breaking news
Pampore attack
-
ఇఫ్తార్ విందుకు పాక్ ను ఆహ్వానించం: ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ: రాష్ట్ర్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లీం విభాగతమైన ముస్లిం రాష్ట్ర్రీయ మంచ్(ఎమ్ఆర్ఎమ్) దేశ రాజధానిలో ఇస్తున్న ఇఫ్తార్ విందుకు పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ను ఆహ్వానించకూడదని నిర్ణయించింది. జులై 2 న ఎమ్ఆర్ఎమ్ ప్రపంచ ముస్లిం దేశాల రాయబారులకు ఢిల్లీలో ఇఫ్తార్ విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత జవాన్లపై పాక్ ఉగ్రవాద సంస్థ దాడి నేపథ్యంలో ఖండించనందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్ఆర్ఎమ్ కన్వీనర్ మహ్మద్ అఫ్జల్ పేర్కొన్నారు. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఈ నెల 25న జమ్ముకశ్మీర్ లోని పంపొరాలో సీఆర్పీఫ్ పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందగా మరో22 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
తీవ్రవాది కొడుకును కాపాడిన ఆర్మీ
శ్రీనగర్: పాంపోర్ ఎన్ కౌంటర్ నుంచి తీవ్రవాది అగ్రనేత కొడుకును భద్రతా బలగాలు కాపాడాయి. గతవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులు సందర్భంగా 100 మందిని భద్రతా దళాలు రక్షించాయి. వీరిలో తీవ్రవాద సంస్థ హిజబుల్ ముజాహిద్దీన్ అగ్రనేత సయిద్ సలావుద్దీన్ కుమారుడు సయిద్ మొయిన్ ఉన్నాడు. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(ఈడీఐ)లో మొయిన్ ఐటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. సలావుద్దీన్ ముగ్గురు కొడుకుల్లో మొయిన్ ఒకడని, అతడికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఈడీఐపై ఉగ్రవాదుల దాడి తర్వాత మొయిన్ ను పోలీసులు ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. పాకిస్థాన్ కు చెందిన లష్కరే-ఈ-తోయిబా ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి.. సమీపంలోని ఈడీఐ భవంతిలోకి చొరబడిన విషయం విదితమే. మూడు రోజుల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు, ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు.