breaking news
Paras Dogra
-
చరిత్ర ఆవిష్కృతం.. భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి
జమ్మూ కశ్మీర్ సరికొత్త చరిత్ర ఆవిష్కరించింది. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో ఫైనల్లో విజయ లాంఛనాన్ని శనివారం ముగించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.అసాధారణ విజయాలతోదేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో జమ్మూ కశ్మీర్ అసాధారణ విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఆద్యంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను సైతం ఓడిస్తూ టైటిల్ రేసులో నిలిచింది.ఈ క్రమంలో హుబ్లి వేదికగా కర్ణాటకతో ఫైనల్లో తలపడిన జమ్మూ కశ్మీర్ ఇక్కడా జోరు కనబరిచి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. KSCA హుబ్లి క్రికెట్ గ్రౌండ్లో టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 584 పరుగులు సాధించింది.సమిష్టిగా రాణించిన బ్యాటర్లుయావర్ హసన్ (88), కెప్టెన్ పారస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వాధవాన్ (70), సాహిల్ లోట్రా (72) అర్ధ శతకాలతో రాణించగా.. శుభం పండిర్ శతక్కొట్టడం (121)తో ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక ఇందుకు బదులిచ్చేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 293 పరుగులకే కుప్పకూలింది.చెలరేగిన ఆకిబ్ నబీస్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (13) విఫలం కాగా.. మరో సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్కాల్ (160) భారీ శతకంతో రాణించాడు. మిగిలిన వారిలో శ్రేయస్ గోపాల్ (27), కృతిక్ క్రిష్ణ (36) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జమ్మూ కశ్మీర్‌ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో చెలరేగి కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.అజేయ సెంచరీల సాక్షిగా ఈ క్రమంలో 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి కర్ణాటకపై ఓవరాల్‌గా 477 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన శనివారం రోజు ఆటలో భాగంగా ఓపెనర్ కమ్రాన్ అక్మల్ అజేయ శతకం (160) పూర్తి చేసుకోగా.. సాహిల్ లోట్రా కూడా సెంచరీ (101)తో నాటౌట్‌గా నిలిచాడు.సాహిల్ శతకం పూర్తి చేసుకోగానే జమ్మూ కశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కశ్మీర్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అయితే, నిబంధనల ప్రకారం ఫలితం తేలనట్లయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.సీఎం అభినందనలుపారస్ డోగ్రా ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించినప్పటికీ ఆఖరి రోజు కమ్రాన్, సాహిల్ సెంచరీల సాక్షిగా.. చారిత్రాత్మక విజయాన్ని జమ్మూ కశ్మీర్‌కు అందించాడు. కాగా సాహిల్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం. అది కూడా చారిత్రాత్మక విజయం సందర్భంగా సాధించడం విశేషం. చదవండి: IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?A maiden First-Class century 💯On the grandest stage of all 🏟️A moment he will never forget ✨Sahil Lotra puts up a performance that he will remember for a lifetime 🫡Updates ▶️ https://t.co/G0ytZLEyNB#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/YOl1SgTEmD— BCCI Domestic (@BCCIdomestic) February 28, 2026 ఇక జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలిచిన క్షణాలను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యక్షంగా తిలకించారు. భారత క్రికెట్ నియంత్రణమండలి (BCCI) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సైతం ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచాడు. వీరిద్దరు కరతాళ ధ్వనులతో సాహిల్‌తో పాటు కశ్మీర్ జట్టును అభినందించారు. -
కెప్టెన్‌గా సూపర్ హిట్!.. భారీ షాకిచ్చిన బీసీసీఐ!
రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు అదరగొట్టింది. కర్ణాటక బౌలింగ్‌ను చితక్కొడుతూ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. హుబ్లీ వేదికగా గురువారం నాటి మూడో రోజు ఆటను ఓవర్‌నైట్ స్కోరు 527/6తో మొదలు పెట్టిన కశ్మీర్.. మరో 57 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.కెప్టెన్‌గా సూపర్ హిట్!ఓపెనర్ యావర్ హసన్ (88), కెప్టెన్ పారస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), వికెట్ కీపర్ బ్యాటర్ కన్హయ్య వాధవాన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్‌డౌన్ బ్యాటర్ శుభం పండిర్ (121) శతకంతో దుమ్ములేపాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్ పటిష్ట స్థితిలో నిలిచింది.ఇదిలా ఉంటే.. ఆట పరంగా అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా మంచి ప్రదర్శన కనబరిచిర పారస్ డోగ్రా.. వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బుధవారం కర్ణాటక ఫీల్డర్‌ను హెల్మెట్‌తో ఢీకొట్టాడు. రంజీ ట్రోఫీలో సీనియర్ ఆటగాడిగా అపార అనుభవం ఉన్న పారస్ డోగ్రా... కర్ణాటక ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు.పదే పదే కామెంట్దేశవాళీల్లో 21వ సీజన్ ఆడుతున్న జమ్ముకశ్మీర్ సారథి... బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అనీశ్‌తో గొడవకు దిగాడు. పారస్ సంయమనంతో షాట్లు ఆడుతుండగా... కర్ణాటక ప్లేయర్లు అతడి ఏకాగ్రత దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. సిల్లీ పాయింట్లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తున్న అనీశ్... పారస్‌ను పదే పదే కామెంట్ చేశాడు. దీంతో ప్రసిధ్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అనంతరం పారస్... అతడి వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు.హెల్మెట్‌తో ఢీకొట్టిఈ క్రమంలో అనీశ్‌ను పారస్ హెల్మెట్‌తో ఢీకొట్టినట్లు వీడియోల్లో కనిపించింది. అనీశ్ కూడా హెల్మెట్ పెట్టుకొని ఉండగా... ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన కర్ణాటక సీనియర్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ వారిద్దరినీ వేరు చేశాడు. ఫీల్డ్ అంపైర్లు రోహాన్ పండిట్, ఉల్హాస్ గంధె కలుగచేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. భారీ షాకిచ్చిన బీసీసీఐ!అయితే, ఈ వివాదం కారణంగా పారస్ డోగ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారతక్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి భారీ జరిమానా విధించింది. ఈ విషయం గురించి.. మ్యాచ్ రిఫరీ నారాయణ్ కుట్టీ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. జమ్మూకశ్మీర్ సారథి పారస్ డోగ్రా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా రంజీ చరిత్రలో తొలిసారి జమ్మూ కశ్మీర్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్‌గా పారస్ డోగ్రా చరిత్రకెక్కాడు.చదవండి: T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు


