పద్మ అవార్డును వెనక్కి ఇవ్వనున్న ప్రముఖ శాస్త్రవేత్త
హైదరాబాద్: ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు దేశంలో జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా తమకు లభించిన పలు అవార్డులను వెనక్కి ఇవ్వగా, తాజాగా ప్రముఖ శాస్త్రవేత్త పీ ఎమ్ భార్గవ తనకు లభించిన పద్మ భూషన్ అవార్డును తిరిగి ఇవ్వనున్నట్ల ప్రకటించారు.
భార్గవ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ మాలిక్యులార్ బయాలజీ స్థాపకుడు. శాస్త్రవిఙ్ఞాన రంగంలో ఆయన సేవలకు గాను 1986లోపద్మ భూషన్ అవార్డు లభించింది. దేశంలోని హేతువాదం తీవ్రమైన భయాందోళనల మధ్య ఉన్నదనీ దీనికి నిరసనగా తన అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యం క్రమంగా మతతత్వ ప్రాతిపదికగా మారిపోతుందని భార్గవ ఆరోపించారు.