆ క్షణంలో తన గుండె నిండా ఉన్న నిస్వార్థమైన, నిండైన ప్రేమే. కానీ ఆ కుటుంబం అతని ప్రేమను నమ్మడానికి ఒక అగ్నిపరీక్ష పెట్టింది. కాదుకాదు బలిపీఠం ఎక్కించింది.విషం తాగి నిరూపించుకో..‘నీ ప్రేమ నిజమే అయితే విషం తాగి నిరూపించుకో’.. అన్న పెద్దల మాటలు అతని చెవుల్లో ఎలా ఉరిమి ఉంటాయో ఊహించండి. ప్రేమ కోసం ఏదైనా చేస్తాననే యువకుడి ఆరాటాన్ని ఆ కుటుంబం దారుణంగా ఉపయోగించుకుంది. బహుశా ఆ క్షణంలో అతనికి తన జీవితం కంటే, తన ప్రేమ నిజమని రుజువు చేయడమే ముఖ్యం అనిపించిందేమో. వెనకా ముందూ ఆలోచించలేదు.. కృష్ణకుమార్ విషం తాగేశాడు. విషం.. అతని శరీరంలోకి ప్రవహించింది. ప్రతి కణాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది.నరకయాతన అనుభవించి..ఆ తరువాత, జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు కృష్ణను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి జిల్లా ఆసుపత్రికి మార్చినా, అతని పరిస్థితి విషమంగానే ఉంది. అతని గుండె, ఊపిరితిత్తులు ఆ విష ప్రభావానికి లొంగిపోతుంటే, చివరి క్షణాల్లో ఏం గుర్తుకొచ్చిందో.. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ముఖమా.. లేదా తన ప్రేమను బలిపీఠం ఎక్కించిన పెద్దల పైశాచిక వ్యాఖ్యలా.. చివరికి అక్టోబర్ 8న మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. కృష్ణ కుటుంబ సభ్యులు.. అమ్మాయి తరఫు వారు బలవంతం చేయడమో, లేదా ప్రేరేపించడమో వల్లే తమ కుమారుడు విషం తాగాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమంటే పవిత్రత, త్యాగం.. కానీ దాన్ని ఇంతటి భయంకరమైన పరీక్షతో నిరూపించుకోవాలని పెద్దలు కోరడం, దానికి అమాయకపు యువకుడు బలైపోవడం.. నిజంగా ఇది గుండెల్ని పిండేసే విషాదం. -
మరోసారి బయటపడ్డ టీడీపీ నీచ రాజకీయం..
-
మురుగునీటిలోనూ కరోనా వైరస్
యశవంతపుర: కరోనా సోకిన బాధితుడు తుమ్మడం, దగ్గడం వల్ల వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందని ఇప్పటిదాకా తెలుసు. కానీ, మురుగునీటి వల్ల కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని కర్ణాటకలోని ప్రముఖ పర్యావరణవేత్త యల్లప్పరెడ్డి చెప్పారు. బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్తలు నిర్మలగౌడ, డాక్టర్ నిధి పలివాల్ తదితరులతో కలిసి ఆయన నగరంలో పరిశోధనలు చేశారు. మురుగునీటిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులోని మురుగునీరు వృషభారతి, అర్కావతి నదుల్లో కలుస్తోంది. పాదరాయనపుర, బాపూజీనగర వార్డులో ఎక్కువ మంది కరోనా రోగులున్నారు. ఇక్కడి డ్రైనేజీ నీరు నేరుగా వృషభావతి నదిలోకి వెళ్తోంది. కరోనా బాధితుల నుంచి వైరస్ తొలుత మురుగు నీటి, అక్కడి నుంచి నదిలో చేరుతోందని యల్లప్పరెడ్డి పేర్కొన్నారు. -
ఫలించని పన్నీర్ సెల్వం తిరుగుబాటు
-
నిర్భయ కేసులో 'ఐరన్ రాడ్ థియరీ' నిరూపిస్తే 10 లక్షలిస్తా..!!
న్యూఢిల్లీః నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో ఢిఫెన్స్ లాయర్ కొత్త వాదనకు తెరతీశారు. నిర్భయ కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ సంచలన ప్రకటన చేశారు. కేసులో ఐరన్ రాడ్ థియరీని నిరూపిస్తే 10 లక్షలిస్తానంటూ బహుమతిని ప్రకటించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను దించి, అవయవాలను బయటకు లాగారన్న పోలీసుల వాదదను ఆయన కొట్టిపారేశారు. అదో కట్టు కథ అని, అది నిరూపిస్తే పదిలక్షలు ఇస్తానంటూ న్యాయవాది శర్మ ప్రకటించడం.. కేసు మరో ట్విస్ట్ గా మారింది. 2012 లో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రపంచదేశాలను కుదిపేసిన నిర్భయ ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సుప్రీంలో చివరి దశలో ఉండగా... విచారణలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కదులుతున్న బస్సులోనే 23 ఏళ్ళ ట్రైనీ ఫిజియోథెరపిస్ట్.. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను గుచ్చి, అవయవాలను బయటకు లాగారని, తీవ్రమైన గాయాలు అవ్వడంతోనే అనంతరం ఆమె మరణించినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే దీనిపై విచారణ పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు నిందితులకు మరణశిక్ష విధించగా, ఢిల్లీ హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది. దీంతో దోషులు సుప్రీంను ఆశ్రయించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ అనే వ్యక్తి తీహార్ జైల్లో మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరొక నిందితుడు.. జువైనల్ కావడంతో మూడేళ్ల పాటు రిఫామ్ హోమ్ లో ఉంచి, అనంతరం విడుదల చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు కేసుపై విచారణ జరిగిన అనంతరం.. దోషుల తరపు న్యాయవాది కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టులో దోషుల తరపున వాదించిన అనంతరం బయటకు వచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ.. ఇనుప రాడ్ థియరీని నిరూపించినవారికి 10 లక్షల బహుమానం ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. బాధితురాలు అత్యాచారం అనంతరం ఆసుపత్రిలో పూర్తి స్పృహలో ఉండగానే వాంగ్మూలం ఇచ్చిందని... ఆమె గానీ, ఆమె స్నేహితుడుగానీ ఇనుపరాడ్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. పోలీసులే ఈ కట్టుకథను అల్లినట్లుగా ఆయన ఆరోపించారు. బాధితురాలు చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి ఇచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం బాధితురాలి యుటెరస్ గానీ, ఓవరీస్ గానీ డ్యామేజ్ అయినట్లు ఎక్కడా లేదని న్యాయవాది శర్మ వాదిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుపరాడ్ ప్రస్తావన లేకున్నా.. పోలీసుల వాదన ఎలా చేరుస్తారని శర్మ ప్రశ్నించారు. నిర్భయ కేసు నిందితుల్లో ముఖేశ్, పవన్ ల తరపున శర్మ.. సుప్రీంలో వాదనలు వినిపించారు. -
ఆ.. పేరుతో అన్నీ తంటాలే...
