pro kannada activists
-
కొనసాగుతున్న కర్ణాటక బంద్..
బెంగళూరు: కర్ణాటకలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలు, ప్రైవేటు సర్వీసులు యథాతథంగా నడుస్తున్నాయి. దీంతో, పాక్షికంగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ కొనసాగనుంది.కేఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్‌పై మరాఠీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎంఈఎస్‌ను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ శనివారం కర్ణాటక బంద్‌కు వాటాళ్ నాగరాజ్ నేతృత్వంలో కన్నడ ఒక్కూట్ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, బంద్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు. ఓలా, ఉబర్, డ్రైవర్ల నుంచి కొన్ని ఆటో సంఘాలు బంద్‌కు మద్దతు వ్యక్తం చేశాయి. హోటల్ యజమానుల సంఘం నైతికంగా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ శెట్టి వర్గం బంద్‌కు మద్దతు ప్రకటించింది.Belagavi, Karnataka: Amid the Karnataka bandh, Maharashtra transport buses have stopped entering Karnataka and are operating only up to the border. In Belgaum, security has been tightened as pro-Kannada activists plan to stage protests. Police and Home Guards personnel have been… pic.twitter.com/6eKYLhQR7Z— IANS (@ians_india) March 22, 2025#WATCH | Karnataka: Passengers arrive at a bus terminal in Bengaluru amid pro-Kannada groups' 12-hour statewide bandh in protest against the alleged assault on a bus conductor in Belagavi for not speaking Marathi. pic.twitter.com/rT5yseoLna— ANI (@ANI) March 22, 2025ఇక, అత్యవసర సేవలైన పాలు, ఔషధం, దినపత్రిక, కూరగాయల సరఫరా ఎప్పటిలాగే ఉంటాయి. వాటాళ్ నాగరాజ్ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ దయానందను భేటీ చేసి బంద్‌కు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. అయితే సానుకూల స్పందన రాలేదు. అయినా బంద్ చేసి తీరుతానని వాటాళ్ తెలిపారు. కర్ణాటక బంద్‌కు చలనచిత్ర వాణిజ్య మండలి మద్దతును ప్రకటించింది. అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ బంద్‌కు మద్దతు ఉంటుందని, అయితే సినిమా షూటింగ్ యధా ప్రకారంగా జరుగుతాయన్నారు. థియేటర్ల యజమానులు బంద్‌కు మద్దతు ఇచ్చారు. ఉదయం ప్రదర్శన బంద్ చేస్తామని, మధ్యాహ్నం తరువాత సినిమాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.#WATCH | Karnataka: Several pro-Kannada groups have called a bandh in the state today from 6 am to 6 pm, in protest against the alleged assault on a bus conductor in Belagavi for not speaking Marathi. Visuals from Kalaburagi, where Police personnel have been deployed as a… pic.twitter.com/atR3C3pPxw— ANI (@ANI) March 22, 2025భారీ భద్రత..బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా శనివారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాఠశాల–కాలేజీలకు సెలవు ఇచ్చే విషయం ఎలాంటి తీర్మానం తీసుకోలేదని మంత్రి మధు బంగారప్ప తెలిపారు. రవాణా సదుపాయం లేకపోతే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పరీక్షలు ప్రారంభమైన విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. -
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత.. భారీగా బలగాల మోహరింపు
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. సరిహద్దు ప్రాంతం బెళగావిలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి, ‘కర్ణాటక రక్షణ వేదిక’ ఆధ్వర్వంలో బెళగావిలో ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలే లక్ష్యంగా దాడులు చేపట్టారు ఆందోళనకారులు. ఓ లారీ అద్దలు పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక్కు చెందిన ఆందోళనకారులు సుమారు 400 మంది కర్ణాటక జెండాలు పట్టుకుని ధార్వాడ్ జిల్లా నుంచి బెళగావికి వెళ్లి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర వాహనలపై రాళ్లు రువ్వారు. పుణె నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ లారీ విండ్‌షీల్డ్, అద్దం ధ్వంసమైంది. ఈ క్రమంలో భారీగా బలగాలను మోహరించింది ప్రభుత్వం. అయినప్పటికీ పోలీసుల మాట పట్టించుకోకుండా రోడ్లపై బైఠాయించారు. