breaking news
practical marks
-
ప్రత్యూష.. పాసా? ఫెయిలా..!
- పాసైయిందంటున్న డేనియల్ కళాశాల యాజమాన్యం - ప్రాక్టికల్స్ మార్కులు లేక ఫెయిల్ లిస్ట్‌లో చేర్చిన ఇంటర్‌బోర్డు హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష(పావని) గుర్తుంది కదండీ!. మీడియా, ఎన్జీఓలు, కోర్టుతో పాటు సీఎం కేసీఆర్ చొరవతో పునర్జన్మ పొందిన ప్రత్యూషను అయోమయం చుట్టుముట్టింది. ఈ ఏడాది ఇంటర్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి బిఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలన్న ప్రత్యూష కోరికపై అయోమయం నెలకొంది. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసైనప్పటికి, ఆమెకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన సెయింట్డేనియల్ వొకేషనల్ కళాశాల ఆ వివరాలను సకాలంలో ఇంటర్‌బోర్డుకు పంపలేదు. ఈ క్రమంలో ఇంటర్ ఫలితాల్లో ప్రత్యూష హాల్ టికెట్ నెంబర్ కొట్టి ఫలితాలు చూడగా ఫెయిలైనట్లు వచ్చింది. ఈ విషయమై ప్రత్యూషను సాక్షి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా, తాను ప్రాక్టికల్స్‌తో పాటు, అన్ని పరీక్షలు బాగా రాశానని తెలిపింది. ఈ విషయమై డేనియల్ కళాశాల ప్రతినిధి విజయను ప్రశిస్తే.. ప్రత్యూషకు రెండు హాల్ టికెట్ నెంబర్లున్నాయని, ప్రాక్టికల్స్ తమ వద్ద, రాత పరీక్షలు నారాయణ కళాశాలలో రాసిందని పేర్కొన్నారు. తమ వద్ద నిర్వహించిన ప్రాక్టికల్స్‌లో పాసైందని, ఈ మార్కుల వివరాలు ఇంటర్ బోర్డుకు అందజేస్తామని ఆమె చెప్పారు. -
దారితప్పుతున్న ‘గురు’ స్థానం!
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ‘గురుబ్రహ్మ.. గురుర్విష్ణు.. గురుదేవో మహేశ్వరః.. గురుసాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవేనమః’. తల్లిదండ్రుల తరువాత గురువుకే ప్రముఖ స్థానం ఇచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడితో సరిపోల్చారు. గురుపూజోత్సవానికి ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారంటే గురువుకు ఈ దేశంలో, సమాజంలో ఏ స్థాయిలో గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటీవలి పరిణామాలను చూస్తుంటే గురుశిష్యుల పవిత్రబంధం అపహాస్యమవుతోంది. విద్యావ్యవస్థలో ప్రయివేటు విష సంస్కృతి చొరవడడంతో చదువు‘కొన’డం ప్రారంభమయింది. విజ్ఞానం స్థానంలో వ్యాపారం జోరందుకోవడంతో గురుశిష్యులనే పదానికి అర్థమే మారిపోయిందంటున్నారు విద్యావేత్తలు. కార్పొ‘రేట్’ ఆవరణలో గురువు కాలయముడిగా, కీచకుడిగా మారుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గురువుల వద్దకు తమ పిల్లల్ని పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల నగరంలోని పి.బి. సిద్ధార్థ కాలేజీ, ఆంధ్ర లయోల ఇంజినీరింగ్ కళాశాల, వడ్డేశ్వరం కె.ఎల్. యూనివర్సిటీల్లో జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే యాజమాన్యాల వికృత చేష్టలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. సిద్ధార్థ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు అధ్యాపకుడే కారణమన్న ఆరోపణలు మరిచిపోకముందే లయోల కళాశాలలోనూ మరో అధ్యాపకుడు విద్యార్థుల్ని వేధించడం బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాటవినకపోతే మార్కులు కోతే పలు ఎయిడెడ్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధ్యాపకులు డెరైక్టర్లదే హవా. తమ మాట వినకుండా ఎదురుతిరిగితే ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ మార్కుల్లో కోత వేస్తారు. తమ చేతిలో ఉన్న ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ మార్కులను తగ్గించేసి వేధింపులకు గురిచేస్తారు. చివరికి తమ దారిలోకి తెచ్చుకునే విధంగా కొందరు అధ్యాపకులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటానమస్ విధానం కూడా ఇందుకు దోహదపడుతోందని విద్యావేత్తలు భావిస్తున్నారు.