breaking news
new Dzire
-
లక్ష మార్కు దాటిన న్యూ డిజైర్
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ న్యూ డిజైర్ అమ్మకాల్లో దూసుకుపోతుంది. లాంచ్ అయిన ఐదున్నర నెలల్లోనే లక్ష యూనిట్ల మార్కును చేధించింది. 2017 మే నెలలో ఈ మూడో తరం డిజైర్‌ను మారుతీ లాంచ్ చేసింది. లక్ష యూనిట్ల సేల్స్ మార్కును చాలా త్వరగా సాధించినట్టు మారుతీ సుజుకీ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త డిజైర్ బ్రాండును మొత్తం కొత్త లెవల్లో యువత కోసం డిజైన్ చేసినట్టు మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ఎస్ కల్సి చెప్పారు. అనతికాలంలోనే ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఇది అత్యంత పాపులర్ బ్రాండ్ స్థాయికి ఎదిగిందని తెలిపారు. పూర్తిగా కొత్త హీయర్టెక్ట్ ప్లాట్ ఫామ్ ను ఆధారం చేసుకుని, దీన్ని మారుతీ సుజుకీ రూపొందించింది. ఆటో గేర్ సిఫ్ట్(ఏజీఎస్) టెక్నాలజీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారని, 2017 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఏజీఎస్ వేరియంట్‌ను కస్టమర్లు ఎంపికచేసుకోవడం 17 శాతం పెరిగిందని మారుతీ సుజుకీ తెలిపింది. స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, మిర్రర్ లింక్ టెక్నాలజీలతో ఈ మోడల్‌ను రూపొందించింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. డీజిల్ వెర్షన్ లీటర్‌కు 28.4 కిలోమీటర్ల మైలేజ్‌ను, పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 22 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. -
11వేలతో ఈ కారును బుక్ చేసుకోండి!
న్యూఢిల్లీ : ఎప్పటినుంచో వేచిచూస్తున్న మారుతీ సుజుకీ తనకొత్త సెడాన్ 2017 డిజైర్ ను మే 16న మార్కెట్లోకి లాంచ్ చేయబోతుంది. గతవారం ఆవిష్కరించిన ఈ కొత్త సెడాన్ ప్రీ-బుకింగ్స్ ను ఈ కంపెనీ ప్రారంభించేసింది. లాంచింగ్ కు రాబోతున్న 2017 డిజైర్ వాహనాన్ని ముందస్తు పేమెంట్ కింద 11వేల రూపాయలు కట్టి బుకింగ్ చేసుకోవచ్చని మారుతీసుజుకీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 2000 డీలర్ షిప్ లలో ఈ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో రాబోతున్న నాలుగు వేరియంట్లలో పలు రకాల కాస్మోటిక్, స్టైలింగ్, ఫీచర్లను మారుతీ సుజుకీ మార్చింది. లుక్స్... ఈ కొత్త డిజైర్ పూర్తిగా న్యూ, ప్రెష్ లుక్‌లో వస్తోంది. హెక్సాగోనల్ గ్రిల్ తో దీన్ని కంపెనీ రీడిజైన్ చేసింది. ఈ కొత్త డిజైర్ 40ఎంఎం వైడర్, 20ఎంఎం లాంగర్ వీల్ బేస్‌తో ఉంది. అతిపెద్ద ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కర్వ్డ్ ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌ను, పూర్తిగా రీడిజైన్ చేసిన అలోయ్ వీల్స్ ను ఇది కలిగి ఉండబోతుంది. ఇంజిన్.. గరిష్ట పవర్ 83బీహెచ్పీ, 115ఎన్ఎం గరిష్ట టర్క్ ఉత్పత్తిచేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను ఇది కలిగి ఉందట. అదేవిధంగా 74బీహెచ్పీ పీక్ పవర్, 190ఎన్ఎం పీక్ టర్క్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ మల్టి-జెట్ ఇంజిన్ తో దీన్ని రూపొందించిందని తెలిసింది ట్రాన్స్మిషన్.. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది కలిగి ఉందట. ఫీచర్లు.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటో బ్లూటూత్, యూఎస్బీ, అక్స్-ఇన్. ధర.. బేస్ ధర ఆరు లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ధర తొమ్మిది లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిప్ట్, న్యూ టాటా టిగోర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, ఫోక్స్ వాగన్ అమియోలకు గట్టిపోటీనే ఇచ్చేందుకు ఇది లాంచింగ్ కు సిద్ధమైంది.