breaking news
People Move
-
తండోపతండాలుగా...
తండోపతండాలుగా ప్రధాని సభకు తరలివెళ్లిన ప్రజలు హైదరాబాద్‌కు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు శామీర్‌పేట్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం, కోమటిబండలో ఆదివారం తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ది పనులను ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా వస్తున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదికి ఘన స్వాగతం పలికేందుకు మండలం నుంచి భారి సంఖ్యలో తరలివెళ్లారు. శామీర్‌పేట్ మండల కేంద్రంలో కట్టమైసమ్మ వద్ద మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి బస్సుల్లో బయలు దేరుతున్న జనాలకు జెండా ఊపి ప్రారంభించారు. యాచారం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ రాక నిర్వహించే పార్టీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. బీజేపీ మండల అధ్యక్షుడు ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని 20 గ్రామాల నుంచి దాదాపు 700 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. -
ప్రజల్లో చైతన్యంతోనే వ్యవస్థలో మార్పు
* సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సాక్షి, న్యూఢిల్లీ: వ్యవస్థలో లోటుపాట్లను సరిచేయాలన్నా, మార్పురావాలన్నా ప్రజా చైతన్యంతోనే సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. రాజ్యాంగం, హక్కులపై ప్రజల్లో అవగాహన లేకుండా అవి అమలు కావడం లేదనడం సరికాదన్నారు. ప్రజలకు హక్కులు, చట్టాల గురించి తెలిసినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు. చాలామందికి న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, కార్యనిర్వహణ సంస్థలకి తేడా తెలియదన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ చేసిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదని, దాన్ని సక్రమంగా అమలు అవుతుందా లేదా చూసే బాధ్యత న్యాయవ్యవస్థదని తెలిపారు. ఈ తేడా గమనించకుండా అన్ని విషయాల్లోనూ కోర్టులని, వ్యవస్థని నిందించడం సబబు కాదన్నారు. సాహిత్య వేదిక, ఢిల్లీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఢిల్లీ రవీంద్రభవన్లోని సాహిత్య అకాడమీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన ‘సంతులిత, ‘విముక్త’ పుస్తకాలను కేంద్రీయ హిందీ సమితి ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గ్లోబల్ విశ్వవిద్యాలయం వీసీ కె.సీతారాం, సీనియర్ పాత్రికేయుడు ఏ.కృష్ణారావుతో కలసి ఆవిష్కరించారు.