breaking news
neautrition
-
చిన్నారులకు పౌష్టికాహారం తప్పనిసరి
శ్రీకాకుళం సిటీ : జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా విధిగా పౌష్టికాహారాన్ని అందజేయాలని స్త్రీ,శిశు సంక్షేమశాఖామంత్రి పీతల సుజాత ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఐసీడీఎస్, గనుల శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీప్రాంతాల్లో పౌష్టికాహారంపై ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటుచేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రాజెక్ట అధికారులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ కొత్తూరు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు నిరంతరం తాలాలు వేసి ఉంటున్నాయంటూ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది, అధికారుల ఫోన్ నంబర్లను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం గనులశాఖపై మంత్రులు సమీక్షించారు. అంతకుముందు స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రులు సందర్శించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, స్పెషల్ కమిషనర్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ –2 రజనీకాంతరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆదిత్యుని సేవలో.. శ్రీకాకుళం సిటీ : అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారిని మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ పి లక్ష్మీనరసింహంలు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలు చేసి ఆలయ విశిష్టతను వివరించారు. అనివెట్టి మండపంలో ఆశీర్వదించిన అర్చక బృందం ఈవో వి.శ్యామలదేవి చేతుల మీదుగా ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వీరి వెంట కోరాడ హరగోపాల్, గీతాశ్రీకాంత్‌లు ఉన్నారు. -
పోషకాహార లోపాన్ని నివారించండి
♦ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత విజయనగరంఫోర్ట్: పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీలతో శనివారం ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ–పాస్ విధానంద్వారానే అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు తీసుకోవాలని స్పష్టం చేశారు. పిల్లల్లో రక్తహీనతను 50శాతం వరకు తగ్గించాలన్నారు. పిల్లలకు తల్లి పాలు 6 నెలల వకుకు తాగించేలా బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు బరువు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ నిధులతో నిర్మించనున్న 596 అంగన్వాడీ భవనాలను త్వరితగతిన నిర్మిం చాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు పూర్థిస్థాయిలో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ తదితరులు పాల్గొన్నారు.