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామల వద్ద వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. 1960లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు తప్పుగా ఇచ్చారని మహారాష్ట్ర వాదిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లింది మహారాష్ట్ర. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో తమకు చెందిన కొన్ని గ్రామాలు ఉన్నాయని కర్ణాటక ఇటీవల పేర్కొంది. దీంతో వివాదం మరింత ముదిరింది. మహారాష్ట్రకు చెందిన మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్‌లు బెళగావిలో మంగళవారం పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వారి పర్యటన శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం హెచ్చరించటంతో తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. సరిహద్దు వివాదంపై ఈ ఇరువురు మంత్రులను కోఆర్డినేటర్లుగా నియమించింది మహారాష్ట్ర. వారం క్రితం సైతం బెళగావిలో ఓ కళాశాల ఉత్సవాల్లోనూ సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఓ విద్యార్థి కర్ణాటక జెండాను ప్రదర్శించటంతో మరాఠీ విద్యార్థులు అతడిపై దాడి చేశారు. #Maharashtra-#Karnataka border row simmers as protests erupt at the #Belagavi border; security tightened @NehaHebbs reports | #BREAKING_NEWS pic.twitter.com/ohpUguWcif — Mirror Now (@MirrorNow) December 6, 2022 ಸಾವಿರಾರು ಕನ್ನಡಿಗರನ್ನಾ ಪೊಲೀಸರು ವಶಕ್ಕೆ ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾರೆ ~ Police have detained 1000's of Pro Kannada Activists#Belagavi #belagavimarvellous pic.twitter.com/BEK2oTf5H8 — Belagavi_marvellous (@Belagavi_BM) December 6, 2022 ఇదీ చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం..ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
40 వోల్వో బస్సుల దహనం
కావేరీ జలాల వివాదం తీవ్ర ఉద్రిక్తంగా మారుతోంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కేపీఎన్ ట్రావెల్స్ ఇండియా అనే సంస్థకు చెందిన బస్సు డిపో బెంగళూరు డిసౌజా నగర్లో ఉంది. అక్కడ పార్క్ చేసి ఉంచిన దాదాపు 40 వోల్వో బస్సులను ఆందోళనకారులు తగలబెట్టేశారు. అది తమిళులకు చెందిన ట్రావెల్స్ సంస్థ అని గుర్తించిన కన్నడ ఉద్యమకారులు.. వాటి మీద పెట్రోలు చల్లి నిప్పంటించినట్లు తెలుస్తోంది. దాంతో ఒక్కసారిగా మొత్తం 40 బస్సులూ తగలబడిపోయాయి. కర్ణాటకలో.. ముఖ్యంగా రాజధాని బెంగళూరు నగరంలో టీఎన్ అనే అక్షరాలు కనిపిస్తే చాలు.. ఆ వాహనాలను ఎలాగోలా ధ్వంసం చేసేస్తున్నారు. అందులో సాధారణ ప్రయాణికులు ఉన్నా కూడా లెక్క చేయడం లేదు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బెంగళూరులో 144 సెక్షన్ విధించారు, మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. అయ్యంగార్ వర్గం వాళ్లు చాలా కాలం క్రితమే తమిళనాడు నుంచి కర్ణాటకకు వచ్చి స్థిరపడ్డారు.. వీళ్లంతా ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. తమిళులను సులభమైన టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట నిజమే గానీ, నిరసనను శాంతియుతంగా తెలియజేయాలి తప్ప ఇలాంటి ఉద్రిక్తతలకు తావు ఇవ్వొద్దని కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర కోరారు. ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దని కోరారు. మరోవైపు బెంగళూరులో శాంతి భద్రతల పరిస్థితి, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం అవుతోంది. చిక్కుకుపోయిన పిల్లలు పిల్లలు ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్కూలు బస్సులు నడవడం కూడా కష్టమైపోయింది. కన్నడిగులపై తమిళనాడులో దాడులు జరుగుతున్న సమాచారం అందిన మరుక్షణం నుంచి... అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాతి నుంచి బెంగళూరు, మైసూరు సహా కర్ణాటకలోని అన్ని ప్రధాన ప్రాంతాలో విధ్వంసాలు మరింత పెరిగాయి. తమిళనాడులో కన్నడ హోటల్‌పై దాడి జరిగిందన్న విషయం మీడియాలో బయటకు వచ్చిన కొద్ది సేపటికే కేపీఎన్ ట్రావెల్స్ డిపోలో ఉన్న 40 బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. మరోవైపు తమిళనాడు కూడా తగలబడుతోంది. అక్కడ ఉన్న కన్నడిగుల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. మైలాపూర్‌లోని న్యూ ఉడ్‌ల్యాండ్ హోటల్‌పై పెట్రోలు బాంబులతో దాడి జరిగింది. రామేశ్వరంలో కర్ణాటక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు జరిగాయి.