breaking news
pepper-spray
-
క్షేమంగా...రక్షణగా...
అవసరం కోసం మోసపు మాటలతో... క్రూరపు ఆలోచనలతో అరణ్యాలను తలపిస్తున్న ఈ చీకటి కీచక పర్వంలో.. స్త్రీకి ఎప్పుడు? ఏ సమస్య..? ఎలా? వస్తుందో ఊహించడం చాలా కష్టం. ‘అన్ని వేళలా ఎవరో ఒకరు ఆసరాగా, రక్షణగా ఉంటారులే’నన్న అతినమ్మకం ఎంత మాత్రం మంచిది కాదు. వేళ కానీ వేళ, తెలిసిన మనిషైనా.. తెలియని మనిషైనా.. తెలిసిన చోటైనా.. తెలియని చోటైనా.. ఆత్మరక్షణకు ఆయుధాలను వెంట పెట్టుకోవడం తప్పనిసరి. ఆయుధాలంటే కత్తులు, తుపాకీలు కాదు. ఆపద నుంచి తప్పించుకోవడానికి, కుట్రదారుడ్ని బురిడీ కొట్టించడానికి సరిపడే ఆయుధాలుంటే చాలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం! స్మార్ట్ లాకెట్! ఈ లాకెట్ స్టెయిలిష్ లుక్‌తో పాటూ సేఫ్టీని కూడా ఇస్తుంది. అదెలా అంటే.. ఈ లాకెట్లో ఓ ప్రత్యేకమైన పరికరం అమర్చి ఉంటుంది. దానికి సంబంధించిన యాప్‌ని మన ఫోన్లో వేసుకుంటే.. ఆపద తలెత్తినప్పుడు.. లాకెట్ వెనుక వైపు ఉండే బటన్ని గట్టిగా ప్రెస్ చెయ్యాలి. దానిలోని బ్లూటూత్ ఆన్ అయ్యి.. ప్రమాదాన్ని మన ఆప్తులకు చేరవేస్తుంది ఈ గాడ్జెట్. దీన్ని మెడలో లాకెట్‌లా అయినా వేసుకోవచ్చు. లేదా వెనుక ఉన్న పరికరాన్ని లాకెట్ నుంచి వేరు చేసుకుని కీచైన్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ధర సుమారుగా 2 వేలు ఉంటుంది. ఈ లాకెట్స్ చాలా కలర్స్‌లో లభిస్తున్నాయి. విజిల్ విజిల్ కట్టుకున్న చెయిన్‌ను ఎప్పుడూ మెడలో వేసుకోవాలి. ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే విజిల్ ఊదాలి. దాని వల్ల పరిసరాల్లో ఉన్న వ్యక్తుల దృష్టి మీ మీద పడి, మిమ్మల్ని ఆపద నుంచి రక్షించేందుకు వీలుంటుంది. పెప్పర్ స్ప్రే! మహిళల ఆత్మరక్షణకు ‘పెప్పర్ స్ప్రే’ అనేది ఆత్మరక్షణా ఆయుధాల్లో ఒకటి. దీన్ని ప్రయోగించగానే.. దుండగుల కళ్లను, చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దాంతో తప్పించుకోవడం సులభం. ఇది మార్కెట్లో దొరుకుతుంది. లిప్‌స్టిక్ షేప్డ్ స్టన్ గన్! చిత్రంలోని లిప్‌స్టిక్‌ని చూడండి. ఇది నిజంగా లిప్‌స్టిక్ కాదు. ఆత్మరక్షణ ఆయుధం. దీన్ని ఉపయోగించి.. మిమ్మల్ని మీరు రక్షించుకోచ్చు. దీనిలో స్టన్ గన్ బటన్, ఫ్లాష్ లైట్ బటన్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. స్టన్ గన్ బటన్ ఆన్ చేయగానే వైబ్రేషన్ షాక్ వస్తుంది. దాని నుంచి దుండగుడు కోలుకునే లోపు మనం సురక్షితంగా బయటపడొచ్చు. ఇక ఫ్లాష్ లైట్ బటన్ ఆన్ చేసుకుంటే టార్చ్‌లైట్ వెలుగుతుంది. తప్పించుకునే సమయంలో.. చీకటి