breaking news
Paras Mhambrey
-
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు కొత్త కోచ్
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ (PBKS)కు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చాడు. జేమ్స్ హోప్స్ స్థానంలో భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు. గత నెలలో హోప్స్‌తో తెగదెంపులు చేసుకున్నట్లు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది. హోప్స్ ఇకపై ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయనున్నాడు. వీరిద్దరు గతంలో ముంబై ఇండియన్స్‌లో కలిసి పనిచేశారు.మాంబ్రేకు అంతర్జాతీయ క్రికెట్లో మంచి అనుభవం ఉంది. 2021 నుంచి 2024 వరకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆయన పదవీకాలంలోనే భారత్ 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. అనంతరం వెస్టిండీస్‌లో జరిగిన 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మాంబ్రేకు అనుభవం ఉంది. ముంబై ఇండియన్స్ కోచింగ్ బృందంలో ఆయన రెండుసార్లు పనిచేశాడు. టీమిండియా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత మరోసారి ఆ ఫ్రాంచైజీతో చేరాడు. అయితే, గత నెలలో ముంబై ఇండియన్స్ కోచింగ్ సిబ్బందిలో మార్పులు చేయడంతో ఆ జట్టును వీడాడు.టైటిల్ మాత్రం దక్కలేదుపంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. రెండుసార్లు ఫైనల్‌కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన పంజాబ్.. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది.2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ప్రారంభించింది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే, ఆ తర్వాత ఆ జట్టు జోరు తగ్గింది. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. దీంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కొత్త బౌలింగ్ కోచ్‌గా మాంబ్రే నియామకంతో వచ్చే సీజన్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డులు బద్దలు -
‘వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసు.. అతడికి అంత సీన్ లేదు’
భారత క్రికెట్ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశమైన పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఫార్మాట్లకు అతీతంగాఇక భారత్ అండర్-19 క్రికెట్ జట్టు తరఫునా ఫార్మాట్లకు అతీతంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. అదే విధంగా వరల్డ్‌కప్ ఫైనల్లో విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో భారత్‌కు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో భారీ అంచనాలతో ఐపీఎల్-2026 బరిలో దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొలి మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై దంచికొట్టాడు.ఆది నుంచే దూకుడుకేవలం 15 బంతుల్లోనే అర్థ శతకం సాధించి సత్తా చాటాడు వైభవ్. ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ 18 బంతుల్లో 31 పరుగులతో అలరించాడు. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్ తమ మూడో మ్యాచ్‌లో భాగంగా మంగళవారం గువాహటిలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా.. వైభవ్ గురించి మరోసారి చర్చ మొదలైంది.వరల్డ్‌క్లాస్ బౌలర్, టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడోనన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ముంబై సైతం ఈ కుర్రాడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించిందా? అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ పారస్ మాంబ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు.వైభవ్ గురించి తెలుసు‘‘ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. వైభవ్ కొత్త ఆటగాడేమీ కాదు. ఐపీఎల్లో అతడికి ఇది రెండో సంవత్సరం. కాబట్టి అతడు కొత్త కాదు. అయితే, అతడొక మంచి ప్లేయర్. అయినా అతడి కోసం మేమేమీ ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడం లేదు. మిగతా వారిలాగే అతడు కూడా!’’ అని పారస్ మాంబ్రే కొట్టిపారేశాడు.అతడికి అంత సీన్ లేదుఇక రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి ప్రస్తావన రాగా.. ‘‘రవి మిస్టరీ స్పిన్నర్‌గానే కొనసాగుతున్నాడని నేను నమ్మను. గత కొన్నేళ్లుగా అతడు ఎలా ఆడుతున్నాడో అందరికీ తెలుసు. ఆటగాళ్ల కెరీర్లో ఒడిదుడుకులు సహజం. ఒక్కోసారి బాగా ఆడతారు.. మరోసారి తేలిపోతారు. ఇప్పుడు ఫామ్‌లో ఉన్నంత మాత్రాన అతడి గురించి భయపడాల్సిందేమీ లేదు’’ అని పారస్ మాంబ్రే అతడిని తేలికగానే తీసుకుంటున్నట్లు తెలిపాడు.కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రవి బిష్ణోయి అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్ల కోటాలో 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్ (73), గ్లెన్ ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్ (4), రాహుల్ తెవాటియా (12) రూపంలో కీలక వికెట్లు తీసి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: BCCI: ‘అమ్మిన మోడల్ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’


