breaking news
Oil And Gas Policy
-
రూ.5,000 కోట్లతో రష్యా చమురు కొనుగోలు
న్యూఢిల్లీ: రష్యా వద్ద నిలిచిపోయిన 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5వేల కోట్లు) డివిడెండ్‌తో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఉన్నాయి. రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన డివిడెండ్ ఆదాయం ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ విదేశ్ రావాల్సి ఉంది. రష్యా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం ఉండిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పశి్చమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత చమురు సంస్థలు రష్యా బ్యాంకుల నుంచి డివిడెండ్ నిధులను తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో న్యాయపరమైన, ఆర్థిక పరమైన చిక్కుల గురించి అధ్యయనం చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రష్యాలోని ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో భారత కంపెనీలు 5.46 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఆయా క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్ విక్రయంపై వచ్చే లాభాల నుంచి తమ వంతు వాటా వీటికి వస్తుంటుంది. రష్యాపై ఆంక్షల తర్వాత అక్కడి నుంచి నిధుల బదిలీకి అవకాశం లేకుండా పోయింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్ పెట్టేందుకు తమ దేశం నుంచి డాలర్లను వెనక్కి తీసుకెళ్లే విషయంలో రష్యా ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణం. రష్యా బ్యాంకుల్లోని ఖాతాల్లో తమకు రావాల్సిన 150 మిలియన్ డాలర్ల డివిడెండ్ ఆదాయం చిక్కుకుపోయినట్టు ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, ఎండీ రంజిత్ రథ్ తెలిపారు. ఐవోసీ, భారత్ పెట్రో రీసోర్సెస్‌తో కలిపితే రావాల్సిన డివిడెండ్ 450 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు. -
గ్యాస్‌కు మార్కెట్ ధరే కరెక్ట్
న్యూఢిల్లీ: ఏడేళ్లలో ప్రపంచంలోనే మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా ఇండియా అవతరించనున్న నేపథ్యంలో గ్యాస్‌కు మార్కెట్ ఆధారిత ధరల విధానమే తగినదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. భారీ స్థాయిలోని దేశ అవసరాలను తీర్చాలంటే తగిన సాంకేతికత కూడా అవసరమని చెప్పారు. ఇక్కడ ఫిక్కీ, గెయిల్ నిర్వహణలో ఏర్పాటైన 8వ ఆసియా గ్యాస్ సదస్సుకు హాజరైన ప్రధాని ప్రసంగిస్తూ ప్రస్తుతం ఇండియా అంతర్జాతీయ స్థాయిలో ఏడో పెద్ద ఇంధన ఉత్పత్తిదారుగా నిలుస్తున్నదని తెలి పారు. అయితే రానున్న రెండు దశాబ్దాలలో ఇంధన సరఫరాను మూడు నుంచి నాలుగు రెట్లు పెంచాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. దేశీయ ఇంధన అవసరాలలో చమురు, గ్యాస్‌లకు 41% వాటా ఉన్నదని చెప్పారు. 2,020కల్లా ఇండియా మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా నిలవనున్నదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన దేశం అమెరికా, చైనా, జపాన్ల తరువాత ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఇంధన వినియోగదారుగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. వెరసి గిరాకీ, సరఫరాల మధ్య సమతౌల్యాన్ని సాధించేందుకు వీలుగా ఇంధన వెలికితీతలో దేశ, విదేశీ కంపెనీలను ప్రోత్సహించాల్సి ఉన్నదని వివరించారు. యూఎస్ షేల్ గ్యాస్ ఆదర్శం ఇంధన ఉత్పత్తిని పెంచడంలో అమెరికా షేల్ గ్యాస్ విప్లవాన్ని ప్రధాని ఉదహరించారు. మార్కెట్ ఆధారిత విధానాలు, సాంకేతికతల ద్వారా సంప్రదాయేతర వనరులను వెలికితీయడంలో అమెరికా బాగా విజయవంతం అయిం దని చెప్పారు. దీంతో ఇంధన నిల్వలు(మిగులు) కలిగిన దేశంగా అవతరించిందని చెప్పారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇండియావంటి దేశాల ఇంధన అవసరాలకు ఇలాంటి విధానాలు అవసరమని వ్యాఖ్యానించారు. ఇంధన భద్రతను సాధించే దిశలో ఇండియా కూడా పలు ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నదని చెప్పారు. ఈ బాటలోనే ఇతర దేశాల్లోని ఇంధన ఆస్తులను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. 80% దిగుమతులే... దేశ చమురు అవసరాల్లో 80% దిగుమతుల ద్వారానే లభిస్తోంది. ఇదే విధంగా 50% గ్యాస్ సరఫరాను కూడా దిగుమతుల ద్వారానే అందుకుంటోంది. ముడిచమురు విషయంలో మార్కెట్ ధరను ఆధారం చేసుకుంటున్నప్పటికీ, గ్యాస్ విషయంలో ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. అయితే వచ్చే ఏడాది(2014) ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరను దాదాపు రెట్టింపునకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కున్న విషయం విదితమే. దీంతో గ్యాస్ ధర ఒక ఎంబీటీయూకి 8.4 డాలర్లవరకూ పెరగనుంది. కొత్త మార్గాల ద్వారా ఇంధనాన్ని వెలికితీసే కంపెనీలకు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని గ్యాస్ ధర పెంపు ద్వారా నమ్మకాన్ని కలిగించనున్నట్లు ప్రధాని చెప్పారు. కొనుగోలుదారులు, విక్రయదారుల మధ్య ధర విషయంలో భారీ అంతరాలుంటే తగిన స్థాయిలో ఇంధనం లభించదని, దేశీయంగా గ్యాస్‌కున్న భారీ గిరాకీ దృష్ట్యా ఇండియా వంటి దేశాలలో ఇది సమస్యలు సృష్టిస్తుందని విశ్లేషించారు. దభోల్-బెంగళూరు పైప్‌లైన్ ప్రాజెక్ట్ జాతికి అంకితం మహారాష్ర్టలోని దభోల్ , కర్ణాటకలోని బెంగళూరు మధ్య గెయిల్ ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం జాతికి అంకితం చేశారు. 1,000 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్‌లైన్‌ను రూ. 4,500 కోట్లతో గెయిల్ అభివృద్ధి చేసింది. 8వ ఆసియా గ్యాస్ సదస్సుకు మన్మోహన్తోపాటు, ఆయిల్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ కూడా హాజరయ్యారు. మహారత్న స్థాయిని అందుకున్న గ్యాస్ దిగ్గజం గెయిల్ మంచి పనితీరును చూపుతున్నదని ఈ సంద ర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఈ పైప్‌లైన్ ద్వారా జాతీయ గ్రిడ్‌కు తొలిసారి దక్షిణాది అనుసంధానమైందని గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠీ పేర్కొన్నారు. పైప్‌లైన్ ద్వారా రోజుకి 1.6 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్‌ఎండీ) గ్యాస్‌ను సరఫరా చేయవచ్చు.