breaking news
the private hospital
-
మంచం పట్టిన కప్పరాళ్లతిప్ప
బిట్రగుంట: కప్పరాళ్లతిప్ప విషజ్వరాలతో మంచం పట్టింది. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే. పాఠశాలకు వెళ్లే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులు, జ్వరాలతో మంచాలకు అతుక్కుపోతున్నారు. తిప్పలో సుమారు 2 వేల మంది జనాభా ఉండగా 600 మం దికి పైగా విషజ్వరాలతో అస్వస్థతకు గురయ్యారు. 10 రోజుల వ్యవధిలో నే సగం గ్రామం జ్వరాల బారిన ప డటంతో ఊరంతా ఆందోళనగా ఉం ది. ఒక్కో ఇంట్లో ఇద్దరు..ముగ్గురు జ్వరపీడితులు ఉన్నారు. ఇప్పటికే పలువురు జ్వర పీడితులు నెల్లూరు, కావలిలోని పలు ప్రైవేట్ వైద్యశాల్లో చికిత్స పొందుతుండగా, మరికొంత మంది అప్పులు చేసి చెన్నైలోని ఆ సుపత్రుల్లో చికిత్స పొందుతున్నా రు. ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రంగా ఉన్న బాధితులు స్థానిక ఆ సుపత్రులపై ఆధారపడుతున్నారు. ైవెద్యారోగ్యశాఖ పట్టించుకోకపోవ డం, కోవూరుపల్లి పీహెచ్సీ సిబ్బం ది పూర్తిబాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో జ్వరాల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతుంది. చికున్ గున్యా, మలేరియా ప్రబలుతున్నా, డెంగీ అనుమానిత కేసులు నమోదవుతున్నా పీహెచ్సీ సిబ్బంది మాత్రం ఇంత వరకూ పరిస్థితి ని చక్కదిద్దే చ ర్యలు చేపట్టలే దు. స్థానికుల ఒత్తిడితో శుక్రవారం నామమాత్రంగా తా త్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేసి మాత్రలు పంపిణీ చేశారు. పరి స్థితి శృతిమించి వందల మంది మం చాన పడిన తరువాత పీహెచ్సీ సి బ్బంది నామమాత్రంగా శిబిరం ఏ ర్పాటు చేయడంపై మండిపడిన స్థా నికులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అధ్వానంగా పారిశుధ్యం విషజ్వరాల విజృంభణకు పారిశుధ్యలోపమే ప్రధాన కారణంగా క నిపిస్తోంది. అంతర్గత రహదారుల్లో ఎక్కడ చూసినా మురుగునీరు మడుగులు కట్టి దోమలకు నిలయంగా ఉంది. డ్రెయిన్స్ లేకపోవడంతో ము రుగునీరంతా రోడ్లపైనే ఉంది. ఇళ్ల మధ్యనే చెత్తాచెదారాలు పేరుకుపోవడం, మురుగునీరు నిల్వ చేరడం తో దోమలకు ఆవాసంగా మారింది. దోమలు, అపరిశుభ్ర వాతావరణం కారణంగా జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఎమ్మెల్యే ఎదురుగానే అనుచిత వాఖ్యలు తిప్పలో జ్వరాల విజృంభణపై పీహెచ్సీ సిబ్బంది ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎదుటే స్థానికులపై అ నుచిత వాఖ్యలు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మె ల్యే ఆధ్వర్యంలో సర్వసభ్య స మావేశం నిర్వహిస్తుండగా తిప్పవాసులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. పీహెచ్సీ వైద్యాధికారిని ఎమ్మెల్యే వివరాలు అడుగుతుండగా వేదిక పైనున్న ఆమెకు బదులుగా కింది స్థాయి సి బ్బంది సమాధానం ఇచ్చారు. తిప్పలో కేవలం ఏడుగురికే జ్వరాలు ఉ న్నాయని, ఇళ్ల దగ్గర శుభ్రంగా ఉం చుకోకుంటే జ్వరాలు రాకుండా ఎ లా ఉంటాయని అనుచితంగా మా ట్లాడటంతో తిప్ప వాసులు తీవ్ర ఆ గ్రహానికి గురయ్యారు. దీంతో సభ లో గందరగోళం నెలకొంది. ఇంత జరుగుతున్నా వైద్యాధికారి మాధవీలత సమాధానం ఇవ్వకపోవడంపై ఎంపీటీసీ సభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యా యి. డాక్టర్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన చర్యలు కప్పరాళ్లతిప్పలో జ్వరాల నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతాం. జ్వరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్యాధికారితో కూడా ఫోన్లో చర్చించాను. శనివారం నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జ్వరాలు అదుపులోకి వచ్చేలా వైద్యశిబిరాలు సేవలందిస్తాయి. జ్వరాలు నియంత్రణలోకి వచ్చే వరకూ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే విషజ్వరాల, వృద్ధుల, ప్రైవేట్ వైద్యశాల, -
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థిని దుర్మరణం
మియాపూర్: ద్విచక్రవాహనాన్ని స్టార్ట్ చేస్తే కాలేదు... దీంతో ఇంజిన్ వైపు వంగి చూస్తున్న బీటెక్ విద్యార్థినిని అంతలోనే వెనుకనుంచి దూసుకొచ్చి ఇసుక లారీ బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొండగట్టు గ్రామానికి చెందిన మౌనిక (18) నగరంలోని మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ ఫైనల్ చదువుతూ మియాపూర్ హెచ్ఎంసీ స్వర్ణపురికాలనీలోని పెద్దన్నాన ఇంట్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తమ ఇంటి ముందు ఉన్న రోడ్డుపై తన ద్విచక్రవాహనాన్ని నిలిపి స్టార్ట్ చేయగా స్టార్ట్ కాలేదు. దీంతో ఆమె ద్విచక్ర వాహనాన్ని వంగి పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన మౌనికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్సపొందుతూ రాత్రి 8.30కి మృతి చెందింది. పోలీసులు స్వగ్రామంలో ఉన్న మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు శోకసంద్రంలో మునిగిపోయారు.