breaking news
Penniless
-
అచ్చం సినిమాలా ఓ బిజినెస్ టైకూన్ స్టోరీ
-
అచ్చం సినిమాలా ఓ బిజినెస్ టైకూన్ స్టోరీ
ముంబై: మోస్ట్ పాపులర్ క్లోతింగ్‌బ్రాండ్ రేమండ్స్ మాజీ ఛైర్మన్, బిజినెస్ టైకూన్ విజయ్‌పత్ సింఘానియా (78) చేతిలో పైసాలేని పరిస్థితిలో రోడ్డున పడ్డారు. ముంబాయికి చెందిన మాజీ షెరీఫ్ డిసెంబరు 19, 2005 నుండి 18 డిసెంబరు 2006 వరకు రేమండ్ గ్రూప్‌కు చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగారు. అలా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అవోకగా నిర్వహించిన బడా వ్యాపారవేత్త ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా కటకటలాడుతున్నారంటే నమ్మగలమా? కానీ తాజా వార్తల ప్రకారం ఇది నమ్మలేని నిజం. అచ్చం సినిమా స్టోరీని తలపిస్తూ...ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన విజయ్‌పత్ సింఘానియా ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే తన సొంత కుమారుడి పైనే బాంబే హైకోర్టులో కేసు వేశారు సింఘానియా కంపెనీలోని షేర్లను తన కుమారుడుకి అప్పజెప్పి, ఇపుడు తాము మోసపోయామని, తన డూప్లెక్స్ హౌస్ తదితర ఆస్తులను తనకు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. తన బాధాకరమైన ఆర్థిక పరిస్థితి గురించి కోర్టుకు వివరిస్తూ, మూడు రోజుల క్రితం సీనియర్ సింఘానియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. రూ. 1000 కోట్ల విలువ కలిగిన కంపెనీని, షేర్లను కొడుకు గౌతమ్ సింఘానియా అప్పగించానని చెప్పారు. అలాగే మలబార్ హిల్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన 36 అంతస్తుల జేకే హౌస్‌లో డూప్లెక్స్ ను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ముంబైలోని నెపియన్ సీ రోడ్లో ఓ ఇంటిలోకి నెలకు రూ. 7 లక్షలకు అద్దెకు ఉంటున్నామనీ, ఇప్పటివరకూ చెల్లించిన అద్దెను కూడా రీఎంబర్స్ చేయాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు తన కుమారుడి కోసం మొత్తం ఆస్తిని అంతా సింఘానియా త్యాగం చేస్తే.. ఇప్పుడా కొడుకు ఆయనను ఏమీ లేని స్థితికి చేరుస్తున్నాడని న్యాయవాదులు అంటున్నారు. ఈయన డాక్యుమెంట్స్, పర్సనల్ ఫైల్స్‌ను నిర్వహించిన ఇద్దరు రేమండ్ ఉద్యోగులు కూడా మిస్ కావడంతో, ఆయా పత్రాలను పొందేందుకు వీలు లేకుండా పోయిందని చెబుతున్నారు. కొడుకు గౌతమ్ వేధింపులు ఎక్కువయ్యాయని లాయర్లు చెబుతున్నారు. రీసెంట్గా గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్న సింఘానియా కరియర్లో అనేక సాహసోపేత అవార్డులు, రివార్డులు కూడా ఉన్నాయి. నిర్విరామంగా 5,000 గంటలపాటు విమాన నడిపిన అనుభవం ఉంది. 1994 లో ఫెడేరేషన్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ 24 రోజులు పాటు 34,000 కి.మీ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. భారత వైమానిక దళం నుంచి ఎయిర్ కమోడర్ పురస్కారం, 1998 లో యూకే నుండి భారతదేశం వరకు సోలో మైక్రోలైట్ విమానాన్ని నడిపి వరల్డ్ రికార్డ్, 2005 లో రాయల్ ఏరో క్లబ్ నుంచి బంగారు పతకం, 2006 లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ సత్కారాన్ని అందుకున్నారు. 'యాన్ ఏంజిల్ ఇన్ ది కాక్‌పిట్' అనే పుస్తకాన్ని కూడా రచించారు. మార్చి 2007 లో ఐఐఎం అహ్మదాబాద్ కు పాలక మండలి ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. కాగా ఆయన పెద్దకుమారుడు 1988లో మధుపతి సింఘానియా తన కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నారు. ముంబైలోని పూర్వీకుల ఇంటిని, ఇతర ఆస్తులను వదులుకుని భార్యా, నలుగురు పిల్లలతో సహా సింగపూర్‌కి వెళ్లిపోయారు. అనంతరం గౌతం హరి సింఘానియా రేమాండ్స్ ఎండీగా ఎన్నికయ్యారు. అయితే దీనిపై సీనియర్ సింఘానియా కుమారుడు గౌతం ఇంకా స్పందించలేదు. -
విమానాల్లో వచ్చారు.. భిక్షమెత్తారు!
