breaking news
Odisha Minister Jogendra Behera
-
'నేను బెండ్ అవలేను.. అందుకే లేస్ కట్టాడు'
న్యూఢిల్లీ: 'నేను వీఐపీని.. నా షూలేస్ కట్టు' అంటూ సెక్యూరిటీ అధికారిచే అనుచిత పని చేయించిన ఒడిశా మంత్రి జోగేంద్ర బెహరా మాట మార్చారు. భిన్నవర్గాల నుంచి ఆయన చర్యపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే స్వరం మార్చి తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అందుకే షూ లేస్ కట్టాలని చెప్పానని అన్నారు. తాను కిందికి ఒంగి అలా చేయలేకపోవడం వల్లే ఆ అధికారికి చెప్పినట్లు తెలిపారు. 'నా ఎడమకాలికి బాగా నొప్పి. నేను ఒంగి ఏ పని చేయలేను. ఆ అధికారి నా షూలేస్ కట్టి ఉండొచ్చు.. అతడు నాకు కుమారుడిలాంటివాడు. నేను గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సకు వెళుతున్నాను. కావాలంటే మీకు మెడిసిన్ తీసుకున్న రశీదులు కూడా చూపించగలను' అని అన్నారు. -
'నేను వీఐపీనీ..జెండా ఎగురవేసింది నేనే'
-
'నేను వీఐపీనీ..జెండా ఎగురవేసింది నేనే'
భువనేశ్వర్: ఒడిశా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జోగీంద్ర బెహరా ఓ వివాదంలో చిక్కుకున్నారు. వ్యక్తిగత సెక్యూరిటీ అధికారితో షూ లేస్ కట్టించుకుంటూ స్థానిక మీడియాకు చిక్కారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అయితే తాను చేసిన పనికి సమర్థించుకున్న మంత్రివర్యులు పైపెచ్చు తాను వీఐపీ నంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...కియోంజర్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి జోగీంద్ర బెహరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం జోగీంద్ర బెహరా షూ తొడుక్కుంటున్న సమయంలో ఆయన పీఎస్వో మంత్రి షూ లేసును కట్టడం వీడియోలో కనిపించింది. దీంతో ప్రతిపక్షాలు మంత్రిపై చర్యలపై విమర్శలు ఎక్కుపెట్టాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనను చూస్తుంటే ఇది బ్రిటిష్ మనస్తత్వానికి ప్రత్యక్ష నిదర్శనమని న్యాయవాది ప్రహ్లాద్ సింగ్ వ్యాఖ్యనించారు. కాగా తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన మంత్రి జోగీంద్ర .. తానో వీఐపీనని, జెండా ఎగురవేసింది తానే కానీ పీఎస్వో కాదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు మంత్రి వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం స్పందించలేదు.