breaking news
polavaram Caved Area
-
ఎక్కడి వారు అక్కడే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే పరిస్థితుల నేపథ్యంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలవరం ముంపు ప్రాంతాలపై చర్చ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల భౌతిక స్వరూపం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 జూలై 11న భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకర్గాల్లోని 211 గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లోకి మారుస్తూ కేంద్రం ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాలు రెండు రాష్ట్రాల పరిధిలోకి మారాయి. ఈ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు మాత్రం రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నా తెలంగాణలోని ప్రాంతానికే ఇక్కడి ప్రభుత్వం నిధులు మంజూరు చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు అస్పష్టత ఉన్న ఈ నియోజకర్గాల విషయంలో వచ్చే ఎన్నికల్లో స్పష్టత రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి ప్రాంతాల వరకే.. మూడు నియోజకవర్గాలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ప్రాంతాల వరకు నియోజకవర్గంగా గుర్తించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలను అక్కడి రంపచోడవరం, జంగారెడ్డిగూడెం నియోజకవర్గాల్లో చేర్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాలు పూర్తిగా ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం మండలంలోని పట్టణం మినహా మిగిలిన గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. భద్రాచలం పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం ఏటపాక మండలంగా మార్చింది. ఏటపాక, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకర్గంలో కలిపారు. వేలేరుపాడు, కూకునూరు మండలాలను, బూర్గంపాడు మండలంలోని ఏడు గ్రామాలను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో కలిపారు. ఇక్కడ పరిధి తగ్గింపు.. 2009, 2014 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధి తగ్గింది. ఓటర్ల సంఖ్య కూడా తగ్గింది. మూడు నియోజకవర్గాల్లో కలిపి 43,615 ఓట్లు తగ్గాయి. ఓటర్ల సంఖ్య తగ్గడంతో ఈ సెగ్మెంట్లలోని ఎస్టీ ఓటర్ల సంఖ్యలో మార్పులు వచ్చాయని.. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేస్తోంది. -
ఆర్డినెన్స్ ఆంధ్రా పెద్దల కుట్ర
ఆంధ్రా సంపన్నుల కోసం ఆదివాసీలను బలిచేస్తారా?: కోదండరాం వేలేరుపాడు/భద్రాచలం,న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో అడవిని నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీల జీవితాలను ఆంధ్రాలోని సంపన్నుల కోసం కేంద్ర ప్రభుత్వం బలి చేస్తోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం కోయిదా నుంచి నిర్వహిస్తున్న పాదయాత్రను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ముంపు ప్రాంతంలో ఆదివాసీల మనోభావాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిం చారు. ఆంధ్రా పెద్దల కుట్రలో భాగంగానే ఇదంతా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదనీ, అయితే డ్యాం ఎత్తు తగ్గించి ముంపును తగ్గించాలని కోరారు. ఆంధ్రాలోని ఇంజినీరింగ్ నిపుణులు కూడా ఇదేమాట చెబుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న ముంపు మండలాలను వదులుకునే ప్రసక్తే లేదని, సీమాంధ్రలో కలిపేలా రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు కోసం తుదివరకూ పోరాడతామని కోదండరాం చెప్పారు. పార్లమెంట్లో దీనిపై చర్చ జరిగే సవుయుంలో తెలంగాణ ఎంపీలతో పాటు అన్ని ప్రాంతాల ఆదివాసీ ఎంపీల సహకారంతో అడ్డుకుంటామని తెలిపారు. బాబూ.. ఆదివాసీల గురించి ఆలోచించు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివాసీల సంక్షేవుం గురించి ఆలోచించాలని కోదండరాం కోరారు. అడవిని నమ్ముకొని బతుకుతున్న వారికి అన్యాయం చేయవద్దన్నారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం జరగకుండా గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే రాజయ్యకు మద్దతు భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షను కోదండరాం శనివారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు రాక్షసత్వం కారణంగానే ఈ ఆర్డినెన్స్ వచ్చిందన్నారు. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీలను మనుషులుగా గుర్తించినట్లైతే చంద్రబాబు ఈ విషయం లో స్పందించాలన్నారు. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినందును ఇప్పుడేమీ చేయలేమని గవర్నర్ చెబితే సరిపోదని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రతినిధిగా గిరిజనుల ఇబ్బం దులను గమనించాలని ఆయన కోరారు.