ప్రదేశాల్లో.. దారి కనిపిస్తుంది. ఇది కీచైన్ కావడంతో సాధ్యమైనంత వరకూ మన వెంటే ఉంటుంది. దీని ధర సుమారు 13 వందల రూపాయలు. దీనిలోని బ్యాటరీ.. చార్జబుల్ బ్యాటరీ కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సేఫ్‌లెట్! సేఫ్‌లెట్ అనే గాడ్జెట్‌ని అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని ఫోన్లో యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. గాడ్జెట్ బటన్ ప్రెస్ చేయగానే.. ఆడియో రికార్డింగ్ ఓపెన్ అయ్యి ఫోన్ ద్వారా సమస్యను మన ఆప్తులకు చేరవేస్తుంది. ప్రమాదాన్ని ఊహించిన వెంటనే దీన్ని యాక్టివేట్ చేస్తే.. మనం ఆపదలో ఉన్నామన్న విషయం.. మన స్నేహితులకు, ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. మనం ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నామనేది కూడా తెలుస్తుంది. దాంతో సమాచారం అందుకున్న వ్యక్తులు ఎమెర్జెన్సీ నంబర్ని కాంటాక్ట్ చెయ్యొచ్చు. దీని ధర సుమారు రూ.9,900 కాగా.. దీన్ని ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. సేఫ్టీ రాడ్! ఆపద నుంచి తప్పించుకోవడానికి కొన్ని సార్లు పెనుగులాట తప్పదు. అలాంటి సమయంలో ఇలాంటి రాడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా జానెడు పొడవు ఉంటుంది. ఆపద సమయంలో దీన్ని పెద్దగా మార్చుకుని(చిత్రాన్ని గమనించండి) ఉపయోగించుకోవచ్చు. హైక్వాలిటీతో రూపొందిన ఈ రాడ్‌ని యూజ్ చేసుకోవడం చాలా సులభం. దీని ధర సుమారు 6వందల రూపాయలు. దీన్ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని వెంట తీసుకెళ్లొచ్చు. -
పెప్పర్ స్ప్రేతో చిక్కులు
సండర్ బొర్గ్: ఆత్మరక్షణ కోసం యువతులు, మహిళలు పెప్పర్ స్ప్రే తమ దగ్గర ఉంచుకుంటున్నారు. తమపై దుండగులు దాడి చేసినప్పుడు పెప్పర్ స్ప్రే చల్లి ఆత్మరక్షణ చేసుకుంటున్నారు. అయితే డెన్మార్క్ లో ఓ 17 ఏళ్ల బాలిక పెప్పర్ స్ప్రే కారణంగా చిక్కుల్లో పడింది. పెప్పర్ స్ప్రే కలిగివున్నందుకు జరిమానా ఎదుర్కొబోతోంది. సండర్ బొర్గ్ ప్రాంతంలో ఈనెల 20న రాత్రి రోడ్డుపై నడిచివెళుతుండగా ఆమెపై ఆగంతకుడొకడు అత్యాచారయత్నం చేశాడు. అతడిపై పెప్పర్ స్ప్రే చల్లి ఆమె బయటపడింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పెప్పర్ స్ప్రే కలిగివున్నందుకు ఆమెకు జరిమానా విధించనున్నారు. డెన్మార్క్ ఆయుధ చట్టం ప్రకారం పెప్పర్ స్ప్రే కలిగివుండడం నేరం. ఆమెకు 5 వేల డానిష్ క్రోన్స్ జరిమానా విధించే అవకాశముందని అధికారులు తెలిపారు. అత్యాచారయత్నంపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.