హోసపేటె: అభివృద్ధి చెందిన దేశాల నుంచి విలాసంగా విమానాల్లో వచ్చారు. అయినా భిక్షమెత్తారు. 30 దేశాల నుంచి సుమారు 100 మందికి పైగా విదేశీయుల పర్యాటకుల బృందం కర్ణాటకలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రమైన బళ్లారి జిల్లాలోని హంపినీ వీక్షించేందుకు వచ్చింది. కొద్దిరోజులుగా వీరంతా విరుపాపురగడ్డ సమీపాన ఉన్న మైదానంలో టెంట్ వేసుకొని బస చేస్తున్నారు. అయితే పోలీసులు వారిని ఖాళీ చేయించారు. దీంతో హోసపేటె నగరానికి చేరుకొన్న ఈ దేశీయుల బృందం గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండు ముందు విన్యాసాలు ప్రదర్శిస్తు భిక్షాటన చేశారు. జనం తోచిన డబ్బును అందించారు. ఈ డబ్బును పేదలకు ఇస్తామని కొందరు, సొంతానికి వాడుకుంటామని మరికొందరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో మనదేశ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు చిల్లరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజస్థాన్ లో పుష్కర్ ప్రాంతంలో నవంబర్ లో విదేశీ పర్యాటకులు తమకు వచ్చిన విద్యలు ప్రదర్శించి చిల్లర అర్థించారు. -
దున్నేవాడిదే భూమి
- ప్రతి నిరుపేదకూ నాలుగెకరాలు ఇవ్వాలి - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ - చింతకుంట సమీపంలో భూపోరాటం పుట్లూరు : దున్నేవాడిదే భూమి అని, భూమిలేని ప్రతి నిరుపేదకూ నాలుగు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పుట్లూరు మండలంలోని చింతకుంట గ్రామం వద్ద సీపీఐ నాయకులు బుధవారం భూ పోరాటంలో భాగంగా విత్తనం వేసే పనులు చేపట్టారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు వేల ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వం నిరుపేదలకు ఎకరా కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు భూమి ఇస్తే వ్యవసాయం చేసుకుని జీవిస్తారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు భూమి పంపిణీ చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతకుంట వద్ద 200 ఎకరాలు, కడవకల్లులో 212 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని అర్హులైన భూమిలేని నిరుపేదలకు ఇచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ భూమిలో దున్నటం, విత్తన పనులు చేపట్టడంతో తహశీల్దార్ రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రి రూరల్ సీఐ అస్సార్బాషా, పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు ఎస్ఐలు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. దీంతో సీపీఐ నాయకులు తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. తాము పేదలకు భూమి ఇప్పించడానికి పోరాటం చేస్తుంటే పోలీసులను మోహరించడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ భూమి ప్రజల భూమి అని, భూమిలేని పేదలు సాగు చేసుకోవడానికి వచ్చి న సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమిని ఎవరికీ ఇవ్వకూడదన్న నిభందన ఉందని తహ శీ ల్దార్ వారికి తెలిపారు. అనంతరం సీపీఐ నాయకులు సేద్యం పనులు ప్రారంభించి వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జిల్లా కార్యదర్శి జగదీష్, పైలానరసింహయ్య, రంగయ్య, శింగనమల గోపాల్ పాల్గొన్నారు.