breaking news
north zone police hyderabad
-
రోడ్డుపై డబ్బులు పడేసి... ఆపై చోరీలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజల దృష్టిని మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ష్ర్ట దొంగలను హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 9లక్షల 40వేల నగదు, నాలుగు బైకులు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన ఎ1 కిరణ్, ఎ2 తులసింధర్‌లపై తమిళనాడు, కర్ణాటక రాష్ష్ర్టాల్లో గతంలోనూ 23 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిద్దరిని విచారించగా మరో ఎనిమిది కొత్త కేసులు బయటకు వచ్చాయని, అలాగే ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో చోరీలకు పాల్పడినట్లు తేలిందన్నారు. రోడ్డుపై కరెన్సీ పడేయడం, వాహనాలను పంక్చర్ చేసి ఆపై చోరీలకు పాల్పడడంలో వీరిద్దరు ఆరితేరారని పేర్కొన్నారు. కాగా గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వీరిద్దరు ఆ తర్వాత కూడా చోరీలకు పాల్పడినట్లు తెలిసిందనన్నారు. నగరంలో మరోసారి చోరికి పాల్పడుతుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిందని, ఆ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. -
నగరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బుధవారం రట్టు చేశారు. నార్త్ జోన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా నాయకుడు నైజీరియాకు చెందిన రెఫిల్తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్‌తోపాటు 5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 ల్యాప్‌టాప్‌లు, 15 సెల్ఫోన్లతోపాటు రూ. 33,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరికి సహకరిస్తున్న టోలిచౌకికి చెందిన మరో ఏడుగురి నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. గోవా కేంద్రంగా ఈ మూఠా కార్యకలాపాలు నిర్వహిస్తుందని పోలీసులు తెలిపారు.