లండన్ మహిళకు ఫేస్ బుక్ కొత్త సమస్య తెచ్చిపెట్టింది. ఆమె పేరు విషయంలో ఫేస్ బుక్ అభ్యంతరాలు తెలిపినవార్త.. ఇప్పుడు స్థానికంగా సంచలనమైంది. ఆమెకు పెద్దలు శాస్త్రోక్తంగా పెట్టిన పేరు ఐసిస్ థామస్ (Isis Thomas) కావడం ఇప్పుడామెకు సమస్యగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ భూతం.. ఇప్పుడు ఆమె పేరునే మార్చుకోవాల్సిన పరిస్థితులను కల్పించింది. బ్రిటన్ కు చెందిన 27 ఏళ్ళ ఐసిస్ థామస్ కు కొత్త అనుభవం ఎదురైంది. సామాజిక దిగ్గజం ఫేస్ బుక్ లో తన ఖాతాను తెరిచేందుకు ప్రయత్నించిన ఐసిస్ థామస్ కు అభ్యంతరం తెలపడంతో షాక్ కు గురైంది. ఫేస్ బుక్ లో ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఎటువంటి వివరాలనైనా, పేర్లనైనా అనుమతించే అవకాశం లేకపోవడంతో ఐసిస్ థామస్ పేరు గుర్తింపునకు సంబంధించిన పూర్తి ఆధారాలు పంపించమని అడగడం పెద్ద వార్తే అయ్యింది. బ్రిటన్ బ్రిస్టల్ వాస్తవ్యురాలైన ఐసిస్ థామస్.. ఫేస్ బుక్ లో ఖాతాను తెరిచేందుకు జూన్ 27న లాగిన్ అవ్వగా.. ఆమెకు పేరు సమస్య వచ్చినట్లు తెలిపింది. ఆమె అసలు పేరు ఐసిస్ థామస్ కాగా... మొదట తాను పనిచేసిన నగరానికి చెందిన పేరును కలిపి.. ఐసిస్ వోర్సెస్టర్ గా ఫేస్ బుక్ లో నమోదు చేసింది. అనంతరం పాస్ వర్డ్ కోసం ప్రయత్నించినప్పుడు ఫేస్ బుక్ అభ్యంతరం తెలపడంతో, తిరిగి మరోసారి వోర్సెస్టర్ పేరును తొలగించి ఐసిస్ థామస్ గా నమోదు చేసింది. అయినప్పటికీ అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతోపాటు, కంప్యూటర్ స్క్రీన్ పై వచ్చిన సందేశాన్నిచూసి బిత్తరపోయింది. అసలు సమస్య ఐసిస్ తోనే వస్తోందని చివరికి తెలుసుకుంది. ఐసిస్ అనే పేరును అనుమతించేది లేదని, అది వారి పాలసీలకు విరుద్ధమని ఫేస్ బుక్ తన సందేశంలో తెలిపింది. ఆమె పేరులోని ఐసిస్ కు సంబంధించిన గుర్తింపు ఆధారాలను సమర్పించాలని కోరినట్లు కూడ థామస్ వెల్లడించింది. ఐసిస్ అనేది ఈజిప్టుకు చెందిన ఓ దేవత పేరు అని, ఎట్టిపరిస్థితుల్లోనూ తన పేరును మార్చుకోవడం కుదరదంటున్న ఆమె... తనకు ఆ సామాజిక మాధ్యమంలో ప్రవేశించే అవకాశం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. పేరుపై వచ్చిన అభ్యంతరాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది. ఇలా కొందరు సామాన్య ప్రజలేకాక కొన్ని సంస్థలు సైతం ఐసిస్ పేరుతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన సుమారు 7 కోట్ల టర్నోవర్ కలిగిన ఐసిస్ ఫార్మాసూటికల్ కంపెనీకి సైతం ఇదే సమస్య ఎదురైంది. దీంతో 2015 లో సదరు కంపెనీ ఐసిస్ ఫార్మా నుంచి, లోనిస్ ఫార్మాగా మార్చుకుంది. అలాగే అమెరికాలో 35 ఏళ్ళ అనుభవం ఉన్న ఓ పుస్తకాల వ్యాపారి కూడ తన ఐసిస్ బుక్స్ అండ్ గిఫ్ట్ షాప్ పేరు మార్చుకోవాల్సి వచ్చింది.


