breaking news
own brothers rape girl
-
బాలిక 32 వారాల గర్భ విచ్ఛిత్తికి కేరళ హైకోర్టు అనుమతి
కొచ్చిన్: సొంత సోదరుడి అఘాయిత్యానికి బలై గర్భం దాల్చిన బాలికకు కేరళ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆమె 32 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి మంజూరు చేసింది. ‘బాధిత బాలిక(15) శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లు వైద్య నివేదికను బట్టి తెలుస్తోంది. గర్భం కొనసాగింపు వల్ల ఆమె సామాజిక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వాలని నిర్ణయిస్తున్నాం’ అని జస్టిస్ జియాద్ రహ్మన్ ఈ నెల 19న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన చర్యలను అమలు చేసి, వారంలోగా పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని మలప్పురం జిల్లా వైద్యాధికారి, మంజేరి మెడికల్ కాలేజి హాస్పిటల్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. -
సొంత సోదరిపైనే... అఘాయిత్యం!
సభ్యసమాజం తలదించుకునే దారుణం ముంబై మహానగరంలో జరిగింది. మీరా రోడ్డుకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఆమె సోదరులు ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు, క్లాస్ టీచర్ కలిసి రెండు రోజుల క్రితం కష్మీరా పోలీసులను ఆశ్రయించారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 17, 12 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలను అరెస్టు చేశారు. ఇద్దరినీ భివాండీలోని బాలల రిమాండు హోంకు పంపారు. బాలికపై అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకోడానికి ఆమెను వైద్యపరీక్షలకు పంపారు. గత సంవత్సరం దీపావళి సెలవుల సమయంలో తన అన్న వేధింపులు మొదలుపెట్టాడని, ఈ ఏడాది ప్రారంభంలో తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తర్వాత కొన్నాళ్లకు తమ్ముడు కూడా అదే పని మొదలుపెట్టాడు. ఇద్దరూ తనను బెదిరించడంతో కూలీలుగా పనిచేసే తన తల్లిదండ్రులకు ఆమె ఏమీ చెప్పుకోలేకపోయింది. ఎట్టకేలకు తన క్లాసు టీచర్‌కు ఆ విషయం చెప్పడంతో విషయం బయటకొచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.