breaking news
Pitch Assist Pacers
-
అలాంటి పిచ్‌లపై గెలవడం గొప్పేమీ కాదు..
లండన్: ఇంగ్లీష్ జట్టుపై 3-1 తేడాతో గెలుపొందిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ మాత్రం టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కుతున్నాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత దేశపు పిచ్‌లపై టీమిండియా విజయాలు సాధించడం పెద్ద గొప్ప విషయమేమీ కాదని పేర్కొన్నాడు. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ గడ్డపై గెలిచినప్పుడే టీమిండియా అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని వెల్లడించాడు. టీమిండియా విజయవరంపర ఇంగ్లండ్‌లోనూ కొనసాగితే.. ఈ శకంలోనే అత్యుత్తమ టెస్టు జట్టుగా నిలుస్తుందన్నాడు. స్వింగ్ బంతుల్ని ఎదుర్కొనేందుకు భారత ఆటగాళ్లు కష్టపడతారు కాబట్టే తాను ఈరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నానన్నాడు. టెస్టుల్లో టీమిండియా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఆ జట్టుకు అధిక శాతం విజయాలు ఉప ఖండపు పిచ్‌లపైనే దక్కడం తన అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయన్నాడు. టెస్టు మ్యాచ్‌లు రెండు, మూడు రోజుల్లో పూర్తి కావడం సంప్రదాయ క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాపడ్డాడు. మొటేరా వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో కోహ్లీసేన ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించి, న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. జూన్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదిక కానుంది. -
విరాట్ కోహ్లీ సేనకు చేదువార్త
న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి, నాలుగో మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి టెస్టుకు ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. సాధారణంగా భారత గడ్డపై పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కు అనుకూలిస్తుంటాయి. టీమిండియా కెప్టెన్, ఆటగాళ్లు కూడా ఇలాంటి పిచ్‌లనే కోరుకుంటారు. ఈ సిరీస్‌లో కూడా స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు. అయితే నాలుగో టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ సేనకు ఓ చేదువార్త! ధర్మశాల పిచ్‌కు స్పినర్లకు పెద్దగా అనుకూలించదట! ఇక్కడ పేసర్లకు ఎక్కువగా సహకరిస్తుందని క్యూరేటర్ సునీల్ చౌహాన్ స్పష్టం చేశాడు. ధర్మశాల్ పిచ్ సహజంగానే పేసర్లకు అనుకూలిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని చౌహాన్ చెప్పాడు. ఇటీవల ఈ వేదికపై జరిగిన రంజీ మ్యాచ్‌లలో కూడా ఇదే విషయం రుజువైందని గుర్తు చేశాడు. టెస్టు మ్యాచ్‌కు అవసరమైన పిచ్‌ను రూపొందించేందుకు ప్రయత్నించామని చెప్పాడు. తొలి రెండు రోజు పేసర్లకు, తర్వాత బ్యాట్స్‌మెన్‌కు, స్పిన్నర్లకు సహకరిస్తుందని తెలిపాడు. ఈ వార్త కంగారూలకు సంతోషం కలిగించేదే. గాయం కారణంగా మిచెల్ స్టార్క్ జట్టుకు దూరమైనా, హజ్లెవుడ్, కమిన్స్ సత్తాచాటుతారని విశ్వాసంతో ఉన్నారు. భారత బ్యాట్స్‌మెన్‌ను తమ పేసర్లు కట్టడి చేస్తారని భావిస్తున్నారు. ఇక భారత్ విషయానికొస్తే ఎక్కువగా స్పిన్నర్లపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సిరీస్‌లో పేసర్ల కంటే ఎక్కువగా స్పిన్ బౌలర్లు అశ్విన్, జడేజాలే కీలక పాత్ర పోషించారు. కాగా బీసీసీఐ చీఫ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్ ఇప్పటికే ధర్మశాల చేరుకుని పిచ్ తయారీని పర్యవేక్షిస్తున్నాడు. వికెట్ తయారీలో మార్పులు చేయిస్తారా లేక చౌహాన్‌పైనే పూర్తి బాధ్యతలు వదిలిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.