breaking news
Private bus owners
-
చార్జీలు రెండింతలు
సాక్షి, ముంబై: వేసవి సెలవులకు స్వగ్రామాలకు వెళ్లిన ముంబైకర్లు నగరానికి తిరుగుముఖం పట్టడం ప్రైవేటు బస్సు యజమానులకు వరంగా మారింది. రద్దీ బాగా పెరిగిపోతుండడంతో ఇదే అదనుగా భావించిన వీరంతా ఒక్కసారిగా చార్జీలు పెంచేశారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ దొరక ్కపోతుండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించక తప్పడం లేదు. ఏప్రిల్ నెలలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. పాఠశాలలు జూన్ 16 నుంచి ప్రారంభం కానుండడంతో స్వగ్రామాలకు వెళ్లినవారంతా తిరుగుముఖం పట్టారు. ముంబై-క ణకావ్లీ మధ్య రద్దీ లేని సమయంలో చార్జీ కింద రూ.350-400 వసూలుచేసిన ప్రైవేటు బస్సు యజమానులు ఇప్పుడు రూ.750-800 వరకు వసూలు చేస్తున్నారు. ముంబై- ఔరంగాబాద్ మధ్య రద్దీ లేని సమయంలో ఏసీకి రూ.900-1000 వరకు వసూలు చేయగా ఇప్పుడు రూ.1200-1300 వరకు వసూలు చేస్తున్నారు. ఇక నగరం నుంచి నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల దిశగా బస్సులను నడిపే ఆపరేటర్లు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ముంబై-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్ మినహా నిజామాబాద్ నుంచి ముంైబె కి నేరుగా వచ్చే రైళ్లు లేవు. దీంతో దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలుకు విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక సీజన్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వెయిటింగ్ లిస్టు సంఖ్య 400కి చేరుకుంటున్నప్పటికీ టికెట్లను కొనుగోలు చేయడానికి సైతం వెనకాడడం లేదు. అందులో ఎక్కేందుకు స్థలం దొరికితే చాలని ప్రయాణికులు అనుకుంటారు. ఇక చేసేదేమీలేక మరికొందరు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు బస్సు యజమానులు అందినంత దోచుకుంటున్నారు రద్దీలేని సమయాల్లో చార్జీ కింద రూ.600-700, అదే జూన్ తరువాత అయితే రూ.900-950 వరకు వసూలు చేస్తున్నారు. -
ఒక్క ఘటనను పట్టుకొని ఇంతగా వేధింపులా?
హైదరాబాద్: భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తాము పన్నులు చెల్లిస్తున్నామని ప్రైవేట్ బస్సుల యజమానులు తెలిపారు. ప్రైవేట్ బస్సు ట్రావెల్స్‌పై 50 వేల కుటుంబాలు ఆదారపిడి జీవిస్తున్నట్లు చెప్పారు. ఒక్క సంఘటనను పట్టుకుని ఇంతగా వేధింపులా? అని ప్రశ్నించారు. ఈ రకమైన వేధింపులు సరికాదన్నారు. ఇన్నాళ్లు సక్రమం అనిపించిన వ్యాపారం, ఇప్పుడు తప్పుగా ఎలా అనిపిస్తుందని వారు అడిగారు. తాము అక్రమంగా బస్సును నడుపుతున్నట్లు నిరూపిస్తే తమ వ్యాపారం ఆపుకుంటామని చెప్పారు. డబుల్ రిజిస్టేషన్‌తో ఒక్క బస్సును నడినపినట్టు నిరూపించినా తాము బస్సులన్నీ ఆపేస్తామన్నారు. ఆస్తులు అమ్ముకుని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఈ రోజు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.