breaking news
property tax hike
-
గ్రామాల్లో ఆస్తి పన్ను ఏటా 5 శాతం పెంపు జీవో బాబు సర్కారుదే
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను (ఇంటి పన్ను) ఏటా ఐదు శాతం చొప్పున పెంచాలని 2002లో చంద్రబాబు సర్కారు జీవో 98 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ప్రకారం అధికారుల స్థాయిలోనే గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏటా ఇంటి పన్ను పెంచుకుంటూ వెళ్లింది. ఐదేళ్లలో పెంచిన ఇంటి పన్నుల భారం రూ.266 కోట్లు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు సర్కారు తెచ్చిన జీవో ప్రకారమే ఈ ఏడాది కూడా గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తున్నా రాజకీయ విమర్శలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేదో ప్రజలపై కొత్తగా పన్ను భారం మోపుతున్నట్లు అపోహలు సృష్టించేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తున్నాయి. ఐదేళ్లలో మూడు రెట్లు పెరుగుదల... 2013–14లో ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మొత్తం గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు లక్ష్యం రూ.157.96 కోట్లు కాగా 2018–19 నాటికి రూ.423.69 కోట్లకు చేరుకుంది. అంటే ఐదేళ్లలో ఇంటి పన్ను లక్ష్యం దాదాపు మూడు రెట్లు పెరిగింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే కూడా అధికంగా గత సర్కారు ఇంటి పన్ను భారం మోపింది. చదవండి: విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి నాటి జీవో ప్రకారమే.. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇంటి విలువపై రూ.వందకు 12 పైసల నుంచి ఒక్క రూపాయి మధ్య ఇంటి పన్నును సంబంధిత గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకొని నిర్ధారించుకోవచ్చు. 2000–2001లో ఇంటి విలువ ఆధారంగా ప్రస్తుతం పన్ను నిర్ధారణ జరుగుతోంది. అప్పుడు నిర్ధారించిన ఇంటి పన్ను ఏటా ఐదు శాతం చొప్పున పెరుగుతోంది. కొత్తగా ఇంటి విలువ నిర్ధారణ జరిగే వరకు 2000–2001 నాటి ఇంటి విలువ ఆధారంగానే పన్ను వసూలు చేయాలని టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో 98లో పేర్కొన్నారు. ఎన్నికల భయంతో ప్రయోగం వాయిదా 2017–18లో పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గత సర్కారు ప్రయోగాత్మకంగా అప్పటి ధరల ప్రకారం ఆస్తి విలువను నిర్ధారించి కొత్తగా ఇంటి పన్ను వసూలు చేసింది. ఈ నిర్ణయంతో ఒక్కో యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్ను ఒకేసారి రెండు రెట్లకు పైగా పెరిగినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో పశ్చిమ గోదావరి తరహాలోనే అప్పటి విలువ ఆధారంగా కొత్తగా ఇంటి పన్ను నిర్ధారణకు నాటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేశ్ కసరత్తు చేపట్టారు. చదవండి: అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇళ్లను కొత్తగా సర్వే చేసి అప్పటి విలువ ప్రకారం లెక్కకట్టి ఆన్లైన్లో నమోదు చేశారు. సర్వే ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటం, అసెంబ్లీ ఎన్నికల భయంతో ఇంటి పన్ను పెంపును గత సర్కారు తాత్కాలికంగా వాయిదా వేసింది. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2019లోనే పంచాయతీల్లో ఇంటి పన్ను రెండు మూడు రెట్లు పెరిగేదని అధికారులు పేర్కొంటున్నారు. 2014–19 గ్రామాల్లో ఇంటి పన్ను పెరిగిన తీరు ఆర్థిక ఏడాది వసూలు లక్ష్యం రూ.కోట్లలో 2013–14 157.96 2014–15 186.33 2015–16 257.95 2016–17 299.60 2017–18 369.40 2018–19 423.69 -
ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు: మంత్రి బొత్స
అమరావతి: ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దళారులు లేకుండా పారదర్శక పన్ను విధానం రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని పన్ను విధానాలనూ పరిశీలించి, అత్యుత్తమ పన్ను విధానాన్నే రాష్ట్రంలో తీసుకొచ్చామని మంత్రి బొత్స పేర్కొన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి అదనంగా రూ.123 కోట్లు కేటాయించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. అంతేకాకుండా ఆస్తి పన్ను పెంపు 15 శాతానికి పరిమితం చేశామని, ఇది చాలా తక్కువ అని ఆయన తెలిపారు. కాగా అమర్ రాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. తప్పు చేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారని తెలిపారు. వాళ్లు వెళ్లిపోవాలని మేము కోరుకోవడం లేదన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జల వివాదంలో తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నట్లు వెల్లడించారు. జల వివాదాన్ని పరిష్కరించు కోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. చట్టం చేసిన రోజే 3 రాజధానులు అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇక రాజధానుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. -
పట్టణాలపై పిడుగు
