breaking news
protests rised
-
ఢిల్లీలో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్ చేపట్టిన పోటీపోటీ నిరసనలతో శుక్రవారం సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. రెండు పార్టీల శ్రేణులు నేరుగా తలపడే పరిస్థితిని నివారించేందుకు పోలీసులు పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. దేశ రాజధాని వ్యాప్తంగా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. పండిట్ దీన్ దయాళ్ మార్గ్(డీడీయూ)వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా నిరసన తెలపాలని నిర్ణయించింది. అదేసమయంలో, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని కాషాయ పార్టీ తీర్మానించుకుంది. ఆ మేరకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు వారిని 800 మీటర్ల దూరంలో ఆపేశారు. రోడ్డుపై పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించి పరస్పరం తలపడే పరిస్థితిని నివారించారు. రెండు పార్టీల నాయకులు అక్కడే ధర్నా చేపట్టారు. ఈడీ సమన్లకు అయిదోసారీ డుమ్మా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించేందుకు ఈడీ బుధవారం ఐదోసారి పంపిన సమన్లనూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పట్టించుకోలేదు. శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టారు. -
పాకిస్థాన్ కు భారీ షాక్.. భారత్ వైపు POK చూపు
-
అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత
మిన్నెసోటా: అమెరికా లూసియానా రాష్ట్రంలోని మిన్నెసోటాలో నల్లజాతీయుడిని పోలీసు అధికారి కాల్చిచంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం కూడా ఇలాంటి ఘటనలోనే బాటన్ రోగ్ నగరంలో ఓ పోలీసు అధికారి ఆల్టన్ స్టెర్లింగ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. కారులో వెళుతున్న ఫిలాండో కాసిల్ (32) అనే వ్యక్తి వద్ద తుపాకి ఉండటాన్ని చూసిన అధికారి అతని వైపు తన గన్ చూపించారు. దీంతో కారును ఆపిన కాసిల్.. తన గన్ లైసెన్స్ చూపడానికి వెళ్తుండగా పోలీసు అధికారి షూట్ చేసి చంపాడని అతనితో పాటు కారులో ఉన్న ప్రేయసి డైమండ్ రెనాల్డ్స్ ఘటన సమయంలో తీసిన లైవ్ వీడియోలో పేర్కొంది. అధికారి వద్దకు వెళ్లేముందు తన వద్ద గన్ లైసెన్స్ ఉందని కాసిల్ చెప్పాడని ఆమె వీడియోలో చెప్పింది. కాగా, కాసిల్ ను నాలుగు సార్లు కాల్చారు. ‘‘సార్, వెపన్ లైసెన్స్ ను చూపడానికి అతను వస్తున్నాడు’’ అని ఆమె పెద్దగా కేకలు వేయడం కూడా వీడియోలో రికార్డయింది. దీంతో వందలమంది ప్రజలు ఆస్టన్, కాసిల్ లు మరణించిన ప్రదేశాలకు తరలివెళ్లి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం వెలుగులోకి వచ్చిన మరో వీడియోలో ఆస్టన్, ఇద్దరు పోలీసు అధికారులకు చిన్న వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్టన్ ను కిందపడేసిన ఇద్దరు అధికారులు పలుమార్లు షూట్ చేసినట్లు కనిపిస్తోంది. అధికారులు పిలిచినప్పుడు వ్యక్తి వారిని బెదిరించలేదని, కానీ వారు అతనిపై దారుణంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బాధితుడికి న్యాయం జరగాలని పోరాడుతున్నట్లు చెప్పారు. మరణించిన వ్యక్తికి ఐదుగురు బిడ్డలు ఉన్నారని, వారి గతేం కావాలి.. ఇది కేవలం ఒక్కరికి సంబంధించిన విషయం కాదని నిరసనకారులు అన్నారు. కాగా, ఘటనపై అమెరికా న్యాయశాఖ విచారణకు ఆదేశించింది.