breaking news
NMDC power plant
-
ఎన్ఎండీసీ షేర్ల బైబ్యాక్‌కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇనుప ఖనిజ మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీ.. రూ.1,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఆర్థిక శాఖ మంగళవారం దీనికి ఆమోదం తెలిపింది. బైబ్యాక్ విధి విధానాలు, తేదీలను ఎన్ఎండీసీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించనుంది. బైబ్యాక్ కారణంగా ఎన్ఎండీసీలో 72.43% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుంది. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్య సాధన కోసం షేర్లను బైబ్యాక్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఒత్తిడిచేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే 9కు పైగా ప్రభుత్వ రంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. ఈ జాబితాలో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, ఐఓసీ, ఎన్‌హెచ్‌పీసీ, భెల్, నాల్కో, కొచ్చిన్ షిప్‌యార్డ్, ఎన్‌ల్‌సీ, కేఐఓసీఎల్‌లు ఉన్నాయి. ఈ కంపెనీల షేర్ల బైబ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.9,000 కోట్లు సమకూరుతాయని అంచనా. కాగా, బీఎస్ఈలో ఎన్ఎండీసీ షేర్ 0.1 శాతం తగ్గి రూ.95 వద్ద ముగిసింది. -
ఎన్ఎండీసీ విద్యుత్ ప్లాంటుకు అనుమతి వాయిదా
హైదరాబాద్: ప్రభుత్వ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీకి చెందిన ఎన్ఎండీసీ పవర్ ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన విద్యుత్ ప్లాంటుకు అనుమతులు ఇప్పట్లో లభించేలా లేవు. ప్రతిపాదిత స్థలం సారవంతమైన వ్యవసాయ భూమి కావడంతో పర్యావరణ, అటవీ శాఖకు చెందిన నిపుణుల కమిటీ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ప్రత్యామ్నాయ స్థలం ఎంపికకు ఎన్ఎండీసీకి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ప్రతిపాదిత ప్రాజెక్టును పెండింగు జాబితా నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ కంపెనీ అయిన ఐఈడీసీఎల్‌తో కలసి ఎన్ఎండీసీ గోండా జిల్లాలో రూ.3 వేల కోట్లతో 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును నెలకొల్పాలని భావించింది. గోండా వెలుపల అనుమతి ఇవ్వతగ్గ స్థలాన్ని చూసుకోవాల్సిందిగా ఎన్ఎండీసీకి కమిటీ స్పష్టం చేసింది.