breaking news
pathala ganga in srisailam
-
శ్రీశైలం పాతాళగంగలో నీటి కుక్కల సందడి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పాతాళ గంగలో నీటి కుక్కలు(Otters) సందడి చేశాయి. ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టుపై విన్యాసాలు చేస్తూ యాత్రికులకు కనిపించాయి. అవి నీటి నుండి బయటకు వచ్చి పుణ్య స్థానాలు చేస్తున్న భక్తులను ఆకర్షింస్తున్నాయి. భక్తులు అలా వాటిని చూస్తుండిపోయేలా కట్టిపడేస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నీటి కుక్కలు పాతాళగంగ ఒడ్డుకొచ్చాయి. మెట్ల మార్గంలో నీటి కుక్కలు(Otters)కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు. ఇది కూడా చదవండి: పోలవరంపై కేంద్రం పిటిషన్: ఏపీ హైకోర్టు నుంచి బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ -
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
గడువులోగా పుష్కర పనులు పూర్తి చేయాలి కలెక్టర్ టీకే శ్రీదేవి పాతాలగంగ,(మన్ననూర్): పుష్కరాల సమయం సమీపిస్తున్నందున పనులు వేగవంతం చేసి, గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం అమ్రాబాద్ మండలం పాతాలగంగ వద్ద కృష్ణా పుష్కరాలు కోసం ఏర్పాటు చేస్తున్న ఘాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఇతర అధికారులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి మొదటిసారి సందర్శించిన కలెక్టర్ ఇక్కడి సహజమైన అందాలను చూసి పులకించిపోయారు. అంతకుముందు జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి హెలిప్యాడ్, బస్‌స్టాండ్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపుపనుల్లో జోక్యం చేసుకోకుండా ఇప్పటివరకు ప్రభుత్వం ఆదేశించిన పనుల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాలన్నారు. ఈ సందర్భంగా ప్రమాదకరంగా ఉన్న పుష్కరఘాట్లలోని అడుగు భాగాన్ని పరిశీలించిన, అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్, ఏఈలను ఆదేశించారు. అనంతరం పుష్కరాలకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పుష్కరాల ప్రత్యేక అధికారి, డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌నాయక్, డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఎంపీపీ రామచంద్రమ్మ, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ రఘునందన్, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ, డీఈ అశోక్‌కుమార్,హేమలత, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు నరేందర్, బలరాం, ఆదిత్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.