- మూడు నుంచి నాలుగు రెట్లు పెరగనున్న ఆస్తి పన్ను! - జీహెచ్ఎంసీ సహా 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 35 మున్సిపాలిటీలు, - 2 నగర పంచాయతీల్లో పెంపునకు కసరత్తు - ఏడాది కిందటి ప్రతిపాదనలకు కదలిక - ప్రభుత్వ ఆమోదమే తరువాయి - వార్షిక అద్దె విలువల ఆధారంగా పన్ను గణన - ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్ : పురపాలికలపై పన్ను పిడుగు పడబోతోంది! జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 35 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో త్వరలో ఆస్తి పన్ను పెరగబోతోంది. ప్రస్తుత అద్దెలను పరిగణనలోకి తీసుకుని ఈ పన్నును సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల పెంపు ప్రతిపాదనలు ఏడాదికిపైగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా వీటిపై కదలిక వచ్చింది. ఆస్తిపన్ను పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక శాఖ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. పెంపు ఎప్పట్నుంచి..? రాష్ట్రంలో మొత్తం 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీలు, 25 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 23 కొత్త నగర పంచాయతీలు, 2 కొత్త మున్సిపాలిటీల్లో 2015 ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను పెంపునకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. దీంతో ఆయా చోట్ల ఆస్తి పన్ను మూడు నుంచి ఆరు రెట్లు పెరిగింది. మిగిలిన ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 35 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను పెంపుపై ప్రభుత్వం ఏడాది కాలంగా పరిశీలన జరుపుతోంది. గతేడాది జూలైలోనే పెంచేందుకు ప్రయత్నించినా మున్సిపల్ కార్మికుల సమ్మె, ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చింది. త్వరగా నిర్ణయం తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి అంటే ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఈ పురపాలికల్లో ఆస్తి పన్ను పెంపు అమల్లోకి వచ్చే అవకాశముంది. లేదంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం ఖాయమని అధికారవర్గాలు చెబుతున్నాయి. పురపాలికల్లో గడ్డు పరిస్థితులు.. ఒక్క జీహెచ్ఎంసీ తప్ప రాష్ట్రంలోని మిగిలిన పురపాలికలన్నీ ఆర్థికంగా గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే కొద్దిపాటి గ్రాంట్లతో వాటి అవసరాలు ఏమాత్రం తీరట్లేదు. ఎన్నో ఏళ్లుగా పెంచకపోవడంతో అరకొర ఆస్తి పన్ను వసూళ్ల ద్వారా నామమాత్రపు ఆదాయం వస్తోంది. దీంతో పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నాయి. నీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ బిల్లుల బకాయిలు సైతం రూ.150 కోట్లకు చేరాయి. పట్టణీకరణకు తగ్గ మౌలిక వసతుల కల్పన కూడా సాధ్యం కావడం లేదు. దీంతో ఆస్తి పన్నుల సవరణకు అనుమతించాలని పురపాలక శాఖ ప్రభుత్వాన్ని ఎప్పట్నుంచో కోరుతోంది. శాస్త్రీయ పద్ధతిలో ఆస్తి పన్నుల గణనను ప్రవేశపెడుతూ 1990లో నాటి ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఆ తర్వాత ఆస్తి పన్నుల తొలి సవరణ 1993 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. రెండో సవరణ 2002 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి 13 ఏళ్లు గడిచినా నివాస గృహాలపై ఆస్తి పన్నుల సవరణ జరగలేదు. 2007 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడో సవరణను నివాసేతర కట్టడాలకే పరిమితం చేశారు. వడ్డన భారీగానే.. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే ఆస్తి పన్నుల సవరణకు పురపాలికలు గెజిట్ ప్రకటన జారీ చేస్తాయి. పురపాలికలను కొన్ని భాగాలుగా విభజించి ఆస్తుల గణన చేపడతారు. ఇళ్లు, భవనాల కొలతలు తీసుకుంటారు. భవన వినియోగ స్వభావం (నివాస/నివాసేతర), ఆ ప్రాంత వార్షిక అద్దె విలువల ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయిస్తారు. ప్రజల నుంచి రెండుసార్లు అభ్యంతరాలు స్వీకరించి తర్వాత పన్ను ఖరారు చేస్తారు. ప్రస్తుతం నివాస భవనాలపై 2002, నివాసేతర భవనాలపై 2007 నాటి వార్షిక అద్దె విలువల ఆధారంగా ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. తాజా వార్షిక అద్దెలను పరిగణనలోకి తీసుకుంటే మూడు, నాలుగు రెట్ల వరకు ఆస్తి పన్నులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్తి పన్ను పెరిగే పురపాలికలివే.. మున్సిపల్ కార్పొరేషన్లు(6): గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం మున్సిపాలిటీలు (35): జనగాం, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, ఆదిలాబాద్, భైంసా, బెల్లంపల్లి, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, మందమర్రి, తాండూరు, వికారాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, సంగారెడ్డి, సదాశివపేట, సిద్దిపేట, జహీరాబాద్, మెదక్, దుబ్బాక, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి నగర పంచాయతీలు(2): సత్తుపల్లి, బాదెపల్లి