breaking news
Parantha maker
-
ఛాయ్ ఐస్‌క్రీమ్ పరాఠా, సూపర్..
పుర్రెకోబుద్ధి జిహ్వకోరుచి అంటారు పెద్దోళ్లు. అంటే ప్రతి మనిషి ఆలోచనలు వేరుగా ఉంటాయి, అభిరుచులు భిన్నంగా ఉంటాయి అని దాని అర్థం. అలాగే ఒక్కొక్కరు ఒక్కోరకమైన టేస్ట్‌ను ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఓవైస్ సిద్ధ్‌క్వి అనే వ్యక్తి తన అభిరుచికి తగ్గట్టు ఒక స్పెషల్ డిష్‌ను తయారుచేసి దానిని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానిని చూసివారు వారి అభిప్రాయాలను బట్టి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ అతను చేసిన డిష్ ఏంటంటే... మనలో చాలా మందికి ఛాయ్ తాగనిదే తెల్లారదు. టీని ఇష్టపడని వారు సామాన్యంగానే ఎవరు ఉండరు అని చెప్పొచ్చు. Chai paratha reimagined, spiced doodh patti ice cream with sugar laced parhatta. pic.twitter.com/CzPORPMb0U — Owais Siddiqui (@OwaisO) October 8, 2020 అందుకే టీ అంటే చాలా ఇష్టపడే సిద్ధ్‌క్వి ఛాయ్ పరాఠ తయారు చేసి దానిలో తనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను వేసి ఒక ఢిపరెంట్ డిష్‌ను తయారు చేశారు. చాలా మంది ఛాయ్‌తో పాటు సమోసకానీ, బిస్కెట్లు కానీ తినడానికి ఇష్టపడతారు. ఇక మన సిద్ధ్‌క్వి మాత్రం తనకు ఇష్టమైన టీని పరాఠ తయారీలో ఉపయోగించి దానిలో అతనికి ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్ పెట్టి ఒక డిఫరెంట్ టేస్ట్‌ను నెటిజన్ల ముందు ఉంచాడు. ఇక చాలా మంది నెటిజన్లు నిజంగా ఇది సూపర్బ్ కాంబినేషన్ అంటూ కితాబిస్తున్నారు. చదవండి: రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి -
పరాటా మేకర్.. అయ్యాడు సూపర్ క్రికెటర్!
పేదరికంలో పుట్టిన అతను.. ఓ హోటల్లో పరాటాలు చేసేవాడిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. హోటల్ వాళ్లిచ్చే జీతం డబ్బుతోనే క్రికెట్ కిట్ కొనుక్కున్నాడు. తీరిక దొరికిందే తడవుగా కఠోర ప్రాక్టీస్ చేసేవాడు. తొలుత జిల్లాస్థాయిలో ప్రతిభకనబర్చిన అతను.. ఇప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ జట్టుకు ఎంపికయ్యాడు. అతిత్వరలోనే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. పేరు హనన్ ఖాన్. ఊరు ఛామన్. పాకిస్థాన్‌లోని కల్లోలిత ప్రాంతమైన క్వెట్టా ఫ్రావిన్స్‌లో ఉందా ఊరు! క్రికెట్ ఆడే మిగతా దేశాలకంటే పాకిస్థాన్ జాతీయ జట్టులోకి కొత్తగా ఎంపికయ్యే ఆటగాళ్లలో చాలా మంది కడుపేదలు, కష్టపడి పైకిచ్చినవాళ్లే ఉంటారు. అబ్దుల్ రజాక్, యూసఫ్ యొహానా, మొహమ్మద్ ఇర్ఫాన్ లాంటి వాళ్లెందరో అందుకు ఉదాహరణ. హనన్ ఖాన్ విషయానికి వస్తే.. బలూచిస్థాన్‌కు చెందిన ఈ యువకుడు స్థానిక రెస్టారెంట్లో పరాటా మేకర్‌గా పనిచేస్తూ క్రికెట్ ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్‌గా అతని ప్రతిభ గురించి తెలుసుకున్న క్రికెట్ పెద్దలు క్వెట్టా డొమెస్టిక్ గ్రేడ్-2 మ్యాచ్‌లో అవకాశం కల్పించారు. అక్కడ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఎంపికై పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడాడు. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. జనవరి 14 నుంచి పాక్ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ), మలేసియా జట్ల మధ్య లాహోర్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్లోగానీ హనన్ ఖాన్ మెరిస్తేగనుక, నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. ‘ఎన్సీఏ జట్టులోకి ఎంపిక చేసినందుకు క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. అంతా అల్లా దయ. ఎప్పటికైనా జాతీయ జట్టులో ఆడాలన్నదే నా కల’అంటాడు సూపర్ క్రికెటర్‌గా ఎదిన పరాటా మేకర్ హనన్ ఖాన్.